
గోడపత్రిక
May 25, 2025 at 11:50 AM
కడపలో జరగబోయే పద్మశ్రీ నటరత్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు మహానాడు సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి చుట్టూ పసుపు తోరణాలతో నింపేశారు
దీనిని ఎవరూ తప్పుగా భావించకూడదు
రాజమండ్రిలో బత్తిని సుబ్బారావు గారి ఇంటిదగ్గర ఆయన విగ్రహానికి చొక్కాకు పసుపు రంగు రాసారు ఒక టర్మ
అప్పుడు తెలుగుదేశం తరఫున రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ కళ్యాణ చక్రవర్తి సుబ్బారావు గారి అల్లుడు
ఇవన్నీ సహజం రాజకీయ కోణంలో ఏదో ప్రతి చర్యగా భావించకూడదు
కొన్ని పొలిటికల్ కంప్రెషన్స్, డెమొక్రటిక్ కంపల్సన్స్ ఉంటాయి
మా గురువుగారు రామోజీరావు గారు ఒకసారి తన ఎడిటోరియల్ నోట్లో రాశారు ఈ పేపరు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ని దింపేయడమే మా ఆశయం అన్నారు
తరువాత మా రాజు గురువు మాట లెక్క చేయకుండా చంద్రబాబు గారు రాజీవ్ గాంధీతో పొత్తు పెట్టుకున్నారు
అప్పుడు ఆయన చెప్పిన మాట ఇది డెమొక్రటిక్ కంపల్సన్
ఎలా గెలిచాము అన్నది కాదు గెలిచామా లేదా అది ముఖ్యం