
Kadapa Heart Beats
June 15, 2025 at 03:13 PM
*ఐదుకు చేరిన గోదావరి మృతుల సంఖ్య*
*కుత్బుల్లాపూర్:*
బాసర వద్ద గోదావరి నది విషాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. అమ్మవారి దర్శనానికి వచ్చిన వారిలో ఐదుగురు మరణించడం తీవ్ర విషాదాన్ని నింపింది. రాజస్థాన్ కు చెందిన 3 కుటుంబాలు హైదరాబాద్ లోని చింతల్, కాచిగూడ ప్రాంతాల్లో స్థిర పడ్డారు. ఈ క్రమంలో ఆయా కుటుంబాలకు చెందిన 18 మంది అమ్మవారి దర్శనానికి వచ్చారు. పుణ్య స్నానాల కోసం గోదావరి నదికి చేరుకున్నారు. ఇసుక మేటలు వేసిన ప్రాంతంలోకి వెళ్లి స్నానాలు చేస్తుండగా అక్కడక్కడ ఉన్న లోతైన ప్రాంతంలో ఐదుగురు యువకులు మునిగి గల్లంతయ్యారు. కుటుంబ సభ్యుల కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకునే సరికి నీట మునిగి పోయారు.
గజ ఈతగాళ్ల సాయంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహలను బయటకు వెలికి తీశారు. మృతులను రాకేష్ ( 17 ) , వినోద్ ( 18 ) , రుతిక్ , మదన్ ( 18 ), భరత్ (19) గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలిచి వేశాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.