
TeluguAstrology
177 subscribers
About TeluguAstrology
జ్యోతిష్య సమాచారం మరియు ఆధ్యాత్మిక సంబంధ పోస్ట్లు వస్తాయి. ఆసక్తి కలవారు జాయిన్ అవగలరు. 🪷⚛️✡️🕉️🌹👇 Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12 https://t.me/telugujyotishanilayam Telegram Astrology group జ్యోతిష విషయాలు Facebook page https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM/ https://www.facebook.com/teluguastrology Contact : 9966455872 P.V.Radhakrishna or jayamaheswari Our site : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.com @teluguastrology
Similar Channels
Swipe to see more
Posts

10_6_25నుండి మూఢం… *మూఢం అంటే ఏంటి?* ➖➖➖✍️ ``` మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలులేని రోజులు. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీనిని భావిస్తారు. హిందువులు గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గ్రహస్థితి సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయరు. మూఢం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. కొన్ని తప్పులు కూడా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ``` ఎందుకు మూఢం వస్తుంది, ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు?``` మూఢం అనేది రెండు రకాలు. 1) గురు మూఢం, 2) శుక్ర మూఢం అని అంటారు. ఇక ఇప్పుడు వచ్చేది జూన్ 10వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు గురు మూఢం. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ఈ మూఢం రోజుల్లో శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు. ఈ సమయంలో శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఎప్పుడూ కూడా గురు బలం, శుక్ర బలం ఉంటేనే జరుపుతారు. ఈ మూఢం సమయంలో గురు గ్రహానికి శుక్ర గ్రహానికి తక్కువ శక్తి ఉంటుంది. ఈ రెండు గ్రహాలు బలహీనంగా ఉంటే ఏ పని చేసినా కలిసి రాదు. అందుకే దీనిని మూఢం అని అంటారు. ``` *మూఢం సమయంలో ఏం చేయకూడదు?*``` మూఢం సమయంలో 1)పెళ్లిచూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. 2)పెళ్లిళ్లు కూడా ఈ సమయంలో జరపకూడదు. ఒకవేళ పెళ్లిళ్లు జరిపిస్తే కొత్త దంపతుల మధ్య సఖ్యత ఉండదు. గొడవలు పడుతూ ఉంటారు. విడిపోయే అవకాశాలు ఉన్నాయి. శుభకార్యాలని ఈ మూఢం సమయంలో ప్రారంభించకూడదు. అలా చేస్తే చెడు జరిగే ప్రమాదం ఉంది. 3)లగ్న పత్రికలు రాసుకోకూడదు. పెళ్లి పత్రికల జోలికే వెళ్ళకూడదు. 4)మూఢం సమయంలో పెళ్లి మాటలు మాట్లాడటం కూడా తప్పు. 5)పసి పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు. 6) కొత్త వ్యాపారాలని మొదలుపెట్టకూడదు. పుట్టు వెంట్రుకలు ఈ సమయంలో తీస్తే పిల్లలకు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 7)చెవులు కుట్టించకూడదు. 8)కొత్త వాహనాలు కొనుగోలు చేయరాదు. 9)శంకుస్థాపన చేయడం వంటివి కూడా చేయకూడదు. 10)ఈ సమయంలో కొత్త ఇంట్లోకి మారడం, సొంత ఇంటికి వెళ్లిపోవడం లాంటివి చేయకూడదు. అలా చేస్తే కుటుంబ సమస్యలు వస్తాయి. 11)దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ మూఢం సమయంలో చేయకూడదు. 