@YadavVakheel
@YadavVakheel
June 11, 2025 at 06:24 AM
వాట్సప్‌ ద్వారా నోటీసులు ఇవ్వకూడదా ..? క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 41-ఎ కి సమానమైన నిబంధనభారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలో సెక్షన్‌ 35. ఈ సెక్షన్‌ ప్రకారంజారీ చేసే నోటీసులు వాట్సప్‌ ద్వారా, ఎలక్ట్రానిక్‌ మాద్యమాల ద్వారాపంపించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఈమధ్య సతీందర్‌ కుమార్‌అంటిల్‌ వర్సెస్‌ సి.బి.ఐ కేసులో స్పష్టం చేసింది. ఈ నోటీనులనిముద్దాయిలకు, అనుమానితులకి జారీ చేస్తారు. కోర్టు ఇక్కడితో ఊరుకోలేదు. దీనికి సంబంధించిన విషయాలని పోలీసు స్టాండింగ్ ఆర్డర్స్‌లో పొందుపరచాలని ఆదేశించింది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోఅదేవిధంగా బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌ లో చెప్పిన విధంగానే ఈ నోటీసులని జారీ చేయాలని జస్టిస్‌ యం.యం. సుందరేష్‌, జస్టిస్‌ రాజేశ్‌బిందాల్‌లు లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం అన్ని రాష్ట్రాల డీజీపీ లను, అదేవిధంగా కేంద్రపాలిత ప్రాంతాల పోలీసు అధికారులనుఆదేశించింది. సతీందర్‌ కుమార్‌ అంటిల్‌ వర్సెస్‌ సి.బి.ఐ నేపథ్యం నేపథ్యం గురించి తెలుసుకునే ముందు సుప్రీంకోర్టు జారీచేసినఉత్తర్వులని పరిశీలిద్దాం. ముద్దాయిల అనుమానితుల హాజరుకోసం పోలీసులు క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోని సెక్షన్‌ 41-ఎ (భారతీయనాగరిక్‌ సురక్షా సంహితలోని సెక్షన్‌ 35) ప్రకారం వాట్సప్‌ లేదా ఇతరఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ద్వారా అందించకూడదని సుప్రీంకోర్టుపోలీసులని ఆదేశించింది. ఆ రెండు శాసనాలలో గుర్తించిన, సూచించిన సేవా విధానానికి ప్రత్యామ్నాయంగా ఈ వాట్సప్‌ లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ మోడ్‌లనోటీసులు పంపించడాన్ని పరిగణించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ లోని సెక్షన్‌ 160 (179 బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌) 175 క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (195 బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌) చెప్పిన విధం గా నోటీసులను ముద్దాయిలకు, సాక్షులకు జారీ చేయాలనికోర్టు ఆదేశించింది. అనవసర అరెస్టులని నిరోధించడానికి, అర్హులైన ఖైదీలకు బెయిల్‌ మంజూరుని సులభతరం చేయడానికి కోర్టు ఈ ఆదేశాలను జారీచేసింది. సతీందర్‌ కుమార్‌ కేసులో కోర్టు గతంలో జారీచేసినఉత్తర్వులని పర్యవేక్షించ డానికి కేసు సుప్రీంకోర్టు ముందు 20 జనవరి2025 వచ్చింది. ఈ కేసులో కోర్టుకి సహకరించడానికి సిద్ధార్ధ లూద్రాని అమికస్‌ క్యూరిగా నియమించింది. కోర్టు గతంలోపలురకాల ఉత్తర్వులని జారీచేసింది. ఆ ఉత్తర్వుల అమలునిచూడటానికి ఈ కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. మేఘాలయాహైకోర్టు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ప్రమాణపత్రం మాదిరిగా అన్నిరాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలు సుప్రీంకోర్టు ఉత్తర్వుల అమలుగురించి దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మూడు ముఖ్యమైన విషయాలు --------------/--------------- సతీందర్‌ కుమార్‌ అంటిల్‌ కేసులో ముఖ్యంగా మూడు ప్రధానమైనఅంశాలు వున్నాయి. అవి .. 