Harish Balayogi
                                
                            
                            
                    
                                
                                
                                May 15, 2025 at 09:10 AM
                               
                            
                        
                            ఈరోజు విజయవాడలో దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ రీజినల్ మేనేజర్ మరియు డిప్యూటీ చీఫ్ ఇంజనీర్లతో సమావేశంలో పాల్గొన్నాము. కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్ భూసేకరణ సంబంధిత అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. భూసేకరణ ప్రక్రియలో ఎదురైన లోటుపాట్లు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇంకా చెల్లించాల్సిన నష్టపరిహారాల అంశాలు ఈ సందర్భంగా ప్రస్తావించాము.
రైతులకు న్యాయం జరగాలి అనే దృక్కోణంతో, వారికి తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టంగా సూచించాము. భూసేకరణ అవార్డుల జారీ, పరిహారం చెల్లింపు, క్లియరెన్స్ ప్రక్రియల వేగవంతం గురించి కేంద్రీయ స్థాయిలో ఇప్పటికే కొనసాగుతున్న చర్చల్లో భాగంగా, ఈ సమావేశం కొనసాగింపుగా జరిగింది.
అలాగే, మండపేట మండలంలోని ద్వారపూడి రైల్వే స్టేషన్‌లో కనీస సౌకర్యాల లేకపోవడంపై ప్రయాణికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో, స్థానిక శాసన సభ్యులు శ్రీ వేగుళ్ల జోగేశ్వరరావు గారితో కలిసి ఇటీవల స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించామన్న విషయాన్ని ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశాము. అక్కడ గుర్తించిన లోపాల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేయగా, పరిస్థితులను సమీక్షించేందుకు ప్రత
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                    
                                        3