
TeluguAstrology
June 17, 2025 at 11:22 AM
శ్రీ హనుమాన్ చాలీసా
రచన: తులసీ దాస్దోహా
శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి |
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి ||
బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార |
బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ ||
తాత్పర్యము :- నా మనస్సనెడి అద్దమును శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే శుభ్రము చేసుకొని చతుర్విధ పురుషార్ధములను, ధర్మార్థ కామ మోక్షముల నొసంగు శ్రీరామచంద్రుని విమల కీర్తిని వర్ణించెదను.
బుద్ధిహీనత వలన ఈ శరీరము కలిగినదని తెలుసుకొని పవనకుమారుని తలచెదను. అతని వలన నాకు బుద్ధి, విద్య, బలము వచ్చుటయే కాక కామాది వికారాల వలన కలిగెడి కష్టములను హరించుగాక !
జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర |
జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 ||
తాత్పర్యము :- జ్ఞానగుణ సముద్రుడవయిన ఓ హనుమంతా! నీకు జయము కలుగుగాక ! ముల్లోకాలను ప్రకాశింపజేసే ఓ కపీశ్వరా ! నీకు జయము కలుగుగాక !
రామదూత అతులిత బలధామా |
అంజని పుత్ర పవనసుత నామా || 2 ||
తాత్పర్యము :- ఓ! రామదూత ! అపార బలశాలీ ! అంజనీ తనయా ! వాయునందనుడను నామము కలవాడా !
మహావీర విక్రమ బజరంగీ |
కుమతి నివార సుమతి కే సంగీ ||3 ||
తాత్పర్యము :- మహావీరా ! విక్రమ స్వరూపం గలవాడా! వజ్రం వంటి శరీరము గలవాడా ! దుర్భుద్ధలను పారద్రోలేవాడా ! సద్భుద్ధి గలవారలకు చేయూతనిచ్చేవాడా !
కంచన వరణ విరాజ సువేశా |
కానన కుండల కుంచిత కేశా || 4 ||
తాత్పర్యము :- సువర్ణఛాయగల మేనిగలవాడా ! మంచి వేషం గలవాడా ! బంగారు కుండలములను ధరించువాడా ! ముడివేయబడ్డ కేశములు గలవాడా !
హాథవజ్ర అరు ధ్వజా విరాజై |
కాంథే మూంజ జనేవూ ఛాజై || 5||
తాత్పర్యము :- చేతవజ్రము, ధ్వజముకలిగి వెలుగొందువాడా ! జందెము కలిగిన భుజముతో చెలువొందువాడా !
శంకర సువన కేసరీ నందన |
తేజ ప్రతాప మహాజగ వందన || 6 ||
తాత్పర్యము :- శంకర నందనా ! కేశరి కుమారా ! ప్రతాపముతో తేజరిల్లు వాడా ! గొప్పదైన జగత్తుచే నమస్కరించబడువాడా !
విద్యావాన గుణీ అతి చాతుర |
రామ కాజ కరివే కో ఆతుర || 7 ||
తాత్పర్యము :- విద్యాసంపన్నుడా ! కల్యాణగుణములు గలవాడా ! రామ కార్యము నెరవేర్చుటపట్ల ఆతృత గలవాడా !
ప్రభుచరిత్ర సునివేకో రసియా ।
రామలఖన సీతా మన బసియా ।। 8 ।।
తాత్పర్యము :- రామకధను విను రసజ్ఞుడా ! రామలక్ష్మణసీతలను మనస్సున కలిగినవాడా !
సూక్ష్మ రూపధరి సియహి దిఖావా ।
వికట రూపధరి లంక జరావా ।। 9 ।।
తాత్పర్యము :- సూక్ష్మ రూపముతో సీతకు కనబడినవాడా ! వికట రూపముతో లంకను కాల్చినవాడా !
భీమరూపధరి అసుర సంహారే ।
రామచంద్రకే కాజ సంవారే ।। 10 ।।
తాత్పర్యము :- భయంకరమైన రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడా ! రామచంద్రుని కార్యమును నెరవేర్చిన వాడా !
లాయ సంజీవన లఖన జియాయే ।
శ్రీ రఘువీర హరఖి ఉరలాయే ।। 11 ।।
తాత్పర్యము :- సంజీవిని తెచ్చి లక్ష్మణుడ్ని జీవింపజేసినవాడా ! శ్రీ రామునిచే హృదయమునకు హత్తుకొనబడ్డవాడా !
రఘుపతి కీన్హీ బహుత బఢాయీ ।
తుమ మమ ప్రియ భరతహి సమభాయీ ।। 12 ।।
తాత్పర్యము :- శ్రీరాముడు నిన్ను గొప్పగా ప్రశంసించి నువ్వు తనకు భరతునితో సమానమయినట్టివాడవని అనెను.
సహస వదన తుమ్హరో యశగావైఁ ।
అసకహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥
తాత్పర్యము :- నీ యశస్సును శ్రీరాముడు వేనోళ్ళ గానము చేసి నిన్ను కావలించుకొనెను.
సనకాదిక బ్రహ్మాది మునీశా ।
నారద శారద సహిత అహీశా ॥ 14 ॥
యమ కుబేర దిగపాల జహాఁతే ।
కవికోవిద కహి సకై కహాఁతే ॥ 15 ॥
తాత్పర్యము :- సనకాదులు, బ్రహ్మాది మునీశ్వరులు, నారద, శారద, ఆదిశేషులు, యముడు, కుబేరుడు ఆదిగాగల దిక్పాలకులు, కవి పండితాదులు ఎంతగా నిన్ను పొగుడుదురో !
తుమ ఉపకార సుగ్రీవ హిఁకీన్హా ।
రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥
తాత్పర్యము :- నీవు సుగ్రీవునకు ఉపకారమొనర్చినవాడవు. శ్రీరామునితో మైత్రి కలుగజేసి రాజ్య సంపదను కలిగించితివి.
తుమ్హరో మంత్ర విభీషణ మానా ।
లంకేశ్వరభయే సబజగ జానా ॥ 17 ॥
తాత్పర్యము :- నీయొక్క భోదనలను అంగీకరించిన విభీషణుడు లంకాధి పతియైన వైనము జగతికంతటికి తెలుసును.
యుగ సహస్ర యోజన పరభానూ ।
లీల్యోతాహి మధుర ఫల జానూ ॥ 18 ॥
తాత్పర్యము :- రెండువేల యోజనముల దూరమందున్న సూర్యుడ్ని తియ్యని పండుగా భావించి లీలగా గ్రహించినవాడా !
ప్రభుముద్రికా మేలిముఖ మాహీ ।
జలధి లాంఘిగయే అచరజ నాహీఁ ॥ 19 ॥
తాత్పర్యము :- రామచంద్రప్రభువు ఇచ్చిన ముద్రికను భద్రముగా నోటనుంచుకొని సముద్రమును సులభముగా దాటినవాడా !
దుర్గమకాజ జగతకే జేతే ।
సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥
తాత్పర్యము :- ప్రపంచమునగల కష్టకార్యమది యేదైనను నీ అనుగ్రహముతో సాధ్యము ఒనర్చునట్టివాడా !
రామదుఆరే తుమ రఖవారే ।
హోతను ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥
తాత్పర్యము :- రాముని ద్వారమును కాచువాడవు నీవు ! నీ అనుమతి లేనిదే ఎవరికిని ప్రవేసించుటకు సాధ్యము కాదు.
సబ సుఖ లహై తుమ్హారీ శరనా ।
తుమ రక్షక కాహూకో డరనా ॥ 22 ॥
తాత్పర్యము :- నీ శరణు కోరినచో సమస్త సౌఖ్యములు సంప్రాప్తించును. నీవు రక్షకుడిగా ఉండగా వేరెవరికి భయపడనక్కరలేదు.
ఆపన తేజ సమ్హారో ఆపై ।
తీనోఁలోక హాంకతే కాంపై ॥ 23 ॥
తాత్పర్యము :- నీ యొక్క గొప్పదైన తేజస్సును( శోభను) నీవు మాత్రమే ధరించగలవు. నీ గర్జనకే ముల్లోకములు కంపించిపోవును.
భూతపిశాచ నికట నహిఁ ఆవై ।
మహావీర జబ నామ సునావై ॥ 24 ॥
తాత్పర్యము :- భూతములు - పిశాచములు యేవియు నీ పేరు విన్నచో దరికి రానేరవు.
నాసై రోగ హరై సబ పీరా ।
జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥
తాత్పర్యము :- నీ నామమును నిరంతరము జపించినచో సమస్త రోగములు, పీడలు తొలగిపోవును.
