
𝕶𝖎𝖗𝖆𝖓 𝕴𝖓𝖋𝖑𝖚𝖊𝖓𝖈𝖊𝖗
June 13, 2025 at 09:49 AM
*అందరినీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు*
మీరు చేసే ప్రతి పనీ కొందరికి నచ్చదు. మీరు చెప్పే ప్రతి మాటా ఇంకొందరికి తప్పుగా అనిపిస్తుంటుంది. మీరు విశ్వసించే ప్రతి విషయమూ మరికొందరికి హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అందరికీ నచ్చేలా ఉండటం మీ లక్ష్యమైతే మీరెప్పటికీ అందులో విజయం సాధించలేరు.
ఎందుకంటే ప్రతి ఒక్కరినీ మెప్పించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అందుకే ఇతరుల కోసం తరచూ మీ అభిప్రాయాలను, లక్ష్యాలను మార్చుకోకండి.
-కోరీ ముస్కరా, పాజిటివ్ లైఫ్ కోచ్