Anil Kumar Yadav | INC

Anil Kumar Yadav | INC

1.5K subscribers

Verified Channel
Anil Kumar Yadav | INC
Anil Kumar Yadav | INC
June 18, 2025 at 04:09 PM
డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో, పోలవరం - బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టుపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎంపీల సమావేశంలో పాల్గొన్నాను. తెలంగాణకు తీవ్రంగా అన్యాయం చేయగల ఈ ప్రాజెక్టుకు ప్రతిపక్షాల సహా అన్ని పక్షాల నేతలు వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి గారు — ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తెలంగాణ హక్కులను రక్షించే పోరాటానికి సిద్ధంగా ఉండాలంటూ ఎంపీలకు సూచించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో బనకచర్లపై తెలంగాణ వాణిని బలంగా వినిపించేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణపై జరిగే ఏ అన్యాయాన్నీ సహించం. #aky
🙏 2

Comments