1. - ఆధార్‌ కార్డుని పరిశీలించి విచారణలో ఉన్న ఖైదీలను వ్యక్తిగతపూచీకత్తుమీద విడుదల చేయడం. - సెక్షన్‌ 41-ఎ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ అదేవిధంగా సెక్షన్‌ 35 ప్రకారంసక్రమంగా నోటీసులు జారీ చేయడం గురించి. - హైకోర్టుల ద్వారా సంస్థాగత పర్యవేక్షణ యంత్రాంగం ఏర్పాటుగురించి. 2. వ్యక్తిగత పూచీకత్తు మీద విచారణలో ఉన్న ఖైదీలను విడుదలచేయడం గురించి జాతీయ లీగల్‌ సర్వీసెస్‌ అధారిటీ (నల్సా) చర్చలలో పాల్గొన్నది. 3. చట్టం నిర్దేశించిన ప్రకారం కాకుండా పోలీసు అధికారులు వాట్సప్‌లేదా ఇతర ఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ద్వారా నోటీసులని జారీ చేయడంగురించి. ఈ కేసు విచారణలో సుప్రీంకోర్టు సతీందర్‌ కుమార్‌ అంటిల్‌ వర్సెస్‌సి.బి.ఐ (2022), రాకేష్‌ కుమార్‌ వర్సెస్‌ విజయాంత్‌ ఆర్య (2021) అమీన్‌ దీప్‌ సింగ్‌ జోహార్‌ వర్సెస్‌ స్టేట్‌ (2018) కేసులనిఉదహరించింది. ఈ కేసులో అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాలు పాల్గొనాల్సిఉంటుంది. అంతేకాదు వాటి అడ్వకేట్‌ జనరల్స్‌, ప్రతినిధులు కోర్టుముందు హాజరవుతారు. నాగరిక సురక్షా సంహిత ప్రకారం కేసు విచారణలను, ఎంక్వైరీలనుఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ప్రకారం నిర్వహించవచ్చు కానీ వాట్సప్‌ల ద్వారాఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ప్రకారం నోటీసులను జారీ చేయడానికి వీల్లేదు. సెక్షన్‌ 41-ఎ నోటీసు సర్వీస్‌ విధానం. ---------------------------------- సెక్షన్‌ 41-ఎ క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌కి సమానమైన నిబంధన 35 బి.ఎన్‌.ఎస్‌.ఎస్‌ ఈ నిబంధన ప్రకారం ఎవరైనా వ్యక్తినిహాజరుకమ్మని నోటీస్‌ జారీచేసే అధికారాలు కలిగి ఉంటారు. ఎవరిఅరెస్టు అయితే అవసరం లేదని పోలీసు అధికారి భావిస్తాడో వారికిఈ నోటీసుజారీ చేస్తారు. కానీ అతను కాగ్నిజబుల్‌ నేర సమాచారంఇచ్చే వ్యక్తి అయివుండాలి. ఆ వ్యక్తికి వ్యతిరేకంగా సహేతుకమైనఫిర్యాదు ఉండాలి. నోటీసు ఎలా అందించాలి ------------------------ ఈ నిబంధన బోధనాత్మకమైనది కాదు. అయితే రాజేష్‌ కుమార్‌వర్సెస్‌ విజయాంత ఆర్య మరి ఇతరులు కేసులో ఢిల్లీ హైకోర్టుఈవిధంగా చెప్పింది. వాట్సప్‌ ద్వారా నోటీసు జారీచేయడం సరైందికాదు. సెక్షన్‌ 41-ఎ (సె.35) నోటీసుని క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోసమన్స్‌ జారీచేయడానికి చెప్పిన పద్ధతిలోనే ఈ నోటీసునిజారీచేయాల్సి ఉంటుంది. అంటే ఈ నోటీసుకి సంబంధిత వ్యక్తికివ్యక్తిగతంగా అందచేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ నోటీసునికుటుంబ సభ్యులపై కూడా ప్రత్యేక మైన పరిస్థితులలో తప్ప జారీ చేయడానికి వీల్లేదు. ఈ రాకేష్‌కుమార్‌ తీర్పుని సుప్రీంకోర్టు జులై 11, 2022 రోజునవెలువరించిన సతీందర్‌ కుమార్‌ అంటిల్‌ కేసులో ఈ కేసుని సుప్రీం కోర్టు సమర్ధించింది.