Telangana Congress
Telangana Congress
June 2, 2025 at 06:45 AM
TGSWREIS ఎస్సీ గురుకులాల పైన బిఆర్ఎస్ నాయకుల బురద రాజకీయాలు ఎందుకు?? ఎందుకంటే 10 సంవత్సరాల్లో వారికి చాతకానిది మేము 15 నెలల్లో చేసి చూపించాం కాబట్టి. నాడు: గత పది సంవత్సరాల్లో ఏనాడూ సోషల్ వెల్ఫేర్ పాఠశాలల్లో కానీ, జూనియర్ కాలేజీల్లో కానీ పూర్తిగా నిండని సీట్లు. నేడు: ఈ సంవత్సరం మా ప్రజా ప్రభుత్వం యొక్క విధానాల పైన నమ్మకంతో మే నెల సరికే 100శాతం నిండిన సీట్లు. (ఇది మా ప్రభుత్వం పైన ప్రజలకు ఉన్న నమ్మకం.) ------------------- నాడు: కోట్లు కొల్లగొట్టి కేవలం 580 మంది విద్యార్ధులకు కోడింగ్ నేర్పించామని చెప్పిన నాటి వైనం.. నేడు: కార్పొరేట్ భాగస్వామ్యంతో ప్రభుత్వం పై ఆర్ధిక భారం లేకుండా 1,72,000 మంది పిల్లలకు కోడింగ్ శిక్షణ ఇస్తున్న నేటి నిజం. --------------------- నాడు: తమ స్వార్థం కోసం సొంత సామాజిక వర్గం పిల్లలను కూడా అడ్మిషన్ల వ్యవహారంలో వదలని నాటి అవినీతి. నేడు: పారదర్శకతతో పరీక్ష ద్వారా ప్రతిభా వంతులైన పిల్లలకు అడ్మిషన్లు కల్పించడం నేటి ప్రజా ప్రభుత్వ రాజనీతి. ---------------------- నాడు: కాసులకు అవుట్సోర్సింగ్ కొలువులను అప్పనంగా అమ్ముకొని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన నాటి చీకటి పాలన. నేడు: అధికారికంగా నోటిఫికేషన్ల తో అర్హులకు మాత్రమే కొలువులు ఇచ్చి విద్యార్ధుల జీవితాలలో వెలుగులు నింపింది నేటి @revanth_anumula ప్రజా పాలన.
👍 😂 😮 🙏 9

Comments