
Venugopal Reddy Chenchu (NRITDP)
93 subscribers
About Venugopal Reddy Chenchu (NRITDP)
Before you are a leader, success is all about growing yourself. When you become a leader, success is all about growing others..😊😊
Similar Channels
Swipe to see more
Posts

సారీ… కొద్దిరోజులు రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుని అమెజాన్ అడవులకి వెళ్తున్నాను.!! ఇక్కడ రాజకీయాల కోసం పెట్టె సమయం, అక్కడ వంద మొక్కలు నాటి, వంద మూగజీవాలను రక్షించి వస్తే నాకూ అదృష్టం కలిసొస్తుందేమో… చూద్దాం. ఏంటి ఈ దౌర్భాగ్యం? ముక్కు మొహం తెలియని వ్యక్తి, ‘జై జగన్’ అని కేక్ కట్ చేసిన వ్యక్తి, నాలుగు సినిమా డైలాగులు చెబితే సలహాదారు అంటున్నారు… మరి మేము ఏంటి ఇంకా? పని లేకుండా, పెళ్లాం పిల్లల్ని వదిలి, లక్షల జీతాలు వదులుకొని, గ్రౌండ్‌లో లక్షలు పెట్టి పార్టీకి పనిచేశాం. మేమూ కూడా… ఆ డబ్బుతో విత్తనాలు చల్లుకోవచ్చు కదా @ncbn సార్?? నిజంగా కడుపుమండిపోతుంది @naralokesh అన్నా, పార్టీ కోసం నిజాయితీగా పనిచేసిన కార్యకర్తలకు. ఒకసారి మా స్థానంలో నిలబడి ఆలోచించండి. #WeStandwithTDPkarayakarta #TDPTwitter #AndhraPradesh #PoliticalReality #GrassrootsStruggle #VoiceOfTheGround #PartyLoyalists


నాడు జై జగన్ అనమంటే అనలేదు అని తోట చంద్రయ్య ని నడి రోడ్ లో పీక కోసి చంపారు..😡 ఇప్పుడు మన మంచి ప్రభుత్వంలో జై జగన్ అన్న కొమెర అంకారావ్ (జాజి) అనే వ్యక్తికి సలహాదారు పదవి ఇచ్చారు..🤔 మీకు తెలిసి జరిగిందో, తెలియక జరుగుతున్నాయో కానీ ఇది మాత్రం నిజంగా కష్టపడిన కార్యకర్తలని అవమానించడమే @naralokesh అన్న, @ncbn సార్. పార్టీలో కనీస గుర్తింపుకోసం వేలమంది కార్యకర్తలు వేచి చూస్తున్నారు.. అలాంటి వాళ్ళను కాదని ఈ జై జగన్ అన్న వారికీ సలహాదారుడి పదవి అంటే దేనికి అర్థం? రాత్రి పగలు తేడా లేకుండా పార్టీకోసం పనిచేసి, వైసీపీ వాళ్ళదగ్గర అమ్మనాబూతులు తిట్టించుకుంటూ, వాళ్ళని ఎదిరిస్తున్న పార్టీ కార్యకర్తను పట్టించుకోరా? కార్యకర్తే అధినేత అని మీరు అంటున్నారు కానీ పరిస్థితి ఆలా లేదు, కార్యకర్తలకు గుర్తింపు లేదు అన్నది వాస్తవం.. అయన చేసింది మంచిపనే, పర్యావరణాన్ని కాపాడుతున్నారు, దానికోసం ప్రభుత్వం తరుపున సత్కరించండి, కావాలంటే సపోర్ట్ చేయండి కానీ, ఇలా నామినేటెడ్ పొజిషన్స్ ఇవ్వాల్సిన పని లేదు.. కార్యకర్తలతో మాకు సంభంధం లేదు, మేము ఇలానే చేస్తాం అంటే మన గొయ్యి మనమే తీసుకుంటున్నాం.. పార్టీ మంచికోరి చెబుతున్న అన్న, దయచేసి ఆలోచించండి.. సారీ తప్పుగా మాట్లాడితే, కానీ ఇది పార్టీకి నష్టం చేస్తుంది అందుకే చెప్పా.. #WeStandwithTDPkarayakarta #NaraLokesh #ChandraBabuNaidu #IdhiManchiPrabhutvam #TeluguDesamParty

