Polamreddy Dinesh Reddy | TDP
Polamreddy Dinesh Reddy | TDP
June 5, 2025 at 01:51 PM
స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడుగేద్దాం – ప్లాస్టిక్ పెనుబుతాన్ని తరిమేద్దాం! 🌱♻️ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరావతి సమీపం "అంతవం" గ్రామంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణపై సంకల్పం తీసుకున్నాం. దేశంలో 33% పచ్చదనం ఉన్నా, మన ఆంధ్రప్రదేశ్‌లో అది కనీసం 50% ఉండేలా చేయాలన్న లక్ష్యంతో సీఎం Nara Chandrababu Naidu గారు, డిప్యూటీ సీఎం Pawan Kalyan గారు పర్యావరణ మేనేజ్మెంట్ కార్యక్రమాలపై దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలిస్తూ వాహనాల ట్రాకింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల వినియోగంపై వివరణ ఇచ్చారు. పర్యావరణ హానిని తగ్గించడంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఫ్యాక్టరీలకు వ్యర్థాల నిర్వహణపై సూచనలు ఇవ్వడమే కాకుండా, పర్యావరణ పద్ధతులు పాటించేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. సింగిల్ యూస్ ప్లాస్టిక్‌ను విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే నూతన ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించే ప్లాస్టిక్ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్రాన్ని పచ్చదనం, పరిశుభ్రతతో నిండిన హరితాంధ్రగా మారుస్తామన్న సంకల్పం ఈ కార్యచరణ ద్వారా మరింత బలపడింది. #worldenvironmentday #environmentprotection #apemc #greeninitiative #chandrababunaidu #cleanandgreenap 🌱 #pawankalyan
Image from Polamreddy Dinesh Reddy | TDP: స్వచ్ఛ హరితాంధ్ర కోసం అడుగేద్దాం – ప్లాస్టిక్ పెనుబుతాన్ని తరిమేద్దాం!...
❤️ 👍 2

Comments