12)వ్రతాలు చేయడం, విగ్రహ ప్రతిష్టాపనలు లాంటివి కూడా చేయకూడదు. 13)ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదు. 14)చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలుపెట్టడం, ఇంట్లో బంగారాన్ని తాకట్టు పెట్టడం ఇలాంటివి చేస్తే లక్ష్మీదేవి ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది.``` *మూఢం సమయంలో ఏం చేయవచ్చు?*``` 1)చిన్న పిల్లలకు అన్నప్రాసన చెయ్యచ్చు. 2)దూర ప్రయాణాలు చెయ్యచ్చు. 3)ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే కూడా చేయించుకోవచ్చు. 4)భూముల అమ్మడం, భూములు కొనడం వంటివి చేయొచ్చు. 5)అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పులేదు. 6)రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. 7)విదేశాలకు వెళ్లడం, కొత్త ఉద్యోగంలో చేరడం వంటివి చేయొచ్చు. 8)కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు. 9)ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్లొచ్చు. 10)దేవాలయాల్లో అన్నదానాలు చేయడం, సీమంతం వేడుకలు చేసుకోవడం, దైవ కార్యాలను నిర్వహించడం చేయొచ్చు. 11)నవగ్రహ శాంతులు, హోమాలు చేయించుకోవచ్చు. 12)మూఢం సమయంలో బాలింతలు, గర్భిణీలు ప్రయాణం చేయడం మంచిది కాదు. ఒకవేళ చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయొచ్చు. Follow the TeluguAstrology channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va9d4z5EquiIi18jEp12

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj https://www.facebook.com/teluguastrology Contact : 9966455872 P.V.Radhakrishna or jayamaheswari Our site : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.com

నవగ్రహాలు - కారక క్రియలు నవగ్రహాల మహాదశలు మన జీవితంపై గంభీరమైన ప్రభావాన్ని చూపుతాయి. ప్రతి గ్రహం తన మహాదశలో ప్రత్యేకమైన నియమాలను సూచిస్తుంది, వాటిని పాటించడం శుభప్రదంగా ఉంటుంది. **సూర్యుని మహాదశలో** ప్రభుత్వ అధికారులను, రాజకీయ నాయకులను మోసం చేయకూడదు, ఎందుకంటే ఇది ప్రతిష్టను దెబ్బతీస్తుంది. **చంద్ర మహాదశలో** తల్లిని గౌరవించాలి, స్త్రీ మూర్తులను చెడు దృష్టితో చూడకూడదు, ఎందుకంటే ఇది కుటుంబ సంబంధాలను దెబ్బతీస్తుంది. **కుజ మహాదశలో** స్త్రీలను దోపిడి చేయకూడదు, ఎందుకంటే ఇది ఆగ్రహాన్ని పెంచి సమస్యలకు దారి తీస్తుంది. **బుధ మహాదశలో** సోదరీమణులు, అత్తలు లేదా పిల్లల నుండి బహుమతులు తీసుకోకూడదు, ఎందుకంటే ఇది అనవసరమైన బాధ్యతలను తెచ్చిపెడుతుంది. **గురు మహాదశలో** బంగారాన్ని కానుకగా స్వీకరించకూడదు, ఎందుకంటే ఇది ఆధ్యాత్మికతను తగ్గిస్తుంది. **శుక్ర మహాదశలో** అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దు, ఎందుకంటే ఇవి జీవితాన్ని అస్థిరంగా చేస్తాయి. **శని మహాదశలో** ప్రియమైన వారితో అనుచితంగా ప్రవర్తించకూడదు, ఎందుకంటే ఇది ఒంటరితనాన్ని పెంచుతుంది. **రాహువు మహాదశలో** తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు, వారిని ఒంటరిగా వదలకూడదు, ఎందుకంటే ఇది కర్మ ఫలితాలను ప్రభావితం చేస్తుంది. **కేతువు మహాదశలో** ప్రకృతిని దుర్వినియోగం చేయకూడదు, ఎందుకంటే ఇది ఆధ్యాత్మిక శక్తిని