Kadapa Heart Beats
Kadapa Heart Beats
June 15, 2025 at 03:13 PM
ఆంధ్రప్రదేశ్... *ఏపీలో 18 ఏళ్లు నిండిన మహిళలకు శుభవార్త..* 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త త్వరలోనే మరో పథకం అమలుకు శ్రీకారం వారి ఖాతాలో రూ.18000 త్వరలోనే మరో పథకాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని మహిళలకు శుభవార్త చెప్పింది. 18 ఏళ్లు నిండిన మహిళల ఖాతాలో రూ.18 వేలు జమ చేసేందుకు సిద్ధం అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయ్యింది. అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 18-59 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు రూ.1500 నేరుగా వారి ఖాతాలో జమ చేయనున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ పథకం అమలు కోసం 2024-2025 బడ్జెట్‌లో రూ.3,341.82 కోట్లు నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తంలో బీసీ మహిళలకు రూ.1069.78 కోట్లు కేటాయించగా.. మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళల కోసం రూ.629.37 కోట్లు, అలానే మైనారిటీ ఆడబిడ్డలకు రూ.83.79 కోట్లు, మిగతా మొత్తంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అర్హులైన వారు అధికారిక వెబ్‌సైట్: https://ap.gov.in/aadabiddanidhiను సందర్శించి చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అధికారిక వెబ్‌సైట్ ఇంకా అందుబాటులోకి రాలేదు.

Comments