Jeevan Kishore Gurram
May 19, 2025 at 05:13 PM
బలి లేకుండా ఆరాధన లేదు.
ఆరాధన అనే పదం కూడా అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలోనే మొదట తారసపడుతుంది.
బలిపీఠాలు, ప్రత్యక్షగుడారం, మందిరం ఇలా ప్రతీదానిలో బలితోనే దేవునిని ఆరాధించేవారు.
మరి ఇప్పటి ఆరాధనలో ఎటువంటి బలిని మనం అర్పిస్తున్నాం? యేసు ఒక్కసారే తనను తాను అర్పించుకొనుట మరలా మన పాపాలకైన బలి అవసరతను పూర్తిగా తీర్చివేసింది. అయితే, మనలను మనమే సజీవ యాగముగా మన దేహాలను అర్పించుకొనుట నిజమైన ఆరాధనగా (రోమా 12:1) చూస్తాం.
మరి ఇప్పటి మన ఆరాధనలో బలిగా మనలను మనం దేవునికి మొదట పవిత్రమైనవారిగాను, రెండవది దేవునికి అనుకూలముగాను మార్చుకొనుటలో ఎంత ప్రాధాన్యత కనుపరుస్తున్నామో చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది.
-జీవన్ కిషోర్ గుర్రం,
వర్షిప్ ఇండియా \o/
❤️
🙏
7