Hindu Sainyam🚩
Hindu Sainyam🚩
May 23, 2025 at 01:53 AM
✊ CCR మహాప్రస్థానం..: ఆర్నకొండ నుండి అమలాపురం వరకు.. అవినీతి నిర్మూలన & ప్రజా ప్రయోజనార్థం - అవగాహన.. అవినీతి నిర్మూలన మేరకు కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల కలెక్టరేట్ లలో భేటీ అయిన సిసిఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు & టీమ్.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు & కేంద్ర ప్రభుత్వం సహకారం అందించే దిశగా.. ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ లో ఉన్న కరప్షన్.. గ్రామ పంచాయతీల నిధులు ఖర్చులు మొదలుకొని, ప్రభుత్వ ఆసుపత్రులు, రెవెన్యూ, పోలీస్, పౌర సరఫరాల వరకు... సిసిఆర్ సంస్థ స్థాపన నుండి ఈరోజు వరకు చేసిన రికార్డుల తనిఖీల వివరాలు, ఫోటోలు, న్యూస్ పేపర్స్, రిపోర్ట్స్, రిజల్ట్స్, సక్సెస్, ఫేల్యువర్, ఛాలెంజెస్ వివరాలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లాలని సిసిఆర్ సంస్థ భావిస్తుందని తెలియజేశారు. దీనికై జిల్లా కలెక్టర్ కార్యాలయాల నుండి మొదలు PMO వరకు సహకారం కావాలని: రికార్డుల తనిఖీల తర్వాత తదుపరి చర్యల మేరకు ప్రభుత్వ ఉన్నత అధికారులు సంవత్సరాల తరబడి చర్యలు తీసుకోకుండా కోర్టుకు వెళ్లే పరిస్థితులు వచ్చాయని సిసిఆర్ సంస్థ భావించారు. కాని, ఇది 100+ GP & ఇతర రికార్డుల తనిఖీలకు సాధ్యం అవదని.. CMO, PMO కార్యాలయాలకు అధికారికంగా CCR NGO మీట్ అయ్యే విధంగా సహకరించాలని అన్నారు. - CCR Governing Body.

Comments