TTD NEWS UPDATES FROM NARADA PEETAM, Tirupati
                                
                            
                            
                    
                                
                                
                                June 18, 2025 at 04:32 PM
                               
                            
                        
                            భక్తుల సౌకర్యార్థం అలిపిరి టోల్ ప్లాజా పునరుద్ధరణ : టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు 
తిరుమల శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆధునిక సౌకర్యాలతో అలిపిరి టోల్ ప్లాజా ను పునరుద్ధరణకు చర్యలు చేపట్టినట్లు టిటిడి ఈవో శ్రీ జె శ్యామల రావు తెలిపారు. తిరుపతి టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో  అలిపిరి చెక్ పాయింట్ పునరుద్ధరణ,  భద్రత పెంపుపై టిటిడి  అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈవో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ముందుగా అలిపిరి టోల్ ప్లాజా వద్ద ