Jeevan Kishore Gurram WhatsApp Channel

Jeevan Kishore Gurram

240 subscribers

About Jeevan Kishore Gurram

Worship India \o/

Similar Channels

Swipe to see more

Posts

Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/21/2025, 3:35:22 AM

How can I overcome sin in my Christian life? 🤔

Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/21/2025, 3:25:35 AM

నిత్యత్వపు దృష్టి లేకుండా క్రైస్తవునిగా ఉండటం అసాధ్యం...అలా జీవించడం ఒక దౌర్భాగ్యం. “ఈ జీవితకాలముమట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.” ‭‭1 కొరింథీయులకు‬ ‭15‬:‭19‬ ‭ “మన పౌరస్థితి పర లోకమునందున్నది; అక్కడనుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొనియున్నాము. సమస్తమును తనకు లోపరచుకొనజాలిన శక్తినిబట్టి ఆయన మన దీనశరీరమును తన మహిమగల శరీరమునకు సమ రూపము గలదానిగా మార్చును.” ‭‭ఫిలిప్పీయులకు‬ ‭3‬:‭20‬-‭21

Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/22/2025, 3:20:04 PM

https://youtu.be/I7tR7b6IYDo?si=Ma7PGrSo2_Dp-tS0

❤️ 1
Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/21/2025, 2:32:03 PM

https://www.youtube.com/live/jvo8WBxxpQo?si=IujhrxsvujuwqLHz

Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/20/2025, 6:31:01 AM

Can anyone be a true Christian without having eternity mindset? నిత్యత్వపు దృష్టి లేకుండా ఎవరైనా నిజమైన క్రైస్తవులుగా ఉండగలరా?

Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/22/2025, 4:42:14 AM

*విజయవంతమైన క్రైస్తవజీవితాన్ని కలిగియుడుటకు...* 1. ఆత్మతో నడచుట 2. ⁠వాక్యద్యానం 3. ⁠ప్రార్ధన 4. ⁠విశ్వాసుల సహవాసం చాలా అవసరం. 1. *ఆత్మచేత నడిపించబడుట:* “నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.” ‭‭గలతీయులకు‬ ‭5‬:‭16‬ ‭ “ఆత్మను ఆర్పకుడి..” ‭‭1 థెస్సలొనీకయులకు‬ ‭5‬:‭19‬ “మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.” ‭‭ఎఫెసీయులకు‬ ‭5‬:‭18‬ ‭ *2. వాక్య ధ్యానం* “దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.” ‭‭2 తిమోతికి‬ ‭3‬:‭16‬-‭17‬ ‭ “ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.” ‭‭హెబ్రీయులకు‬ ‭4‬:‭12‬ ‭ “మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి.” ‭‭ఎఫెసీయులకు‬ ‭6‬:‭17‬ ‭ *3. ప్రార్ధన* “పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,” ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭3‬:‭1‬ ‭ “వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.” ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭4‬:‭31‬ ‭ “అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.” ‭‭అపొస్తలుల కార్యములు‬ ‭6‬:‭4‬ ‭ “మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి” ‭‭మత్తయి‬ ‭26‬:‭41‬ ‭ “అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును,” ‭‭మత్తయి‬ ‭7‬:‭7‬ ‭ “ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.” ‭‭1 యోహాను‬ ‭5‬:‭14‬-‭15‬ ‭ *4. విశ్వాసుల సహవాసం* “ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, ...” ‭‭మార్కు‬ ‭6‬:‭7‬ ‭ “కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.” ‭‭హెబ్రీయులకు‬ ‭10‬:‭24‬-‭25‬ ‭ “మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.” ‭‭యాకోబు‬ ‭5‬:‭16‬ ‭ ‬‬“ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.” ‭‭సామెతలు‬ ‭27‬:‭17‬ ‭ “సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.” ‭‭1 కొరింథీయులకు‬ ‭10‬:‭13‬ ‭ *ముగింపు:* పాపముమీద జయం కొన్నిసార్లు త్వరగాను, మరికొన్నిసార్లు ఆలస్యంగాను రావొచ్చు. అయితే మనం దేవుని మాటచొప్పున పైన చెప్పిన వాటిల్లో క్రమంగా ఉన్నట్లయితే శోధననుండి జయజీవితం వాగ్దానం చేయబడింది. గుర్తుంచుకోండి: వాగ్దానం చేసిన ఆయన నమ్మదగినవాడు -Jeevan Kishore Gurram \o/

❤️ 6
Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/23/2025, 5:14:50 AM

https://www.youtube.com/live/yQ-ZPdgmMos?si=yCtrwnSDXHkCW9KU

Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/23/2025, 5:12:55 AM

Team ecclesia in the house #worshipindia

❤️ 1
Video
Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/20/2025, 2:55:54 PM

https://www.youtube.com/live/n2IuzpDwEK8?si=fTjSoRVAO3_VAL5W

❤️ 2
Jeevan Kishore Gurram
Jeevan Kishore Gurram
5/19/2025, 5:13:13 PM

బలి లేకుండా ఆరాధన లేదు. ఆరాధన అనే పదం కూడా అబ్రాహాము ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలోనే మొదట తారసపడుతుంది. బలిపీఠాలు, ప్రత్యక్షగుడారం, మందిరం ఇలా ప్రతీదానిలో బలితోనే దేవునిని ఆరాధించేవారు. మరి ఇప్పటి ఆరాధనలో ఎటువంటి బలిని మనం అర్పిస్తున్నాం? యేసు ఒక్కసారే తనను తాను అర్పించుకొనుట మరలా మన పాపాలకైన బలి అవసరతను పూర్తిగా తీర్చివేసింది. అయితే, మనలను మనమే సజీవ యాగముగా మన దేహాలను అర్పించుకొనుట నిజమైన ఆరాధనగా (రోమా 12:1) చూస్తాం. మరి ఇప్పటి మన ఆరాధనలో బలిగా మనలను మనం దేవునికి మొదట పవిత్రమైనవారిగాను, రెండవది దేవునికి అనుకూలముగాను మార్చుకొనుటలో ఎంత ప్రాధాన్యత కనుపరుస్తున్నామో చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఎంతైనా ఉంది. -జీవన్ కిషోర్ గుర్రం, వర్షిప్ ఇండియా \o/

❤️ 🙏 7
Link copied to clipboard!