
GSWS - Study Purse
June 2, 2025 at 04:57 AM
*తల్లికి వందనం రూ.15,000.. వీరికి మాత్రమే*
AP: 'తల్లికి వందనం' పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది. అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ఇందు కోసం పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలి.