ఢిల్లీలో బిజీ బిజీగా యువగలం రధసారధి.. గల్లీలో గలీజుగా వైఎస్ జగన్.. రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం నారాలోకేష్.. రాజకీయానికి కావాల్సిన శవాలకోసం జగన్.. అధికారం ప్రజా శ్రేయస్సుకోసం అంటున్న నారా లోకేష్.. అధికారం కక్ష రాజకీయాలకోసం అంటున్న జగన్.. ఇద్దరికి తేడా చూసారా? నాయకుడికి, నరరూప రాక్చసుడికి ఉన్నంత తేడా ఉంది.. రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకుడు @naralokesh .. రాష్ట్ర వినాశనం కోసం నరరూప రాక్షసుడు @ysjagan..!! Both are not same.🔥🔥 #YSJaganCriminalPolitics #YCPCriminals #JaganFailedCM


అరే బాబు… జీవితకాల మెంబర్షిప్ తీసుకున్నప్పుడే నిర్ణయం తీసుకున్నా – రాజకీయాల్లో ఉంటే టీడీపీ, లేకపోతే రిటైర్మెంట్ అనీ! రాజకీయం నా వృత్తి కాదు… ఇది నా ప్యాషన్! నా స్వలాభం కోసం కాదు, డబ్బు కోసమైతే అసలే కాదు. రాజకీయన్నే జీవితం అనుకోని జీవితాలని పణంగా పెట్టి మండల, గ్రామా స్థాయిలో పనిచేస్తున్న సామాన్య కార్యకర్తకోసమే మా నాయకుల్ని ప్రశ్నించా.. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నా, ప్రజలకు ఏదైనా మేలు చేయాలి అన్న తపనతో రాజకీయం లోకి వచ్చా. అరే బాబు… ఊర్లో పొలం పని చేసుకుంటూ, ట్రాక్టర్ డ్రైవర్ స్థాయినుండి ఈ స్థాయికి వచ్చా. ప్రతి అడుగులో ఎన్నో ఆటుపోట్లు చూసిన వాడిని, మీరు ఏంది నా గురించి మాట్లాడేదీ? 10 వేల రూపాయలు సంపాదించడం కష్టం అనుకునే స్థాయి నుంచి 10 మందికి సాయం చేసే స్థాయికి వచ్చా.. పదవితో వచ్చే రెండు లక్షలు, మూడు లక్షల కోసమైతే పని చేయను. నా ఉద్యోగం, నా వ్యాపారం నేను చేసుకున్న, నెలకు వాటి కంటే పదింతలు సంపాదించే మార్గం ఆ దేవుడు చూపించాడు. 🙏 ఐనా… మా పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మా నాయకులు ఏ చిన్న పొరపాటు చేసినా అడిగే హక్కు ఉంది. అడుగుతాం, కొట్లాడతాం, సాధించుకుంటాం. నిజాయితీగా పని చేసే కార్యకర్తలం.. పదవి ఉన్నా లేకున్నా… పార్టీ కోసం పని చేస్తాం. మా DNA – టీడీపీ! ప్రజలకు మంచి జరిగితే చాలు అనేది మా సిద్ధాంతం. నేను బాగుండాలి అనుకునే వాడు స్వార్థపరుడు. మనతో పాటు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి అనుకునే వాడు నాయకుడు! ఈ రోజు మా పార్టీనడిపే నాయకుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు చూపే శునకానందం మాటలు కొంచెం ఆపండి బాబూ… మా పార్టీ విషయాల్లో మీకెందుకు? @naralokesh అన్నా, @ncbn సార్, దయచేసి ఇలాంటిపొరపాట్లు జరగకుండా చూడండి, కార్యకర్తలకు న్యాయం చేయండి. జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేశ్.. ✌️✌️ #WeStandwithTDPkarayakarta #telugudesamparty #AndhraPradesh #NaraLokesh