తగ్గిస్తుంది. ఇవి కాకుండా, ప్రతి మహాదశలో కొన్ని శుభకార్యాలు చేయడం శ్రేయస్కరం. ఉదాహరణకు, **సూర్య మహాదశలో** ధర్మకార్యాలు చేయడం, * *చంద్ర మహాదశలో** తల్లికి సేవ చేయడం, * *కుజ మహాదశలో** ధైర్యాన్ని పెంచడం, * *బుధ మహాదశలో** విద్యను అభివృద్ధి చేయడం, * *గురు మహాదశలో** గురువులను గౌరవించడం, * *శుక్ర మహాదశలో** కళలను అభివృద్ధి చేయడం, * *శని మహాదశలో** కష్టపడడం, * *రాహు మహాదశలో** మంత్రజపం చేయడం, * *కేతు మహాదశలో** ధ్యానం చేయడం శ్రేయస్కరంగా ఉంటుంది. ఈ నియమాలను పాటించడం ద్వారా మన జీవితంలో శుభఫలితాలను పొందవచ్చు. https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj

Parakri Mantras https://linktr.ee/parakrijaya List of Mantras for all astrological remedies https://open.spotify.com/show/1KGtGEMgDSTJpkTRIpFOoc?si=PLn9qaf4SSe8a10zmUJ-gw&utm_source=copy-link https://anchor.fm/parakrijaya https://podcasts.google.com/feed/aHR0cHM6Ly9hbmNob3IuZm0vcy8yMjFkZjY4OC9wb2RjYXN0L3Jzcw== https://pca.st/zsot2grd https://radiopublic.com/parakri-mantras-GMdxb4 anchor.fm/s/221df688/podcast/rss See My 4 Blogs - P.V.Radhakrishna cell: 9966455872 About Us : https://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in/p/blog-page_1.html Astrology Blog శ్రీ మేధా దక్షిణమూర్తి జ్యోతిష నిలయం http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.in Devotional Blog సాధన ఆరాధన https://sadhanaaradhana.blogspot.in/ Telugu Literature Blog తెలుగు పండిత దర్శిని http://teluguteachers-parakri.blogspot.in My Writings - Blog పరాక్రి పదనిసలు contact for సన్మాన పత్రాలు - ఆశీర్వచనాలు http://jayaparakri.blogspot.in Like FB page : https://www.facebook.com/SRIMEDHADAKSHINAMURTYJYOTISHANILAYAM, FB Profile : https://www.facebook.com/parakrijaya Twitter Profile : https://twitter.com/parakrijaya సంప్రదించుటకు : [email protected] our services : horoscope analysis and Predictions, Remedies, Yogas, Doshas, Transits and much more. Report on Education, Career, Wealth, Marriage, Business, Favorable Periods, at the time of Question etc

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj https://www.facebook.com/teluguastrology Contact : 9966455872 P.V.Radhakrishna or jayamaheswari Our site : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.com @everyone


శ్రీ హనుమాన్ చాలీసా రచన: తులసీ దాస్దోహా శ్రీ గురు చరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి | వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫలచారి || బుద్ధిహీన తనుజానికై సుమిరౌ పవన కుమార | బల బుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్ || తాత్పర్యము :- నా మనస్సనెడి అద్దమును శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే శుభ్రము చేసుకొని చతుర్విధ పురుషార్ధములను, ధర్మార్థ కామ మోక్షముల నొసంగు శ్రీరామచంద్రుని విమల కీర్తిని