
Kadapa Heart Beats
June 14, 2025 at 05:24 PM
*ఈ నెల 20, 21 తేదీల్లో జరగాల్సిన*
*డీఎస్సీ పరీక్షల తేదీలు మార్పు*
• ఆ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్షలు నిర్వహణ
• వెల్లడించిన మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి
*అమరావతి:*
* ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
* యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లు AP MEGA DSC-2025 website: https://apdsc.apcfss.in లో 25.06.2025 అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు.
* అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోని వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సిందని మెగా DSC–2025 కన్వీనర్ ఎం.వికృష్ణారెడ్డి కోరారు.