GSWS - Study Purse WhatsApp Channel

GSWS - Study Purse

138 subscribers

About GSWS - Study Purse

You can find here GSWS Schemes, Govt jobs and PDFs and all Govt schemes and Competitive Exams preparation guidance Many more

Similar Channels

Swipe to see more

Posts

GSWS - Study Purse
GSWS - Study Purse
6/8/2025, 1:53:39 AM

*ప్రస్తుతం AP సేవ పోర్టల్ క్లోజ్ చేయడం వల్ల రైస్ కార్డ్ ekyc అవ్వడం లేదు. మరలా జూన్ 12 నుండి వర్క్ అవుతుంది.*

GSWS - Study Purse
GSWS - Study Purse
6/13/2025, 2:13:48 AM
Post image
Image
GSWS - Study Purse
GSWS - Study Purse
6/2/2025, 4:53:57 PM

*RRB NTPC City Intimation (12 June)✅* *https://rrb.digialm.com/EForms/configuredHtml/33015/94346/login.html*

GSWS - Study Purse
GSWS - Study Purse
6/3/2025, 9:50:08 AM

*జూన్ నెలలో 8 రోజుల పాటు బ్యాంకులకు సెలవు* తెలుగు రాష్ట్రాల్లో జూన్ 2025లో బ్యాంకులకు 8 రోజులు సెలవులు ఉన్నాయి. వీటిలో వారపు సెలవులు, పండుగలు ఉన్నాయి. అవేంటంటే.. జూన్ 1, 8, 15, 22, 29 (ఆదివారాలు), జూన్ 14 (రెండవ శనివారం), జూన్ 28 (నాల్గవ శనివారం), బక్రీద్ (జూన్ 7). కానీ ఇతర ప్రాంతీయ సెలవులు లేవు. కస్టమర్లు ఈ సెలవులను గమనించి తమ బ్యాంకు పనులను ముందుగా ప్లాన్ చేసుకోవాలి.

GSWS - Study Purse
GSWS - Study Purse
6/3/2025, 2:35:24 AM

*📌Dear All,* *🟡 MAY 2025 month- "Unpaid Pensions Remarks" & "Pension Transfer" options enabled in NTR Bharosa Pension Scheme App.*_ *✅PLEASE CHECK NOW.*

GSWS - Study Purse
GSWS - Study Purse
6/2/2025, 4:57:58 AM

*తల్లికి వందనం రూ.15,000.. వీరికి మాత్రమే* AP: 'తల్లికి వందనం' పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలి.

