
Jeevan Kishore Gurram
May 22, 2025 at 04:42 AM
*విజయవంతమైన క్రైస్తవజీవితాన్ని కలిగియుడుటకు...*
1. ఆత్మతో నడచుట
2. వాక్యద్యానం
3. ప్రార్ధన
4. విశ్వాసుల సహవాసం
చాలా అవసరం.
1. *ఆత్మచేత నడిపించబడుట:*
“నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచు కొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు.”
గలతీయులకు 5:16
“ఆత్మను ఆర్పకుడి..”
1 థెస్సలొనీకయులకు 5:19
“మరియు మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు; అయితే ఆత్మ పూర్ణులైయుండుడి.”
ఎఫెసీయులకు 5:18
*2. వాక్య ధ్యానం*
“దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశమువలన కలిగిన ప్రతిలేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమై యున్నది.”
2 తిమోతికి 3:16-17
“ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభ జించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలం పులను ఆలోచనలను శోధించుచున్నది.”
హెబ్రీయులకు 4:12
“మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి.”
ఎఫెసీయులకు 6:17
*3. ప్రార్ధన*
“పగలు మూడు గంటలకు ప్రార్థనకాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్లుచుండగా,”
అపొస్తలుల కార్యములు 3:1
“వారు ప్రార్థనచేయగానే వారు కూడి యున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్ధాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి.”
అపొస్తలుల కార్యములు 4:31
“అయితే మేము ప్రార్థనయందును వాక్యపరిచర్యయందును ఎడతెగక యుందుమని చెప్పిరి.”
అపొస్తలుల కార్యములు 6:4
“మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థనచేయుడి; ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి”
మత్తయి 26:41
“అడుగుడి మీకియ్యబడును, వెదకుడి మీకు దొరకును,”
మత్తయి 7:7
“ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.”
1 యోహాను 5:14-15
*4. విశ్వాసుల సహవాసం*
“ఆయన పండ్రెండుగురు శిష్యులను తనయొద్దకు పిలిచి, వారిని ఇద్దరిద్దరినిగా పంపుచు, ...”
మార్కు 6:7
“కొందరు మానుకొను చున్నట్టుగా, సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి యెక్కువగా ఆలాగుచేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము.”
హెబ్రీయులకు 10:24-25
“మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.”
యాకోబు 5:16
“ఇనుముచేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును.”
సామెతలు 27:17
“సాధారణముగా మనుష్యులకు కలుగు శోధనతప్ప మరి ఏదియు మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు; మీరు సహింపగలిగినంతకంటె ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడ నియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతోకూడ తప్పించుకొను మార్గమును కలుగ జేయును.”
1 కొరింథీయులకు 10:13
*ముగింపు:*
పాపముమీద జయం కొన్నిసార్లు త్వరగాను, మరికొన్నిసార్లు ఆలస్యంగాను రావొచ్చు. అయితే మనం దేవుని మాటచొప్పున పైన చెప్పిన వాటిల్లో క్రమంగా ఉన్నట్లయితే శోధననుండి జయజీవితం వాగ్దానం చేయబడింది.
గుర్తుంచుకోండి: వాగ్దానం చేసిన ఆయన నమ్మదగినవాడు
-Jeevan Kishore Gurram
\o/
❤️
❤
6