నేనెవరో నాకు తెలుసు… నా మాట, మాట తీరు నాకు తెలుసు… నా గమ్యం ఏమిటో నాకు తెలుసు… నాతో కలిసి నడుస్తున్న వాళ్లకు కూడా తెలుసు.!! నేను ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించను, ఎవరిపైనా విమర్శ చేయను. నిజాయితీగా నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మిన నాయకుడి కోసం మాట్లాడతాను — ఆ మాటలు ఎప్పుడూ వ్యక్తిగత దాడి కోసం ఉండవు. ఏదైనా తీవ్రంగా మాట్లాడినా, ప్రశించిన, అది అప్పటి పరిస్థితిని బట్టి, సంఘటనని బట్టి ఉంటుంది. భూతు మాటలు ఉండవు, తిట్లు ఉండవు, మహిళలపై లేదా కుటుంబాలపై అసభ్య వ్యాఖ్యలు అస్సలు ఉండవు. నేను వ్యూస్ కోసం, దృష్టిని పబ్లిసిటీ కోసం, నా ‘రిచ్’ పెంచుకోవడం కోసం, నేను ఎప్పుడూ పక్కవాళ్ళను తిట్టను. మీరు ఎంత రెచ్చగొట్టినా నా మాట మారదు… మీరు ఎంత దాడి చేసినా, మీ స్థాయికి దిగజారి మాటలు నేను మాట్లాడను. సిగ్గు లేకుండా, కనీసం బుద్ధి, జ్ఞానం లేకుండా బూతులు మాట్లాడటమే మాకు వస్తుంది అంటే ఇంకా మీ కర్మ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా విన్నపం — మనం YCP స్థాయికి దిగిరావాల్సిన అవసరం లేదు. మన నాయకులు చేసే మంచి పనులను ప్రజలకు తెలియజేద్దాం, YCP అసత్యాలను ప్రజలకు వివరిద్దాం, బహిర్గతం చేద్దాం. మన సిద్ధాంతం వేరు… మన పార్టీ విధానాలు వేరు… అది మనం గుర్తించాలి. ప్రజల కోసం మనం… స్వార్థం కోసం వాళ్లు. చివరికి ప్రజలే నిజమైన తీర్పు చెప్పేవారు - అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. జై తెలుగుదేశం… జై చంద్రబాబు… జై లోకేశ్! #AndhraPradesh #NaraLokeshForAP #VisionForVictory

అసలు ఈ వైసీపీలో ఎవ్వరికైనా ప్రజాసేవ చేసే ఉద్దేశం ఉందా?? కులం పేరుతో రాజకీయం చేసే వారిని చూసాం… మతం పేరుతో చేసే వారిని చూసాం… ప్రాంతం పేరుతో చేసిన వారిని కూడా చూసాం… కానీ ఇలా గంజాయి బ్యాచ్‌ను వెంటేసుకుని ఉన్మాద రాజకీయం చేసే పార్టీ మాత్రం ఒక్క వైసీపీ మాత్రమే…😡😡 అలాంటి రాజకీయం చేసే నాయకుడు ఒక్క జగన్ రెడ్డి మాత్రమే! #YSJaganCriminalPolitics #JaganFailedCM #YCPcriminalparty #SaveAPFromYSRCP #AndhraPradesh