సంకటసే హనుమాన ఛూడావై ।
మనక్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥
తాత్పర్యము :- మనోవాక్కయ కర్మలచే హనుమంతుని ధ్యానించు వానికి సమస్త సంకటములనుండి విముక్తి కలుగును.
సబ పర రామ తపస్వీ రాజా ।
తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥
తాత్పర్యము :- శ్రీరాముడు రాజులకు రాజు, మునులకు ప్రభువు, నీవు ఆ మహనీయుని కార్యములను అన్నింటిని సరిసొత్తుచుందువు.
ఔర మనోరధ జో కోయి లావై ।
తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥
తాత్పర్యము :- ఎవరు యే మనోరధము కలిగి ఉన్నను, వారికి అమితముగా జీవనఫలము లభించుచుండును.
చారోఁయుగ పరతాప తుమ్హారా ।
హై పరసిద్ధి జగత ఉజియారా ॥ 29 ॥
తాత్పర్యము :- నాలుగు యుగములందున నీ ప్రతాపము కలదనుట ప్రసిద్ధము. అందువలన జగత్తు ఉజ్వలమైనది.
సాధు సంతకే తుమ రఖవారే ।
అసుర నికందన రామ దులారే ॥ 30 ॥
తాత్పర్యము :- సాధు సజ్జనులను రక్షించుచుందువు. రాక్షసులను చంపి రామునకు ఇష్టుడవైనవాడవు.
అష్టసిద్ధి నవనిధికే దాతా ।
అసవర దీన్హ జానకీమాతా ॥ 31 ॥
తాత్పర్యము :- అష్టసిద్ధులు, నవనిధులు ఇచ్చు వరమును జనని జానకి నీకు అనుగ్రహించెను.
రామ రసాయన తుమ్హరే పాసా ।
సదారహో రఘుపతికే దాసా ॥ 32 ॥
తాత్పర్యము :- నీ వద్ద రామరసానమున్నది. నీవు రామునకు వినయము గల దాసుడవు.
తుమ్హరో భజన రామకో భావై ।
జన్మ జన్మక దుఃఖ బిసరావై ॥ 33 ॥
తాత్పర్యము :- నిన్ను భజించుట వలన శ్రీరాముడు సంతసించును. జన్మ జన్మల దుఃఖము నశించును.
అంతకాల రఘుపతిపుర జాయీ ।
జహాఁ జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥
తాత్పర్యము :- అంత్యకాలంలో రఘురాముని పురమును చేరుకొందురు. ఎచ్చట జన్మించినను హరిభక్తులుగానే చెప్పబడుదురు.
ఔర దేవతా చిత్త న ధరయీ ।
హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥
తాత్పర్యము :- ఇతర దైవమును మదినెంచక హనుమంతుని సేవించిన సమస్త సుఖములను నాతడు సమకూర్చును.
సంకట హటై మిటై సబ పీరా ।
జో సమిరై హనుమత బలవీరా ॥ 36 ॥
తాత్పర్యము :- బలవంతుడగు హనుమంతుని తలచిన సమస్త సంకటములు తొలగిపోవును.
జైజైజై హనుమాన గోసాయీ ।
కృపాకరో గురుదేవకీ నాయీ ॥ 37 ॥
తాత్పర్యము :- ఓ ! ప్రభూ ! హనుమంతా ! నీకు జేజేలు ! నా పట్ల కృప జూపుము, గురుదేవా !
జో శతబార పాఠకర కోయీ ।
ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥38 ॥
తాత్పర్యము :- ఎవరు దీనిని నూరు పర్యాయములు పఠించెదరో వారికి బాధలు, బంధములు తొలగి సుఖములు పొందెదరు.
జోయహ పఢై హనుమాన చాలీసా ।
హోయ సిద్ధి సాఖీ గౌరీసా ॥ 39 ॥
తాత్పర్యము :- హనుమాన చాలీసా స్తోత్రమును పఠించు వారికి గౌరీ శంకరుల సాక్షిగా సిద్ధి కలుగును.
తులసీదాస సదా హరిచేరా ।
కీజై నాధ హృదయ మహాఁడేరా ॥ 40 ॥
తాత్పర్యము :- సదా హరిదాసగు తులసీదాస ప్రభువా, సదా నీవు నా హృదయమందుండుము.
దొహ
పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ |
రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ ||
తాత్పర్యం
ఓ సంకతములను హరించే పవన తనయ
నీవు మంగళ మూర్తివి. సీత రామ లక్ష్మణ సహితముగా నా హృదయంలో
నివసించుము.