
TeluguAstrology
June 18, 2025 at 12:12 PM
🌺🌾🌺🌾🌺🌾🌺🌾🌺
*🌷వారాహి నవరాత్రులు (ఆషాడ గుప్త నవరాత్రి)🌷*
https://chat.whatsapp.com/BcjRhgeek7rDCz13Gau0Bp
*🍀స్త్రోత్రం / అష్టోత్తరం /నియమాలు🍀*
*26 /06 అదివారాహి గురువారం*
*27/06 దండిని వారాహి , శుక్రవారం*
*28/06 బృహద్ వారాహి, శనివారం*
*29/ 06 ఉన్మత్త వారాహి , ఆదివారం*
*30/06 స్వప్న వారాహి, సోమవారం*
*1/07 ధూమ్ర వారాహి , మంగళవారం*
*2/07 వజ్ర వారాహి , బుధవారం*
*3/07 శ్వేత వారాహి , గురువారం*
*4/07 కిరాత వారాహి , శుక్రవారం*
*5/07 మహా వారాహి , శనివారం*
*🌺వారాహిమాతను లలితమ్మ అంగ దేవతగా శ్రీవిద్య లో పూజ చేస్తే ఆమె పూజ రాత్రి సమయంలో మటుకే చేయాలి..వారహిని ప్రధాన దేవతగా పూజించే సమయంలో మూడు కాలాల్లో పూజ చేయవచ్చు.. ఉదయం సాయంత్రం కూడా వారాహి నవరాత్రి జరిపే రోజుల్లో పూజ చేయవచ్చు...*
*🌺 ఈ తల్లి ఎన్నో సమస్యలకు పరిహారం ఇస్తుంది, ముక్యంగా ఆస్తి తగాదాలు, అప్పులు, అనారోగ్య సమస్యలు, భూమి కొనడం, అమ్మడం, శత్రు బాధలు, గ్రహ బాధలు, ప్రయోగ బాధలు నుండి విముక్తి కలుగుతుంది. రానున్న రోజుల్లో మళ్ళీ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ,ఏ కుటుంబం లో వ్యక్తి లు అయిన వారిని దూరం చేసికునే పరిస్థితి రాకూడదు. సమస్యలు వచ్చినా అవి దాటగల శక్తి అమ్మవారు అనుగ్రహించాలి ,ప్రతి కుటుంబానికి ఆమె రక్ష ఉండాలి*
*🌺ఉదయం లలితా సహస్రనామ పారాయణ చేయండి సాయంత్రం 6 గ పైన వారాహి పూజ మొదలుపెట్టాలి.*
*🌺అమ్మవారికి ఇప్ప నూనె అంటే చాలా ఇష్టం ఇప్ప నూనె తో దీపారాధన, ఇప్ప పువ్వులు దొరికితే పూజలో వాడండి, ఆ తల్లికి ప్రతి రోజు నివేదనలో యధాశక్తిన గుండ్రటి పండ్లు నైవేద్యం పెట్టాలి, లడ్డులు ( నువ్వులు బెల్లం నైయ్యి, ఇలాచి), పనస పండు చాలా విశేషం.. బెల్లం పానకం కచ్చితంగా పెట్టాలి*.
*🌺కందగడ్డ తో వంట నైవేద్యం, కంద దీపం, దుంపలు చిలకడ దుంపలు ఉడికించి బెల్లం కలిపి పెట్టడం..దానిమ్మ పండ్లు, దానిమ్మ గింజలతో అర్చన.. పుట్టతేన నైవేద్యం*..