వర్ణించెదను. బుద్ధిహీనత వలన ఈ శరీరము కలిగినదని తెలుసుకొని పవనకుమారుని తలచెదను. అతని వలన నాకు బుద్ధి, విద్య, బలము వచ్చుటయే కాక కామాది వికారాల వలన కలిగెడి కష్టములను హరించుగాక ! జయ హనుమాన ఙ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహు లోక ఉజాగర || 1 || తాత్పర్యము :- జ్ఞానగుణ సముద్రుడవయిన ఓ హనుమంతా! నీకు జయము కలుగుగాక ! ముల్లోకాలను ప్రకాశింపజేసే ఓ కపీశ్వరా ! నీకు జయము కలుగుగాక ! రామదూత అతులిత బలధామా | అంజని పుత్ర పవనసుత నామా || 2 || తాత్పర్యము :- ఓ! రామదూత ! అపార బలశాలీ ! అంజనీ తనయా ! వాయునందనుడను నామము కలవాడా ! మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ ||3 || తాత్పర్యము :- మహావీరా ! విక్రమ స్వరూపం గలవాడా! వజ్రం వంటి శరీరము గలవాడా ! దుర్భుద్ధలను పారద్రోలేవాడా ! సద్భుద్ధి గలవారలకు చేయూతనిచ్చేవాడా ! కంచన వరణ విరాజ సువేశా | కానన కుండల కుంచిత కేశా || 4 || తాత్పర్యము :- సువర్ణఛాయగల మేనిగలవాడా ! మంచి వేషం గలవాడా ! బంగారు కుండలములను ధరించువాడా ! ముడివేయబడ్డ కేశములు గలవాడా ! హాథవజ్ర అరు ధ్వజా విరాజై | కాంథే మూంజ జనేవూ ఛాజై || 5|| తాత్పర్యము :- చేతవజ్రము, ధ్వజముకలిగి వెలుగొందువాడా ! జందెము కలిగిన భుజముతో చెలువొందువాడా ! శంకర సువన కేసరీ నందన | తేజ ప్రతాప మహాజగ వందన || 6 || తాత్పర్యము :- శంకర నందనా ! కేశరి కుమారా ! ప్రతాపముతో తేజరిల్లు వాడా ! గొప్పదైన జగత్తుచే నమస్కరించబడువాడా ! విద్యావాన గుణీ అతి చాతుర | రామ కాజ కరివే కో ఆతుర || 7 || తాత్పర్యము :- విద్యాసంపన్నుడా ! కల్యాణగుణములు గలవాడా ! రామ కార్యము నెరవేర్చుటపట్ల ఆతృత గలవాడా ! ప్రభుచరిత్ర సునివేకో రసియా । రామలఖన సీతా మన బసియా ।। 8 ।। తాత్పర్యము :- రామకధను విను రసజ్ఞుడా ! రామలక్ష్మణసీతలను మనస్సున కలిగినవాడా ! సూక్ష్మ రూపధరి సియహి దిఖావా । వికట రూపధరి లంక జరావా ।। 9 ।। తాత్పర్యము :- సూక్ష్మ రూపముతో సీతకు కనబడినవాడా ! వికట రూపముతో లంకను కాల్చినవాడా ! భీమరూపధరి అసుర సంహారే । రామచంద్రకే కాజ సంవారే ।। 10 ।। తాత్పర్యము :- భయంకరమైన రూపమును ధరించి రాక్షసులను సంహరించిన వాడా ! రామచంద్రుని కార్యమును నెరవేర్చిన వాడా ! లాయ సంజీవన లఖన జియాయే । శ్రీ రఘువీర హరఖి ఉరలాయే ।। 11 ।। తాత్పర్యము :- సంజీవిని తెచ్చి లక్ష్మణుడ్ని జీవింపజేసినవాడా ! శ్రీ రామునిచే హృదయమునకు హత్తుకొనబడ్డవాడా ! రఘుపతి కీన్హీ బహుత బఢాయీ । తుమ మమ ప్రియ భరతహి సమభాయీ ।। 12 ।। తాత్పర్యము :- శ్రీరాముడు నిన్ను గొప్పగా ప్రశంసించి నువ్వు తనకు భరతునితో సమానమయినట్టివాడవని అనెను. సహస వదన తుమ్హరో యశగావైఁ । అసకహి శ్రీపతి కంఠ లగావై ॥ 13 ॥ తాత్పర్యము :- నీ యశస్సును శ్రీరాముడు వేనోళ్ళ గానము చేసి నిన్ను కావలించుకొనెను. సనకాదిక బ్రహ్మాది మునీశా । నారద శారద సహిత అహీశా ॥ 14 ॥ యమ కుబేర దిగపాల జహాఁతే । కవికోవిద కహి సకై కహాఁతే ॥ 15 ॥ తాత్పర్యము :- సనకాదులు, బ్రహ్మాది మునీశ్వరులు, నారద, శారద, ఆదిశేషులు, యముడు, కుబేరుడు ఆదిగాగల దిక్పాలకులు, కవి పండితాదులు ఎంతగా నిన్ను పొగుడుదురో ! తుమ ఉపకార సుగ్రీవ హిఁకీన్హా । రామ మిలాయ రాజపద దీన్హా ॥ 16 ॥ తాత్పర్యము :- నీవు సుగ్రీవునకు ఉపకారమొనర్చినవాడవు. శ్రీరామునితో మైత్రి కలుగజేసి రాజ్య సంపదను కలిగించితివి. తుమ్హరో మంత్ర విభీషణ మానా । లంకేశ్వరభయే సబజగ జానా ॥ 17 ॥ తాత్పర్యము :- నీయొక్క భోదనలను అంగీకరించిన విభీషణుడు లంకాధి పతియైన వైనము జగతికంతటికి తెలుసును. యుగ సహస్ర యోజన పరభానూ । లీల్యోతాహి మధుర ఫల జానూ ॥ 18 ॥ తాత్పర్యము :- రెండువేల యోజనముల దూరమందున్న సూర్యుడ్ని తియ్యని పండుగా భావించి లీలగా గ్రహించినవాడా ! ప్రభుముద్రికా మేలిముఖ మాహీ । జలధి లాంఘిగయే అచరజ నాహీఁ ॥ 19 ॥ తాత్పర్యము :- రామచంద్రప్రభువు ఇచ్చిన ముద్రికను భద్రముగా నోటనుంచుకొని సముద్రమును సులభముగా దాటినవాడా ! దుర్గమకాజ జగతకే జేతే । సుగమ అనుగ్రహ తుమ్హరే తేతే ॥ 20 ॥ తాత్పర్యము :- ప్రపంచమునగల కష్టకార్యమది యేదైనను నీ అనుగ్రహముతో సాధ్యము ఒనర్చునట్టివాడా ! రామదుఆరే తుమ రఖవారే । హోతను ఆజ్ఞా బిను పైసారే ॥ 21 ॥ తాత్పర్యము :- రాముని ద్వారమును కాచువాడవు నీవు ! నీ అనుమతి లేనిదే ఎవరికిని ప్రవేసించుటకు సాధ్యము కాదు. సబ సుఖ లహై తుమ్హారీ శరనా । తుమ రక్షక కాహూకో డరనా ॥ 22 ॥ తాత్పర్యము :- నీ శరణు కోరినచో సమస్త సౌఖ్యములు సంప్రాప్తించును. నీవు రక్షకుడిగా ఉండగా వేరెవరికి భయపడనక్కరలేదు. ఆపన తేజ సమ్హారో ఆపై । తీనోఁలోక హాంకతే కాంపై ॥ 23 ॥ తాత్పర్యము :- నీ యొక్క గొప్పదైన తేజస్సును( శోభను) నీవు మాత్రమే ధరించగలవు. నీ గర్జనకే ముల్లోకములు కంపించిపోవును. భూతపిశాచ నికట నహిఁ ఆవై । మహావీర జబ నామ సునావై ॥ 24 ॥ తాత్పర్యము :- భూతములు - పిశాచములు యేవియు నీ పేరు విన్నచో దరికి రానేరవు. నాసై రోగ హరై సబ పీరా । జపత నిరంతర హనుమత వీరా ॥ 25 ॥ తాత్పర్యము :- నీ నామమును నిరంతరము జపించినచో సమస్త రోగములు, పీడలు తొలగిపోవును. సంకటసే హనుమాన ఛూడావై । మనక్రమ వచన ధ్యాన జో లావై ॥ 26 ॥ తాత్పర్యము :- మనోవాక్కయ కర్మలచే హనుమంతుని ధ్యానించు వానికి సమస్త సంకటములనుండి విముక్తి కలుగును. సబ పర రామ తపస్వీ రాజా । తినకే కాజ సకల తుమ సాజా ॥ 27 ॥ తాత్పర్యము :- శ్రీరాముడు రాజులకు రాజు, మునులకు ప్రభువు, నీవు ఆ మహనీయుని కార్యములను అన్నింటిని సరిసొత్తుచుందువు. ఔర మనోరధ జో కోయి లావై । తాసు అమిత జీవన ఫల పావై ॥ 28 ॥ తాత్పర్యము :- ఎవరు యే మనోరధము కలిగి ఉన్నను, వారికి అమితముగా జీవనఫలము లభించుచుండును. చారోఁయుగ పరతాప తుమ్హారా । హై పరసిద్ధి జగత ఉజియారా ॥ 29 ॥ తాత్పర్యము :- నాలుగు యుగములందున నీ ప్రతాపము కలదనుట ప్రసిద్ధము. అందువలన జగత్తు ఉజ్వలమైనది. సాధు సంతకే తుమ రఖవారే । అసుర నికందన రామ దులారే ॥ 30 ॥ తాత్పర్యము :- సాధు సజ్జనులను రక్షించుచుందువు. రాక్షసులను చంపి రామునకు ఇష్టుడవైనవాడవు. అష్టసిద్ధి నవనిధికే దాతా । అసవర దీన్హ జానకీమాతా ॥ 31 ॥ తాత్పర్యము :- అష్టసిద్ధులు, నవనిధులు ఇచ్చు వరమును జనని జానకి నీకు అనుగ్రహించెను. రామ రసాయన తుమ్హరే పాసా । సదారహో రఘుపతికే దాసా ॥ 32 ॥ తాత్పర్యము :- నీ వద్ద రామరసానమున్నది. నీవు రామునకు వినయము గల దాసుడవు. తుమ్హరో భజన రామకో భావై । జన్మ జన్మక దుఃఖ బిసరావై ॥ 33 ॥ తాత్పర్యము :- నిన్ను భజించుట వలన శ్రీరాముడు సంతసించును. జన్మ జన్మల దుఃఖము నశించును. అంతకాల రఘుపతిపుర జాయీ । జహాఁ జన్మ హరిభక్త కహాయీ ॥ 34 ॥ తాత్పర్యము :- అంత్యకాలంలో రఘురాముని పురమును చేరుకొందురు. ఎచ్చట జన్మించినను హరిభక్తులుగానే చెప్పబడుదురు. ఔర దేవతా చిత్త న ధరయీ । హనుమత సేయి సర్వ సుఖ కరయీ ॥ 35 ॥ తాత్పర్యము :- ఇతర దైవమును మదినెంచక హనుమంతుని సేవించిన సమస్త సుఖములను నాతడు సమకూర్చును. సంకట హటై మిటై సబ పీరా । జో సమిరై హనుమత బలవీరా ॥ 36 ॥ తాత్పర్యము :- బలవంతుడగు హనుమంతుని తలచిన సమస్త సంకటములు తొలగిపోవును. జైజైజై హనుమాన గోసాయీ । కృపాకరో గురుదేవకీ నాయీ ॥ 37 ॥ తాత్పర్యము :- ఓ ! ప్రభూ ! హనుమంతా ! నీకు జేజేలు ! నా పట్ల కృప జూపుము, గురుదేవా ! జో శతబార పాఠకర కోయీ । ఛూటహి బంది మహా సుఖ హోయీ ॥38 ॥ తాత్పర్యము :- ఎవరు దీనిని నూరు పర్యాయములు పఠించెదరో వారికి బాధలు, బంధములు తొలగి సుఖములు పొందెదరు. జోయహ పఢై హనుమాన చాలీసా । హోయ సిద్ధి సాఖీ గౌరీసా ॥ 39 ॥ తాత్పర్యము :- హనుమాన చాలీసా స్తోత్రమును పఠించు వారికి గౌరీ శంకరుల సాక్షిగా సిద్ధి కలుగును. తులసీదాస సదా హరిచేరా । కీజై నాధ హృదయ మహాఁడేరా ॥ 40 ॥ తాత్పర్యము :- సదా హరిదాసగు తులసీదాస ప్రభువా, సదా నీవు నా హృదయమందుండుము. దొహ పవన తనయ సంకట హరణ – మంగళ మూరతి రూప్ | రామ లఖన సీతా సహిత – హృదయ బసహు సురభూప్ || తాత్పర్యం ఓ సంకతములను హరించే పవన తనయ నీవు మంగళ మూర్తివి. సీత రామ లక్ష్మణ సహితముగా నా హృదయంలో నివసించుము.

https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj https://www.facebook.com/teluguastrology Contact : 9966455872 P.V.Radhakrishna or jayamaheswari Our site : http://medhadakshinamurtyjyotishanilayam.blogspot.com


*అబ్బాయికైనా అమ్మాయికైనా త్వరగా పెళ్లి కావాలంటే ఈ మంత్రాలు పాటించండి....!!* మంత్ర తంత్రాలు మనిషి జీవితంలోని గ్రహదోషాలకు పరిష్కార మార్గాలు చూపిస్తాయని మన పురాణ సాహిత్యం చెబుతోంది. దేనికి ఏ మంత్రం పఠిస్తే ఎలాంటి పరిష్కార మార్గం లభిస్తుందో కూడా అవి వివరించాయి. ఆసక్తి, నమ్మకం ఉన్నావారు వాటిని పాటించి ఫలితాలు పొందొచ్చు. అయితే మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని విమర్శించేవారు వీటి జోలికి పోకపోవడం ఉత్తమం. విశ్వాసమే అన్నింటికీ పునాది, ఇక చాలా మంది వివాహ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారి కోసం కూడా మన పురాణాల్లో మంత్రాలు ఉన్నాయి. _త్వరగా పెళ్లి కావాలంటే.. ఈ క్రింది మంత్రాలు పఠించాలి 🙏🌹_ 🌿1. కాత్యాయనీ మహాభాగే మహాయోగిన్ యతీశ్వరీ నందగోప సుతం దేవీ పతిమే కురుతే నమః 🌸2. అనాకలిత సాదృశ్య చుబుక విరాజితః కామేశ బద్ద మాంగల్య సూత్ర శోభిత కందర 🌿3. విదేహి కళ్యాణం విదేహీ పరమాశ్రయం రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజమే https://chat.whatsapp.com/DhZBkR4z4pB8E7asGxgjkj 🌸4 సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణే నమోస్తుతే 🌿రుక్మిణీ కల్యాణం పారాయణం చేయటం కూడా సత్వర వివాహానికి ఉపకరిస్తుంది. 🌸అలాగే.. పెళ్లికాని కన్యలు నిత్యం స్నానానంతరం తులసి చెట్టుకు 12 ప్రదక్షిణాలు చేసి గౌరీమాతను ప్రార్థిస్తూ సౌందర్యలహరిలోని 4, 11, 27 శ్లోకాలలో ఏదో ఒకదాన్ని పఠించాలి. ఇలా 120 రోజులు చేస్తే త్వరగా వివాహమవుతుంది .. సేకరణ..🙏🌹