AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
AP TEACHER'S FLASH WHATSAPP CHANNEL
May 23, 2025 at 01:23 PM
*ఉమ్మడి కడప జిల్లా గ్రేడ్ 2 హెడ్మాస్టర్ పదోన్నతుల అడక్వసి వివరాల పై ఏపీటీఎఫ్ అమరావతి వినతి పత్రం* ఉమ్మడి కడప జిల్లాలో గ్రేడ్ 2 హెడ్మాస్టర్ పదోన్నతుల అడక్వసి వివరాలపై కడప జిల్లా విద్యాశాఖ అధికారికి ఏపీటీఎఫ్ అమరావతి వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సివి ప్రసాద్ ,రాధాకృష్ణ ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయుల పదోన్నతులపై చర్చించడం జరిగింది. దీనిపై జిల్లా శాఖ కార్యాలయం సిబ్బంది ఎస్టీకి అడక్వసి పూర్తయిందని, ఎస్సీ కి నాలుగు పోస్టులు రిజర్వేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుందని స్పష్టంగా తెలిపారని వారు వివరించారు. అడక్వసి వివరాలను కూడా బహిర్గతం చేస్తామని తెలిపారని వివరించారు. పదోన్నతుల్లో ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగే విధంగా ఏపీటీఎఫ్ అమరావతి ముందుంటుందని తెలిపారు.

Comments