Yeluri Sambasiva Rao

2.8K subscribers

Verified Channel
Yeluri Sambasiva Rao
June 19, 2025 at 04:09 PM
రైతుల పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు చెప్పారు. చివరి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొనుగోలు సాధ్యం కాదని రైతులు అపోహ పడ్డారని, అసాధ్యాన్ని హస్త ప్రభుత్వం సుసాధ్యం చేసిందన్నారు. విదేశీ మరక ద్రవ్యం అధికంగా వచ్చే బ్లాక్ బర్లీ పొగాకు పంటను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. పొగాకు పంట అత్యధికంగా పర్చూరు నియోజకవర్గంలోని రైతులు సాగు చేశారని, వారికి ప్రభుత్వం కొండంత అండగా నిలిచిందన్నారు. తదుపరి ఏ పంట వేసుకోవాలో ప్రభుత్వం నిర్ణయం మేరకు పంటలు సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ప్రణాళికతో ముందుకు సాగాలని రైతులకు సూచించారు. బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగు చేయాలని రైతులపై ఒత్తిడి తెచ్చిన కంపెనీలు ఇప్పుడు దిగుబడి రాగానే చేతులెత్తేశాయని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ముందుకు వచ్చి రైతులకు అండగా నిలిచిందన్నారు. చరిత్రలో ఎక్కడా, ఎప్పుడు లేనట్లుగా ప్రభుత్వమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలులు ప్రారంభించిందన్నారు. కొనుగోలు చేసిన పొగాకును విదేశాలకు ఎగుమతి చేయాలంటే నాణ్యతను, మార్క్ ఫెడ్ నిబంధనలను రైతులు తప్పనిసరిగా పాటించాలన్నారు. పొగాకు రైతులకు సుమారుగా రూ.500 కోట్లు నగదు రానున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు.పొగాకు రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఇలాంటి దుర్భిక్ష పరిస్థితులకు రైతులు గురి కాకుండా ప్రభుత్వం నూతన విధానాలతో ముందుకు వెళ్తుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు, భూమి, వాతావరణ సమతుల్యతను బట్టి ఎలాంటి పంటలు సాగు చేయాలో ప్రణాళిక రూపొందిస్తుంది. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, అధికారుల సూచన మేరకు రైతులు పంటల సాగు చేయాలన్నారు. ప్రభుత్వ సూచనలు పాటిస్తే భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను అధిగమించవచ్చు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుందన్నారు. #idhimanchiprabhutvam #farmersfriendlygovt #chandrababunaidu #yelurisambasivarao #mlaparchur #andhrapradesh
Image from Yeluri Sambasiva Rao: రైతుల పరిరక్షణ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని...
❤️ 2

Comments