
PALLA RAJESHWAR REDDY
June 5, 2025 at 06:06 PM
హైదరాబాద్ తేది:(5-6-2025)
అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే పల్లా గారికి ఘన స్వాగతం..
హైదరాబాద్:
జనగామ ఎమ్మెల్యే డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు ఇటీవల అమెరికాలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పాల్గొని తిరిగి గురువారం రాత్రి స్వదేశానికి చేరుకున్నారు. హైద రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఆయన అడుగు పెట్టగానే, జనగామ నియోజకవర్గానికి చెందిన పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు ఆయనకు శాలువాలు కప్పి, పుష్ప గుచ్ఛాలతో సత్కరించారు.
ఈ సందర్బంగా అమెరికాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన సభ విశేష స్పందన తెచ్చుకుందన్నారు. తెలంగాణ అభి వృద్ధి మార్గాన్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో ఇది మైలురాయిగా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.

👍
1