APTEACHERS
June 5, 2025 at 09:45 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ – డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ( SSC Board) పత్రికా ప్రకటన – 05.06.2025 డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయం నూతన భవనానికి మార్పు విజయవాడలో, గొల్లపూడి ప్రాంతంలో ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ కార్యాలయాన్ని గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, గరుడవేగ టవర్స్, లక్ష్మినరసింహ కాలనీ, సర్వీస్ రోడ్, కమిషనర్ గారి కార్యాలయం (కాలేజీ ఎడ్యుకేషన్) పక్కన ఉన్న నూతన భవనానికి మార్చినట్లు డిజిఇ డైరెక్టర్ డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఇకపై డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ క్రింద పేర్కొన్న చిరునామాలో కార్యకలాపాలు నిర్వహించనున్నది: డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ , గరుడవేగ టవర్స్, లక్ష్మినరసింహ కాలనీ, సర్వీస్ రోడ్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం పక్కన, మంగళగిరి (మండలం), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522503. సంబంధిత అధికారులు, ప్రజలు ఈ మార్పును గమనించి అవసరమైన కార్యనిర్వహణను చేయవలసిందిగా కోరడమైనది. డా. కె.వి. శ్రీనివాసులు రెడ్డి డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ , గరుడవేగ టవర్స్, లక్ష్మినరసింహ కాలనీ, సర్వీస్ రోడ్, కాలేజీ ఎడ్యుకేషన్ కమిషనర్ కార్యాలయం పక్కన, మంగళగిరి (మండలం), గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ – 522503 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
❤️ 1

Comments