త్యాగం, సేవ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం భువనమ్మ గారు. పెద్దాయన రాష్ట్రం కోసం గత 40 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు అంటే, దాని వెనక భువనమ్మ త్యాగం, సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. నారా లోకేష్ అన్న ఈరోజు ఒక నాయకుడిగా మన పార్టీని నడపగలుపుతున్నాడు అంటే దానికి కారణం భువనమ్మ.. భర్తకోసం, బిడ్డకోసం ఎంతోమంది మూర్ఖుల దగ్గర మాటలు పడాల్సి వచ్చినా… ఎక్కడా వెనుతిరగకుండా, నిరంతరం వారితో పయనిస్తూ, NTR Trust ద్వారా వేల కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతూ, వారికి అండగా నిలిచి, తల్లిలాంటి ఆప్యాయతను చూపుతున్న భువనమ్మగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని, పెద్దాయనకు, లోకేశ్ అన్నకు తోడుగా మీరు @ManagingTrustee ఇలాగే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ. 💐💛 #HappyBirthday #NaraBhuvaneswari #HBDNaraBhuvaneswari #NaraChandraBabuNaidu #NaraLokesh

కూటమి ప్రభుత్వం లో మరచిపోలేని వారాల్లో ఇది ఒకటి…ఈ వారం (June 8 - June 15) రిక్యాప్ – కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు 🔥🔥 సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ వారంతో ఒక ఏడాది పూర్తి చేసుకుంది.✌️✌️ ఈ వారం ప్రధాన విజయాలు ఇవే: 1.సూపర్ సిక్స్ లో కీలక హామీ అమలు – తల్లికి వందనం ద్వారా లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం. 2.రాష్ట్రంలో YCP నాయకులు మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రభుత్వం. 3.సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రణాళికను వివరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. 4.తల్లికి వందనం పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేసిన కూటమి ప్రభుత్వం. 5.విద్యా సంవత్సరం ఆరంభంతో విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ కొత్త యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్ అందించిన కూటమి ప్రభుత్వం. 6.రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు (వర్చువల్‌గా). 7.ఉత్తరాంధ్రలో రెండు రోజుల పర్యటన చేసిన నారా లోకేష్ గారు. 8.పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2025 కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రివర్యులు. 9.ఉత్తరాంధ్ర పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేష్ గారు. 10.తల్లికి వందనం అమలు తీరుపై ఆర్థికశాఖ మంత్రి మరియు పార్టీ కార్యకర్తలతో ఉండవల్లి నివాసంలో సమీక్ష జరిపిన చంద్రబాబు గారు. 11.ట్విట్టర్ ద్వారా వచ్చిన ప్రజల వినతులపై వెంటనే స్పందించిన లోకేష్ గారు – తక్షణ సహాయం అందించారు. 12.రాష్ట్ర క్రీడాకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాజమహేంద్రవరం లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం. రూ. 3.60 కోట్లతో ఈ స్టేడియాన్ని సకాలంలో నిర్మించారు. ఏదేమైనా, ఈ వారం కూటమి కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని సంబరాలు చేసుకున్నారు… ఆ ఘనత పూర్తిగా మా పెద్దాయనకి — లోకేష్ @naralokesh అన్నకి దక్కుతుంది… నిజంగా మీ కమిట్మెంట్ సూపర్ @ncbn సార్! మీ వేణుగోపాల్ రెడ్డి చెంచు #TeluguDesamParty #ChandrababuNaidu #IdhiManchiPrabhutvam #ThalliKiVandanam #HappyMothersInAP #FirstStepRebuildingAP

సూపర్ 6లో మూడు హామీలు నెరవేరిస్తేనే… జయహో చంద్రన్న, జయహో జయహో లోకేశ్ అంటున్నారు ప్రజలు! ఇంకా రేపు అన్నదాత సుఖీభవ… ఆ తరవాత ఉచిత బస్సు అంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి.🔥 ఇంకా ఎవరూ మనల్ని ఆపలేరు… ఎవ్వరూ అడ్డుకోలేరు…✌️✌️ చంద్రబాబు అంటే నమ్మకం కూటమి అంటే భరోసా కూటమి పాలన అంటే సుపరిపాలన!! జై టిడిపి..! జై చంద్రబాబు..! జై లోకేశ్..!! #ThalliKiVandanam #HappyMothersInAP #NaraLokesh #NaraChandrababuNaidu