
T.G.Bharath
May 20, 2025 at 11:54 AM
*కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసు*
కర్నూలు జిల్లా ప్రజలకు శుభవార్త. కర్నూలు నుండి విజయవాడకు విమాన సౌకర్యం ఎట్టకేలకు అందుబాటులోకి వచ్చింది. జులై 2వ తేదీ నుండి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయి. ఇప్పుడు సోమవారం, బుధవారం, శుక్రవారాల్లో ఈ సర్వీసు నడుస్తుంది. త్వరలో ప్రతి రోజూ ఈ విమాన సర్వీసు నడుపుతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు తెలిపారు. కర్నూలు పారిశ్రామిక అభివృద్ధిలో ఈ విమాన సర్వీసు ఎంతో కీలకం కానుంది. నేను అడిగిన వెంటనే దీనిపై దృష్టి సారించి కర్నూలు - విజయవాడ మధ్య విమాన సర్వీసు తీసుకొచ్చిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి కర్నూలు ప్రజల తరపున నా ప్రత్యేక ధన్యవాదాలు. #kurnoolmla #ministerindcomfood #janamkosamebharath #janamthobharath #tgv_bharath #kurnool
❤️
👍
🙏
❤
👏
💐
✊
✌
✌️
👌
125