కాబట్టి ఈ తీర్పు దేశంలోని అందరు పోలీసులపై పాలనీయమైఉంటుంది. వాట్సప్‌/ఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ప్రకారం నోటీస్‌ సర్వ్‌ చేయడాన్నితిరస్కరించడానికి కారణాలు వాట్సప్‌ల ద్వారా, ఇతర ఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ద్వారా నోటీసులనుజారీ చేయడాన్ని తిరస్కరించడానికి రెండు కారణాలు.అవి- ఈ సెక్షన్లు ఆవిధంగా నోటీస్‌ సర్వ్‌ చేయడాన్ని ఆమోదించవు. అదిచట్టం నిర్దేశించిన పద్ధతి కాదు. క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోనిఅధ్యాయం ఆరు సమన్లని జారీచేసే పద్ధతిని నిర్దేశిస్తుంది. అందులోనిసెక్షన్‌ 62 ప్రకారం సమన్స్‌ని సాధ్యమైన మేరకు వ్యక్తిగతంగాజారీ చేయాల్సి ఉంటుంది. కార్పొరేట్‌ సంస్థలకి నోటీసులని రిజిష్టర్‌పోస్టు ద్వారా పంపించవచ్చని సెక్షన్‌ 63 చెబుతుంది. సెక్షన్‌ 64 ప్రకారం నోటీసుని అతని కుటుంబంలోని వయోజన వ్యక్తి ద్వారాసమన్స్‌ని ఇవ్వవచ్చు. ఈ రెండు పద్ధతులలో సమన్స్‌ని జారీ చేసేవీలు లేనప్పుడు ఆ వ్యక్తి సాధారణంగా నివసించే ఇంటిలోప్రస్ఫుటమైన భాగానికి నోటీసులు అంటించవచ్చని సెక్షన్‌ 65 చెబుతుంది. భారతీయ నాగరిక్‌ సురక్షా సంహితలోని సంబంధిత నిబంధనలలోఎక్కడా ఎలక్ట్రానిక్‌ మోడ్‌ల ద్వారా సమన్స్‌ జారీ చేయవచ్చనిచెప్పలేదు. అందుకని సమన్స్‌ని నోటీసులని వ్యక్తిగతంగానే జారీచేయాల్సి ఉంటుంది. సెక్షన్‌ 530 పై ఈ తీర్పు ప్రభావం --------------------------- భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత సెక్షన్‌ 530 ప్రకారం క్రిమినల్‌విచారణలు, ఎంక్వైరీలు అన్నీ ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌ ద్వారాజరుపవచ్చు. అదేవిధంగా ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్స్‌నిఉపయోగించి సమన్స్‌, వారంట్లు జారీ చేయవచ్చు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఈ నిబంధన 530 గురించి ప్రత్యేకంగాప్రస్తావించలేదు. అందుకని భవిష్యత్తులో ఎలాంటి వ్యాఖ్యానాలనిసుప్రీం కోర్టు చేస్తుందో నన్న విషయం ఆసక్తికరంగా మారింది. జనవరి 21, 2025 రోజున సుప్రీంకోర్టు చట్టంలోని నిబంధనలనుఅమలు చేయాలని చెప్పింది. క్రిమినల్‌ చట్టాలని కఠినంగా అర్థం చేసుకోవాలి.చట్టం ఏదైనా పనిచేసే విధానాన్ని నిర్దేశించినప్పుడు సరిగ్గా అలానేచేయాలి. అందుకని కోర్టులు చట్టాన్ని మరీ ఎక్కువగావ్యాఖ్యానించకూడదు. వ్యక్తిగతంగా నోటీసులని సర్వ్‌ చేయడమేసమంజసం. శాసన కర్తలు సెక్షన్‌ 530 లో నోటీసులని ఎలక్ట్రానిక్ మోడ్ లో సర్వ్ చేయవచ్చని చెప్పారు. కానీ ప్రత్యేకంగా సెక్షన్‌ 35 లో నోటీసు సర్వ్‌ చేసే విధానాన్ని చెప్పలేదు. అందుకని సుప్రీంకోర్టు వాట్సప్‌ ద్వారా, ఎలక్ట్రానిక్‌ మోడ్‌ ద్వారా సర్వ్‌చేయకూడదని చెప్పిందని నా భావన.సమన్స్, నోటీసుల జారీ విధానాన్ని క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ లో చెప్పిన విధం గానే నాగరిక్ సురక్ష లో చెప్పారు. ***

Comments