Post image
Image
GSWS - Study Purse
GSWS - Study Purse
6/16/2025, 1:08:32 AM

మీరు "తల్లికి వందనం" పథకం 2025 లబ్ధిదారుల జాబితాలో లేరని చూపిస్తే, మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవచ్చు: * అనర్హతకు కారణం తెలుసుకోండి: * మీరు ఎందుకు చేర్చబడలేదో తెలుసుకోవడానికి మీ గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదించండి. వారు మీకు కారణాన్ని తెలియజేయాలి. * "తల్లికి వందనం" పథకానికి సంబంధించిన అర్హత ప్రమాణాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. వాటిని ఒకసారి సరిచూసుకోండి. సాధారణంగా అర్హత లేకపోవడానికి కొన్ని కారణాలు: * కుటుంబ వార్షిక ఆదాయం నిర్దేశిత పరిమితిని మించడం. * విద్యార్థికి 75% హాజరు లేకపోవడం. * తల్లి పేరుపై బ్యాంకు ఖాతా లేకపోవడం లేదా NPCI లింక్ కాకపోవడం. * హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో తల్లి లేదా పిల్లల వివరాలు నమోదు కాకపోవడం. * కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి, ప్రజా ప్రతినిధి, ఆదాయపు పన్ను చెల్లించేవారు ఉండటం. * మూడు ఎకరాలకు మించి మాగాణి భూమి లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండటం. * కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం (ట్రాక్టర్లు, ఆటోలు మినహా) ఉండటం. * నెలవారీ కరెంట్ వినియోగం 300 యూనిట్లు దాటడం. * 1000 చదరపు అడుగులకు మించి ప్రాపర్టీ ఉండటం. * ఫిర్యాదు / గ్రీవెన్స్ పెట్టుకోండి: * అర్హత ఉండి కూడా జాబితాలో మీ పేరు లేకపోతే, మీరు అభ్యంతరం లేదా ఫిర్యాదు పెట్టుకోవచ్చు (గ్రీవెన్స్). * గ్రామ/వార్డు సచివాలయాల్లో ఫిర్యాదులు స్వీకరించడానికి అవకాశం కల్పిస్తారు. * ప్రభుత్వం జూన్ 20, 2025 వరకు ఫిర్యాదులను స్వీకరించి, జూన్ 30, 2025 న తుది జాబితాను విడుదల చేస్తుందని ప్రకటించింది. కాబట్టి, మీకు అవకాశం ఉంది. * మీరు మీ దరఖాస్తును మళ్లీ సమర్పించవలసి రావచ్చు, లేదా మీ అర్హతను రుజువు చేసే అదనపు పత్రాలను సమర్పించవలసి రావచ్చు. * అవసరమైన పత్రాలు సరిచూసుకోండి: * మీరు దరఖాస్తు చేసినప్పుడు సమర్పించిన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తనిఖీ చేసుకోండి. * తల్లి మరియు పిల్లల ఆధార్ కార్డులు. * తల్లి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతా, అది ఆధార్ మరియు NPCI తో లింక్ అయి ఉండాలి (ఇది చాలా ముఖ్యం). * కుటుంబ ఆదాయ ధృవపత్రం. * విద్యార్థి యొక్క హాజరు శాతం వివరాలు. * రేషన్ కార్డు. * బర్త్ సర్టిఫికెట్ (పిల్లలది). * హౌస్‌హోల్డ్ డేటాబేస్ & eKYC: * తల్లులు మరియు వారి పిల్లల వివరాలు హౌస్‌హోల్డ్ డేటాబేస్‌లో నమోదు అయి ఉండాలి. * తల్లి యొక్క eKYC తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి. ఇది పూర్తి చేయకపోతే పథకం లబ్ధి చేకూరదు. ఇది మీ దగ్గరలోని గ్రామ/వార్డు సచివాలయంలో లేదా మీసేవ కేంద్రంలో చేసుకోవచ్చు. ముఖ్య గమనిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత ఉండి అనర్హత జాబితాలో పేర్లు ఉన్న వారికి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. కాబట్టి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అవసరమైతే, పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని కూడా సంప్రదించవచ్చు.

GSWS - Study Purse
GSWS - Study Purse
6/13/2025, 12:00:28 PM
Post image
Image
GSWS - Study Purse
GSWS - Study Purse
5/24/2025, 6:05:21 AM