*🌺అమ్మవారికి చేసే హోమంలో , తోక మిరియాలు, తెల్ల ఆవాలు, పనస తో చేస్తే అమ్మవారికి చాలా ప్రీతి.*
*🌷వారాహి అష్టోత్తరం🌷*
ఓం వరాహవదనాయై నమః
ఓం వారాహ్యై నమః
ఓం వరరూపిణ్యై నమః
ఓం క్రోడాననాయై నమః
ఓం కోలముఖ్యై నమః
ఓం జగదంబాయై నమః
ఓం తారుణ్యై నమః
ఓం విశ్వేశ్వర్యై నమః
ఓం శంఖిన్యై నమః
ఓం చక్రిణ్యై నమః
ఓం ఖడ్గ శూల గదాహస్తాయై నమః
ఓం ముసల ధారిణ్యై నమః
ఓం హలసకాది సమాయుక్తాయై నమః
ఓం భక్తానాం అభయప్రదాయై నమః
ఓం ఇష్టార్థదాయిన్యై నమః
ఓం ఘోరాయై నమః
ఓం మహాఘోరాయై నమః
ఓం మహామాయాయై నమః
ఓం వార్తాళ్యై నమః
ఓం జగదీశ్వర్యై నమః
ఓం అంధే అంధిన్యై నమః
ఓం రుంధే రుంధిన్యై నమః
ఓం జంభే జంభిన్యై నమః
ఓం మోహే మోహిన్యై నమః
ఓం స్తంభే స్తంభిన్యై నమః
ఓం దేవేశ్యై నమః
ఓం శత్రునాశిన్యై నమః
ఓం అష్టభుజాయై నమః
ఓం చతుర్హస్తాయై నమః
ఓం ఉన్మత్తభై రవాంకస్థాయై నమః
ఓం కపిల లోచనాయై నమః
ఓం పంచమ్యై నమః
ఓం లోకేశ్యై నమః
ఓం నీలమణి ప్రభాయై నమః
ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః
ఓం సింహారూఢాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం శ్యామలాయై నమః
ఓం పరమాయై నమః
ఓం ఈశాన్యై నమః
ఓం నీలాయై నమః
ఓం ఇందీవర సన్నిభాయై నమః
ఓం ఘనస్తన సమోపేతాయై నమః
ఓం కపిలాయై నమః
ఓం కళాత్మికాయై నమః
ఓం అంబికాయై నమః
ఓం జగద్ధారిణ్యై నమః
ఓం భక్తోపద్రవ నాశిన్యై నమః
ఓం సగుణాయై నమః
ఓం నిష్కళాయై నమః
ఓం విద్యాయై నమః
ఓం నిత్యాయై నమః
ఓం విశ్వ-వశంకర్యై నమః
ఓం మహారూపాయై నమః
ఓం మహేశ్వర్యై నమః
ఓం మహేంద్రితాయై నమః
ఓం విశ్వవ్యాపిన్యై నమః
ఓం దేవ్యై నమః
ఓం పశూనాం అభయంకర్యై నమః
ఓం కాళికాయై నమః
ఓం భయదాయై నమః
ఓం బలిమాంస మహాప్రియాయై నమః
ఓం జయభైరవ్యై నమః
ఓం కృష్ణాంగాయై నమః
ఓం పరమేశ్వర వల్లభాయై నమః
ఓం సుధాయై నమః
ఓం స్తుత్యై నమః
ఓం సురేశాన్యై నమః
ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః
ఓం స్వరూపిణ్యై నమః
ఓం సురానాం అభయప్రదాయై నమః
ఓం వరాహదేహ సంభూతాయై నమః
ఓం శ్రోణీ వారాలసే నమః
ఓం క్రోధిన్యై నమః
ఓం నీలాస్యాయై నమః
ఓం శుభదాయై నమః
ఓం అశుభవారిణ్యై నమః
ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః
ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః
ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః
ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః
ఓం సర్వశత్రు క్షయంకర్యై నమః
ఓం సర్వశత్రు సాదనకారిణ్యై నమః
ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః
ఓం భైరవీ ప్రియాయై నమః
ఓం మంత్రాత్మికాయై నమః
ఓం యంత్రరూపాయై నమః
ఓం తంత్రరూపిణ్యై నమః
ఓం పీఠాత్మికాయై నమః
ఓం దేవదేవ్యై నమః
ఓం శ్రేయస్కర్యై నమః
ఓం చింతితార్థ ప్రదాయిన్యై నమః
ఓం భక్తాఅలక్ష్మీవినాశిన్యై నమః
ఓం సంపత్ప్రదాయై నమః
ఓం సౌఖ్యకారిణ్యై నమః
ఓం బాహువారాహ్యై నమః
ఓం స్వప్నవారాహ్యై నమః
ఓం భగవత్యై నమః
ఓం ఈశ్వర్యై నమః
ఓం సర్వారాధ్యాయై నమః
ఓం సర్వమయాయై నమః
ఓం సర్వలోకాత్మికాయై నమః
ఓం మహిష నాసినాయై నమః
ఓం బృహద్ వారాహ్యై నమః
*🌺ఇతి శ్రీ మహా వారాహి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం..*
*🌹శ్రీ వింధ్యేశ్వరి స్తోత్రం (వారాహి దేవి).🌺*
🌺🌾నిశుంభ-శుంభ మర్దిని ప్రచండ ముండ ఖండినీం
వనే రణే ప్రకాశినీం భజామి వింధ్య వాసినీం 1 ..
🌺🌺త్రిశూల ముండ ధారిణీం ధరా విఘాత హారిణీం
గృహే గృహే నివాసినీం భజామి వింధ్య వాసినీం 2 ..
🌺🌾దరిద్ర దుఃఖ హరిణీం సదా విభూతి కారిణీమ్
వియోగ శోక హరిణీం భజామి వింధ్య వాసినీం 3..
🌺🌾లసత్సులోల లోచనం లతాసదే వరప్రదం
కపాల శూల ధారిణీం భజామి వింధ్య వాసినీం 4..
🌺🌾కరేముదా గదాధరీం శివమ్ శివ ప్రదాయినీమ్
వరం వరాననం శుభం భజామి వింధ్య వాసినీం 5..
🌺🌾ఋషీంద్రయామినీ ప్రదం త్రిదా స్వరూపధారిణీం
జలే స్థలే నివాసినీం భజామి వింధ్య వాసినీం 6..
🌺🌾విశిష్ట సృష్టి కారిణీమ్ విశాల రూప ధారిణీం
మహోదరే విలాసినీమ్ భజామి వింధ్య వాసినీం 7..
🌺🌾పురంధరాది సేవితం మురాది వంశ ఖండినీమ్
విశుద్ధ బుద్ది కారిణీమ్ భజామి వింధ్య వాసినీం 8.
*🌺అమ్మవారి అనుగ్రహం పొందే స్త్రోత్రం ఇది. ప్రతి రోజు పారాయన స్త్రోత్రం గా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది.*
*🙏మంత్రం: "ఓం హ్రీం వారాహీ హరి ఓం"🙏*
*🌷శ్రీ వారాహీ ద్వాదశ నామ స్తోత్రం..🌷*
🌺అస్య శ్రీవారాహీ ద్వాదశ నామ స్తోత్రస్య అశ్వానన ఋషిః |
అనుష్టుప్ఛందః | శ్రీవారాహీ దేవతా |
శ్రీవారాహి ప్రసాద సిద్ధ్యర్థం |
సర్వ సంకట హరణ జపే వినియోగః ||
🌺పంచమీ దండనాథా చ సంకేతా సమయేశ్వరీ |
తథా సమయసంకేతా వారాహీ పోత్రిణీ శివా ||
🌺వార్తాలీ చ మహాసేనాఽఽజ్ఞాచక్రేశ్వరీ తథా
అరిఘ్నీ చేతి సంప్రోక్తం నామ ద్వాదశకం మునే ||
🌺నామ ద్వాదశధాభిజ్ఞ వజ్రపంజరమధ్యగః |
సఙకటే దుఃఖమాప్నోతి న కదాచన మానవః ||
*🌺ఇతి శ్రీ వారాహీ ద్వాదశనామస్తోత్రం సంపూర్ణం*
*🌺👉నియమాలు*
*🌺వారాహి నవరాత్రి దీక్ష చేసేవారు ఆహారనియమం పాటించాలి (ఉపవాసం చేయకండి పూజ ఐయ్యాక తినవచ్చు, )*
*🌺వారాహి నవారాత్రి రెండు పూటలా ఉదయం సాయంత్రం చేయాలి*
*🌺బ్రహ్మచర్య నియమాలు పాటించాలి..*
*🌺ఆ పది రోజులు ఇంట్లో శాకాహారమే వండాలి ,వండిన ప్రతి పదార్థాలను నైవేద్యం గా పెట్టి ప్రసాదంగా తినాలి.*
*🌺ఆ పది రోజులు అఖండ దీపం ఉంటే మంచిది*..
*🌺వారాహి పాడి పంటలకు ,భూమికి సంబంధించిన శక్తి కనుక.. మొదటి రోజు కొత్త కుండలో మట్టి వేసి నవధాన్యాలు వేయండి ఆ మట్టితో నిండిన పాత్రను పూజలో ఉంచలి పదవ రోజుకి మొలకలు ఆరోగ్యం గా మొలిస్తే మీ సంకల్పం ఆటంకాలు లేకుండా నెరవేరి నట్టు.. తర్వాత అవి అవుకి తినిపించాలి.*
*🌺పసుపు గణపతిని ప్రతి రోజూ చేయాలి..ఆ గణపతి ని చేసిన పసుపు వీనియోగించుంకోవచ్చు.*.
*🌺విగ్రహం ఉన్నవారు రోజూ పసుపునీటితో అభిషేకం చేయవచ్చు.. ఫోటో ఉన్నవారు అయితే రోజూ పువ్వులు వాడుకోవచ్చు.*.
*🌺విగ్రహం ఫోటో రెండూ లేని వారు ఇంట్లో ఏ అమ్మవారి రూపం ఉంటే ఆ తల్లి ఫోటో ముందు దీపాన్ని పెట్టి వారాహిగా దీపాన్ని ఆవాహన చేయవచ్చు.. దీపానికి చేసేవారు అభిషేకం ద్రవ్యా స్పూన్ లో అమ్మవారికి మంత్రం చదువుతూ చూపించి ఒక పాత్రలో ఉంచి అందులోనే దేవతా ఆచమనం నీళ్లు, చివరిగా అది తీర్థం గా సేవించావచ్చు*.
*🌺యంత్ర పూజ తెలిసిన వారు ప్రతి రోజు యంత్ర పూజ చేయాలి.*
*🌺మధ్యాహ్నం భోజనం చేయవచ్చు సాయంత్రం పూజకి మళ్ళీ స్నానం చేసుకుని పూజ చేయాలి.*
*🌺నైవేద్యం మీకు కలిగినదే పెట్టండి, ఇంకొకరి తో పోటీ పడి అప్పులు చేసి ఆర్భాటా లు వద్దు భక్తితో చేస్తే చాలు.*.
*🌹నమో వారాహికొలముఖీ శరణం మమ🌹*
🌾🌹🌾🌹🌾🌹🌾🌹🌾