Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 5, 2025 at 02:24 PM
1980s to 2025…ఎంత మార్పు! నాగరికత మాయలో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోలేక పోతున్నాం.., మన సంస్కృతిని మనమే మరిచిపోతున్నాం… *ఇంటి ముందు చెట్టు పోయి ఇంట్లో A.C వచ్చింది... *ఇంటి బయట పొయ్యి పోయి ఇంట్లో గ్యాస్ వచ్చింది.... * ఇంటి ముందు అరుగులు పోయి ఇంట్లో టీవీ వచ్చింది.... * ఇంటి ఆవరణలో పెరడు పోయి పాలరాయి ఫ్లోర్ అయింది.... * ఇంటి బయట కుండ పోయి ఇంట్లో ఫ్రిడ్జ్ అయింది... * ఒంట్లో బద్దకం చేరి ఇంట్లో వాషింగ్ మెషీన్ అయింది.... * ఇంటి బయట రుబ్బురోలు పోయి ఇంట్లో మిక్సీ అయింది.... * ఇంట్లో పుస్తకాలు పోయి చేతిలో మొబైల్ అయింది.... * ఇంటిముందు రంగవల్లులు పోయి పెయింటింగ్ లు వచ్చాయి.... * అమ్మ,నాన్న,అత్త,మామ,బాబాయ్,పిన్ని పిలుపులు మామ్, డాడ్,అంటీ,అంకుల్ గా మారాయి.... * శరీరానికి రాసే సున్ని పిండి పోయి మార్కెట్లో సబ్బులయ్యాయి.... * జుట్టుకు పెట్టుకొనే కుంకుడుకాయలు పోయి షాంపూలు అయ్యాయి.... * గడపకు కట్టే పచ్చని తోరణాలు ప్లాస్టిక్ పువ్వులయ్యాయి.... * వంట చేసుకొనే మట్టి పాత్రలు ఇంట్లో స్టీల్,ప్లాస్టిక్ గిన్నెలయ్యాయి.... * ఇంట్లో ఆయుర్వేద వైద్యం మరచి పోయి వీధిలో * మెడికల్ షాపులకు వలసకట్టాము.... * శరీరాన్ని కప్పుకొనే దుస్తులు పోయి ఫ్యాషన్ మాయలో గుడ్డ పీలికలయ్యాయి.... * ముఖానికి రాసుకొనే పసుపు,మీగడ పోయి మార్కెట్లో ఫేస్ క్రీములయ్యాయి.... * పొడుగైన వాలుజాడలు కొత్తిమీర కట్టలయ్యాయి.... * చేతికి అందంగా పెట్టుకొనే గోరింటాకు పోయి మెహిందీ కోనులయ్యాయి... * కుటుంబం కలిసి జరుపుకొనే పండుగలు,పబ్బాల WhatsApp స్టేటస్ గా మారాయి.... * సాంప్రదాయబద్ధమైన పెళ్ళిళ్ళు పోయి డెస్టినేషన్ పెళ్ళిళ్ళు వచ్చాయి..... * ఎడ్లబండ్లు పోయి పెట్రోల్ వాహనాలు వచ్చాయి..... * పచ్చని పొలాలు ఫ్యాక్టరీలు,భవంతులయ్యాయి.... * కుటుంబంలో అనుబంధాలు ఆర్ధిక సంబంధాలయ్యాయి... * ఇంటి చుట్టూ బంధాలు అవసరాలకు పరిమితమయ్యాయి.... * మనిషిలో మంచి,మానవత్వం పోయి మోసం,ద్వేషం పెరిగాయి... * సంపాదన ధ్యాసలో మనిషి జీవితం యాంత్రికంగా మారింది... * డబ్బే పరమావధిగా,వస్తువులే హోదాగా భావించే మనిషి రాక్షసుడయ్యాడు.. నాటి మనిషి జీవితం ఆరోగ్యంగా,ఆనందంగా సాగేది....నేటి మనిషి జీవితం ఒత్తిడి,ఆందోళనలు, అనారోగ్యంతో సాగుతుంది...!! ఆధునికత మాయలో ప్రకృతిని కలుషితం చేసి మన గొయ్యిని మనమే తవ్వుకున్నాము.🥲 "పెరుగుట విరుగుట కొరకే" అంటే ఇదే మరి.🤔 #worldenvironmentday #environmentday2025 #worldenvironmentday2025 #andharapradesh #indianculture #oldisgold #history
😢 2

Comments