
Palla Srinivasa Rao | TDP
June 15, 2025 at 06:31 PM
తల్లికి వందనం పథకంపై ఉండవల్లి నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించిన లోకేష్ బాబు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తొలి ఏడాదిలోనే తల్లికి వందనం పథకానికి శ్రీకారం చుట్టాం. బాబు సూపర్ సిక్స్ లో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా 8,745 కోట్ల రూపాయలను 67,27,000 విద్యార్థుల తల్లుల అకౌంట్లలో జమచేయడం జరిగింది. అర్హులు ఎంతమంది ఉన్నా సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సోమవారం నుంచి అకౌంట్లలో నిధులు జమకానిపక్షంలో జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. మనమిత్ర వాట్సాప్ ద్వారా లేక గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చని వివరించాను.
#happymothersinap
#tallikivandanam

❤️
👍
3