
Harish Balayogi
May 16, 2025 at 10:54 AM
ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగ అవకాశాలకు భరోసా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని ఘంటాపథంగా చెప్పవచ్చు. విజయవాడలోని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఎండీ జి గణేష్ కుమార్ గారితో సమావేశమై ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారితో ఇటీవల చర్చించిన విషయాల గురించి తెలియజేయడం జరిగింది. స్కిల్ ఇండియా మిషన్ లో భాగంగా అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ కార్యక్రమాల పురోగతి గురించి ఈ సమావేశంలో చర్చించాము.యువతలోని నైపుణ్యం వెలికితీసి ఉపాధి, ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచడం కోసం ఎన్డీయే ప్రభుత్వం చేస్తున్న కృషి భారతదేశాన్ని ఆత్మనిర్భర్ వైపు నడిపిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా కోనసీమ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేక శ్రద్ధ చూడాలని ఎండీ గణేష్ కుమార్ గారిని ప్రత్యేకంగా కోరడం జరిగింది.

❤️
👍
3