PALLA RAJESHWAR REDDY
PALLA RAJESHWAR REDDY
May 31, 2025 at 06:38 AM
డల్లాస్: తేది:(30-5-2025) భారత దేశ చరిత్రలో అత్యంత భారీ బహిరంగసభలను పెట్టిన చరిత్ర టీఆర్ ఎస్ పార్టీది.. -అది కరీంనగర్ శంఖారారం..వరంగల్ సభ..ప్రగతి నివేదన సభ..ఎల్కతుర్తి రజతోత్సవ సభ.. -రేపటి డల్లాస్ సభలకు మీరు, మీ బంధువులు వచ్చి విజయవంతం చేయాలి.. డల్లాస్ లో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు డల్లాస్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం మరియు భారత రాష్ట్ర సమితి (BRS) రజతోత్సవ వేడుకల్లో భాగంగా జూన్1 న జరిగే ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేందుకు డల్లాస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు హాజరై మాట్లాడారు. 👉టీఆర్ఎస్ ఆవిర్భావం తరువాత మొట్టమొదటి సభ కరీంనగర్ నిర్వహించిన శంఖారావం సభకు లక్షలాదిగా మంది ప్రజలు తరలివచ్చి భారీ విజయవంతం చేశారు. 👉ఆ సమయంలో మొదటి సభ కావడంతో అసలు జనం వస్తరా లేదా అని కొందరు నాయకులు కేసీఆర్ గారితో అంటే మీరు అన్ని ఏర్పాట్లు చేయండి..జనం వస్తరు..అని అప్పుడు కరీంనగర్ జిల్లా ఇన్ చార్జి కెప్టెన్ లక్ష్మీకాంతారావు గారితో అన్నారు. 👉అసలే ఎండాకాలం...ఇంకా భావజాల వ్యాప్తి జరగలే కేసీఆర్ సారు జనం వస్తరని అంటున్నరని ఎట్ల వస్తరని స్థానిక నాయకులు అడిగారు. అయితే సభకు ఊహించనంత భారీగా ప్రజలు వచ్చి విజయవంతం చేయగా, కరీంనగర్ శంఖారావం సభ దేశ చరిత్రలో, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద సభగా విజయవంతమైంది. 👉ఈ విషయమై కెప్టెన్ సాబ్ చెప్తుంటడు..2001 నుంచి కేసీఆర్ గారిని చూస్తున్నం..ఆయన ఆలోచనే విధానం..ముందు చూపు అలా ఉంటది. మొట్ట మొదటి ఏ సభ పెట్టిన ఆయన సూచనలు చేస్తడు. మేం పాటించుకుంటూ వెళ్తం..సభ సక్సెస్ అవుతది అంతే అని పేర్కొన్నారు. 👉భారత దేశ చరిత్రలో అత్యంత భారీ బహిరంగసభలను పెట్టిన చరిత్ర టీఆర్ ఎస్ పార్టీది..అది కరీంనగర్ శంఖారారం..వరంగల్ సభ..ప్రగతి నివేదన సభ..ఎల్కతుర్తి రజతోత్సవ సభ.. 👉ఎల్కతుర్తిలో జరిగిన సభకు లక్షలాది మంది జనం వచ్చి భారీ విజయవంతం చేశారు. అతి అత్యంత పెద్ద సభ. లక్షలాది మంది జనం సభకు తరలివచ్చారు..రాలేని లక్షలాది మంది జనం మూడు నాలుగు గంటలకు టీవీలకు అతుక్కుపోయి కేసీఆర్ గారి మాటలను విన్నారు. 👉ఆ సభ ద్వారా తెలంగాణ ప్రజలకు ఓ నమ్మకం ఏర్పడింది. ఎక్కడ ఏం పోగొట్టుకున్నమో అందరికీ తెలిసింది. మళ్లీ పోగొట్టుకున్న వ్యక్తిని, పార్టీని కావాలని జనం కోరుకుంటున్నరు. అందుకు ఎల్కతుర్తి సభ నాంధిగా నిలిచింది. దాని తరువాత ఓ నమ్మకంతో నిర్వహించేది డల్లాస్ లో సభ. 👉కేసీఆర్ గారి నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ సాధన కోసం పోరాడిన చంద్రశేఖర్ రావు గారు గమ్యాన్ని ముద్దాడారు. బీఆర్ ఎస్ హయంలో పదేళ్లపాలనలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకున్నాయి. 👉తాగునీరు, సాగునీరు, రియల్ వ్యాపారం, సంక్షేమం, అనేక అభివృద్ధి పనులు చేపట్టి తెలంగాణను రోల్ మోడల్ గా చేశారు. 👉రేపటి డల్లాస్ సభలకు మీరు, మీ బంధువులు వచ్చి విజయవంతం చేయాలి. 👉ఇటీవల వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ మంత్రి సర్వే చేయించారు. 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 సీట్లను బీఆర్ ఎస్ పార్టీ గెలవబోతోందని విషయం తెలిసింది. రెండు మూడు రోజుల్లో ఆ విషయం పేపర్లు, టీవీల్లో వస్తది. తెలంగాణ సమాజం మొత్తం మళ్లీ కేసీఆర్ సార్, బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నరు. 👉డల్లాస్ సభకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వస్తరు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. అందరూ వచ్చి డల్లాస్ లోని సభలను విజయవంతం చేయాలి

Comments