
Venugopal Reddy Chenchu (NRITDP)
May 29, 2025 at 05:02 PM
అంగరంగ వైభవంగా జరిగిన మహానాడు కార్యక్రమానికి నేను హాజరు కాలేకపోయాను. కానీ ఆలోటు మా నాన్నగారు తీర్చారు. Thank you Appa!!
తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా దేశం కానీ దేశంలో ఉంటూ నాకున్న వనరులతో పార్టీకోసం నా వంతు సహాయం చేస్తూన్నాను. కానీ ఈరోజు పసుపు పండగ మిస్ అవ్వాల్సి వచ్చింది.🥲
కడప జిల్లాలో వైసీపీ వాళ్ళు చాలామంది అంటుంటారు – మీరు కడపలో గెలవలేరు, “మీ రెడ్లు ఎంత చేసినా తెలుగుదేశం పార్టీ మీకు ఏమీ చేయదు, మీకు గుర్తింపు ఉండదు” అని.
కానీ ఈరోజు మా కడప జిల్లా ప్రజలకు, నాయకులకు మహానాడు పండగ జరిపే అవకాశాన్ని ఇచ్చినందుకు మా పెద్దాయన Nara Chandrababu Naidu గారికి Nara Lokesh అన్నకు జీవితాంతం ఋణపడి ఉంటాం.🙏🙏
ఉమ్మడి కడప జిల్లాలో 25 సంవత్సరాల తర్వాత పసుపు జెండా ఎగరేసాం. వైసీపీ అడ్డాగా చెప్పుకునే కడప, రాయచోటి లాంటి నియోజకవర్గాల్లో మన జెండా నిలబెట్టాం, ఈరోజు మహానాడు సభతో మన సత్తా ఏందో ప్రతిపక్షానికి చూపించాం.
ఈ మహానాడు పండగను ఇంత విజయవంతంగా చేసిన ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యునికి, ప్రతి కార్యకర్తకి మనస్పూర్తిగా ధన్యవాదాలు.
జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేశ్..✌️✌️
#mahanadu2025begins #mahanaduroars #tdpmahanadu2025 #mahanadu2025 #telugudesamparty
❤️
1