
GSWS - Study Purse
May 24, 2025 at 06:05 AM
*//REVISED URGENT MESSAGE//*
*జిల్లాలోని అందరు DYEOs, MEOs, GHMs & TEACHERS నకు*
* గౌరవ డైరెక్టర్ వారి ఆదేశముల ప్రకారం మండలంలో ఉన్న అందరూ ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు సంబంధిత ఎంఈఓ లు మాత్రమే కన్ఫామ్ చేయవలసియున్నది.
* కావున ఇప్పటికే ఆ మండలములో ఉన్న SAs / SGTs / PSHMs యొక్క ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లు అన్నీ కూడా సంబంధిత ఎంఈఓ లాగిన్ నకు వచ్చి ఉన్నవి.
* PSHM/ SGTs ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ను MEOs అత్యవసరంగా తమ వద్ద ఉన్న సర్వీస్ రిజిస్టర్ సహాయంతో వెరిఫికేషన్ పూర్తిచేసి, అన్ని సరిగా ఉన్నవని నిర్ధారించుకున్న తరువాత ఆ అప్లికేషన్లను ఎంఈఓ లాగిన్ నందు రేపు మధ్యాహ్నం లోపుగా కన్ఫర్మేషన్ చేయవలెను.
* ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలో ఉపాధ్యాయుల ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లను తమ వద్ద ఉన్న సర్వీస్ రిజిష్టర్ లతో వెరిఫికేషన్ చేసుకొని, వాటికి అన్ని అటాచ్ మెంట్ లు ఉన్నవో లేదో పరిశీలించుకొని, అన్ని సరిగా ఉన్నవని నిర్ధారించుకున్న తరువాత అన్ని అప్లికేషన్ లు రెండు కాపీలు తీసుకొని, సంబంధిత HEAD MASTER, సంబంధిత MEO కార్యాలయమునకు వెళ్లి అక్కడ MEOతో సంప్రదించి, అన్ని సరిగా ఉన్నవని నిర్ధారించుకున్న తరువాత MEO లాగిన్ నందు సదరు ఉపాధ్యాయుల అప్లికేషన్ లను అప్రూవ్ చేయించవలెను.
* ఒక వేళ అప్లికేషన్ లలో ఏమైనా మార్పులు / చేర్పులు ఉన్న ఉపాధ్యాయులు కావాలంటే సంబంధిత HM వారితో MEO వారి కార్యాలయమునకు వెళ్లి వారికి సహకరించవచ్చును.
* ట్రాన్షఫర్లపై మంచి నైపుణ్యం ఉన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే టీమ్ లను ఏర్పాటు చేసుకొని ఈ పనిని పూర్తి చేసుకొనవలెను. ఆ మండలములో ఉన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ MEOs నకు తప్పక సహకరించవలెను.
ముఖ్యమైన సూచనలు:
* స్పౌస్ క్యాటగిరి పాయింట్స్ క్లెయిమ్ చేసుకున్న టీచర్స్ కు స్పౌస్ సర్టిఫికెట్ తో పాటు డీఈఓ ఆఫీస్ వాటర్ మార్కుతో ఉన్న స్పౌస్ పాయింట్స్ డిక్లరేషన్ సర్టిఫికెట్స్ రెండు మొత్తంగా మూడు సర్టిఫికెట్లను జతచేయవలెను.
* ఉపాధ్యాయులు పెట్టిన అప్లికేషన్ లో ఏమైనా Corrections ఉంటే వాటిని RED PEN తో కరెక్ట్ చేసి Correction ఉన్న ప్రతీ చోట కూడా MEO/HM sign చేయవలెను. ఈ అప్లికేషన్ మొదటి పేజీ పైన RIGHT HAND SIDE న TO BE CORRECTED అని RED PEN తో తప్పక వ్రాయవలెను.
* ఒక వేళ ఉపాధ్యాయుని అప్లికేషన్ లో ఏ విధమైన Correction లేకపోతే అప్లికేషన్ మొదటి పేజీ పైన RIGHT HAND SIDE న NO CORRECTIONS అని RED PEN తో తప్పక వ్రాయవలెను.
* MEO LOGIN లో అప్రూవ్ చేసిన అన్ని అప్లికేషన్ ల హార్డ్ కాపీలను DEO OFFICE, MUMMIDIVARAM నందు సాయంత్రం తప్పనిసరిగా అందచేయవలసియుండును.
* ఈ పాయింట్ల విషయములోగాని, ఉపాధ్యాయుని అప్లికేషన్ లో గాని ఏ విధమైన సమస్యలు / తప్పులు లేకుండా సదరు MEOs / HMs చాలా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈ విషయములో ఏ విధమైన అలసత్వము వహించినచో సదరు MEOs / HMs బాధ్యులు అవుతారని తెలియచేయడమైనది.
* తమ పరిధిలో పనిచేయుచున్న 8 సంవత్సరములు నిండిన / SURPLUS అయిన ప్రతీ ఉపాధ్యాయునిచే అప్లికేషన్ పెట్టించే బాధ్యత కూడా MEOs / HMs విధిగా తీసుకొనవలెను.
* ఉప విద్యాశాఖాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాాయులతో మానిటరింగ్ చేయుచూ, అందరు HMs MEOs నకు సహకరించి పని త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకొనవలెను.