T News
T News
June 20, 2025 at 03:44 AM
*భర్త ఇంటి ముందు భార్య న్యాయ పోరాటం* వివాహం జరిగి ఐదు సంవత్సరాల తరువాత రెండో పెండ్లికి సిద్దమైన భర్త. తన తల్లితో ప్లే కార్డులు చేత పట్టుకొని బైఠాయింపు. బండ్లగూడ జాగర్ కార్పొరేషన్ పరిధిలోని హైదర్ షాకోట్ సాయి బాలాజీ నగర్ కాలనీ రోడ్ నెంబర్ 4 లో ఉంటున్న భర్త శ్రీధర్ కుమార్ ( సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ) ఇంటి ముందు భార్య స్రవంతి. నీవు అంటే నాకు ఇష్టం, నీవు లేకుండా బ్రతకలేను, నీవే నా సర్వస్వం అంటూ వెంట బడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శ్రీధర్ కుమార్. ప్రేమ పేరుతో స్రవంతిని నమ్మించిన శ్రీధర్. అతని ప్రేమ నిజమని నమ్మి తల్లిదండ్రులను ఎదురించి వివాహం చేసుకున్న స్రవంతి. మోజు తీరిన తరువాత, నీతో అవసరం లేదు, నా ఇంట్లో నుండి వెళ్లిపో.. నేను వేరే అమ్మాయితో వివాహం చేసుకుంటానంటూ బెదిరింపులు. నాకు న్యాయం కావాలని భర్త ఇంటి ముందు మౌన పోరాటానికి సిద్దపడ్డ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ స్రవంతి. *వివాహం జరిగిన నాలుగు నెలల నుండి నరకం చూపించిన శాడిస్ట్. పిల్లలు పుట్టకుండా తరచూ టాబ్లెట్స్.* తనకు న్యాయం జరిగేంత వరకు కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చున్న స్రవంతి.

Comments