*//REVISED URGENT MESSAGE//* *జిల్లాలోని అందరు DYEOs, MEOs, GHMs & TEACHERS నకు* * గౌరవ డైరెక్టర్ వారి ఆదేశముల ప్రకారం మండలంలో ఉన్న అందరూ ఉపాధ్యాయుల యొక్క ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు సంబంధిత ఎంఈఓ లు మాత్రమే కన్ఫామ్ చేయవలసియున్నది. * కావున ఇప్పటికే ఆ మండలములో ఉన్న SAs / SGTs / PSHMs యొక్క ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లు అన్నీ కూడా సంబంధిత ఎంఈఓ లాగిన్ నకు వచ్చి ఉన్నవి. * PSHM/ SGTs ట్రాన్స్ఫర్ అప్లికేషన్లు ను MEOs అత్యవసరంగా తమ వద్ద ఉన్న సర్వీస్ రిజిస్టర్ సహాయంతో వెరిఫికేషన్ పూర్తిచేసి, అన్ని సరిగా ఉన్నవని నిర్ధారించుకున్న తరువాత ఆ అప్లికేషన్లను ఎంఈఓ లాగిన్ నందు రేపు మధ్యాహ్నం లోపుగా కన్ఫర్మేషన్ చేయవలెను. * ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వారి పాఠశాలలో ఉపాధ్యాయుల ట్రాన్స్ ఫర్ అప్లికేషన్ లను తమ వద్ద ఉన్న సర్వీస్ రిజిష్టర్ లతో వెరిఫికేషన్ చేసుకొని, వాటికి అన్ని అటాచ్ మెంట్ లు ఉన్నవో లేదో పరిశీలించుకొని, అన్ని సరిగా ఉన్నవని నిర్ధారించుకున్న తరువాత అన్ని అప్లికేషన్ లు రెండు కాపీలు తీసుకొని, సంబంధిత HEAD MASTER, సంబంధిత MEO కార్యాలయమునకు వెళ్లి అక్కడ MEOతో సంప్రదించి, అన్ని సరిగా ఉన్నవని నిర్ధారించుకున్న తరువాత MEO లాగిన్ నందు సదరు ఉపాధ్యాయుల అప్లికేషన్ లను అప్రూవ్ చేయించవలెను. * ఒక వేళ అప్లికేషన్ లలో ఏమైనా మార్పులు / చేర్పులు ఉన్న ఉపాధ్యాయులు కావాలంటే సంబంధిత HM వారితో MEO వారి కార్యాలయమునకు వెళ్లి వారికి సహకరించవచ్చును. * ట్రాన్షఫర్లపై మంచి నైపుణ్యం ఉన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులచే టీమ్ లను ఏర్పాటు చేసుకొని ఈ పనిని పూర్తి చేసుకొనవలెను. ఆ మండలములో ఉన్న ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తమ MEOs నకు తప్పక సహకరించవలెను. ముఖ్యమైన సూచనలు: * స్పౌస్ క్యాటగిరి పాయింట్స్ క్లెయిమ్ చేసుకున్న టీచర్స్ కు స్పౌస్ సర్టిఫికెట్ తో పాటు డీఈఓ ఆఫీస్ వాటర్ మార్కుతో ఉన్న స్పౌస్ పాయింట్స్ డిక్లరేషన్ సర్టిఫికెట్స్ రెండు మొత్తంగా మూడు సర్టిఫికెట్లను జతచేయవలెను. * ఉపాధ్యాయులు పెట్టిన అప్లికేషన్ లో ఏమైనా Corrections ఉంటే వాటిని RED PEN తో కరెక్ట్ చేసి Correction ఉన్న ప్రతీ చోట కూడా MEO/HM sign చేయవలెను. ఈ అప్లికేషన్ మొదటి పేజీ పైన RIGHT HAND SIDE న TO BE CORRECTED అని RED PEN తో తప్పక వ్రాయవలెను. * ఒక వేళ ఉపాధ్యాయుని అప్లికేషన్ లో ఏ విధమైన Correction లేకపోతే అప్లికేషన్ మొదటి పేజీ పైన RIGHT HAND SIDE న NO CORRECTIONS అని RED PEN తో తప్పక వ్రాయవలెను. * MEO LOGIN లో అప్రూవ్ చేసిన అన్ని అప్లికేషన్ ల హార్డ్ కాపీలను DEO OFFICE, MUMMIDIVARAM నందు సాయంత్రం తప్పనిసరిగా అందచేయవలసియుండును. * ఈ పాయింట్ల విషయములోగాని, ఉపాధ్యాయుని అప్లికేషన్ లో గాని ఏ విధమైన సమస్యలు / తప్పులు లేకుండా సదరు MEOs / HMs చాలా జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈ విషయములో ఏ విధమైన అలసత్వము వహించినచో సదరు MEOs / HMs బాధ్యులు అవుతారని తెలియచేయడమైనది. * తమ పరిధిలో పనిచేయుచున్న 8 సంవత్సరములు నిండిన / SURPLUS అయిన ప్రతీ ఉపాధ్యాయునిచే అప్లికేషన్ పెట్టించే బాధ్యత కూడా MEOs / HMs విధిగా తీసుకొనవలెను. * ఉప విద్యాశాఖాధికారులు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాాయులతో మానిటరింగ్ చేయుచూ, అందరు HMs MEOs నకు సహకరించి పని త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకొనవలెను.

GSWS - Study Purse
GSWS - Study Purse
6/3/2025, 3:11:03 AM
Post image
Image
Link copied to clipboard!