Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 7, 2025 at 01:39 PM
అవును..! మనం అధికారంలో ఉన్నాం. కానీ “రివెంజ్ పాలిటిక్స్ వద్దు” అనే నినాదంతో మౌనంగా ఉండిపోయే చేతగాని పరిస్థితిని తేచింది.. ఇది నిజం..! 👉 సాటి కార్యకర్తల గొంతులు కోస్తున్నా.. మనమే అధికారంలో ఉండి, మన జెండా పట్టే వాళ్లే బాధపడుతున్నా, ఉలుకు పలుకులేకుండా చూస్తూ ఉండే చేతగాని వాళ్లం..! 👉 మన పార్టీ అధికారంలో ఉన్నా.. మన సొంత కార్యకర్తల ప్రాణాలు పోతున్నా, ఏమి చేయలేని చేతగాని వాళ్లం..! 👉 అసెంబ్లీ సాక్షిగా మన ఇంటి మహిళల్ని అవమానించినా.. కంటతడి పెట్టి తుడుచుకోవడం తప్ప ఏమీ చేయలేని చేతగాని వాళ్లం..! 👉 జాతీయ టీవీ ఛానల్స్ లో పుట్టుకలపై అసభ్య కామెంట్లు చేసినా.. “రెడ్ బుక్” చెప్పి మభ్యపెడుతున్నాం తప్ప, ఏమీ చేయలేని చేతగాని వాళ్లం..! 👉 జగన్ చేసిన నేరాలకు క్షమించాలి అంటూ.. “రివెంజ్ పాలిటిక్స్ వద్దు” అనే ముసుగులో న్యాయం కాస్తా చీకట్లో కొట్టేసిన చేతగాని వాళ్లం..! 👉 జగన్ భార్యపై వ్యాఖ్యలు చేశాడని మన కార్యకర్తపై కేసు వేసి, ఆయన్నే అరెస్ట్ అయ్యేలా చేసి, “నవతరం గాంధీ” అనే బిళ్ళ పెట్టుకునే అంత చేతగాని వాళ్లం..! 👉 రైతుల భూములు లాక్కొని వారి ఇంటి ఆడవాళ్లను ఈరోజు వేశ్యలు అంటున్నా.. అధికారంలో ఉండి అలాంటి వెధవల్ని ఆపలేని చేతగాని వాళ్లం..! 👉 రాష్ట్రంలో గంజా బ్యాచ్ గందరగోళం సృష్టిస్తున్నా.. ఎఫ్‌ఐఆర్‌లు వేసినట్లు వేసి, కేసులు పెట్టి చేతులు దులిపేసే చేతగాని వాళ్లం..! 👉 అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా.. కార్యకర్తల న్యాయం చేయకుండా, వారి రక్షణకు నిలువలేకపోతున్నామంటే.. నిజంగానే మనం చేతగాని వాళ్లమే.. శతకోటి నమస్కారాలతో చెబుతున్న..🙏🙏 “అభివృద్ధి” పేరుతో రాజకీయ చేయకుండా మౌనం వహిస్తే… రేపు మనం నిజంగానే చేతగాని వాళ్లం అవుతాం..! ఈ YCP దుర్మార్గులను అడ్డుకోలేకపోతే, మీరు చేస్తున్న అభివృద్ధి, పెట్టుబడులు, సంస్కరణలు అన్నీ బూడిదలో పోతాయి. ఇవాళ పరిస్థితి మారకపోతే, రేపు మన జెండా పట్టే కార్యకర్త ఉండడు. మనకు ఓటు వేసే ఓటరు నమ్మడు @ncbn సర్.. కార్యకర్తే అధినేత అని పేరుచెప్పి, మేము ఇలాగె ఉంటాం, కార్యకర్తల్ని గాలికొదిలేస్తాం, వైసీపీ ఆగడాల్ని పట్టించుకోము, రాష్ట్రంలో సైకోలను వదిలేస్తాం అంటే చెప్పండి మేము మా పని చేసుకుంటాం, మాకెందుకు ఈ రచ్చ.. సొంత పనులు వదులుకుని మేము ఎందుకు చేయాలి ఈ రాజకీయం @naralokesh అన్న? ప్రజలు నిజంగా అడుగుతున్నారు సార్ — “మీరు చేతగాని వాళ్లా?” దయచేసి ఆ భజన సంగం మాటలు కాకుండా.. వాస్తవాలను గ్రహించండి. 🙏🙏 ప్రేమతో, మీ వేణుగోపాల్ రెడ్డి చెంచు #voiceofthecadre #tdptwitter #justicefortdpworkers
💯 1

Comments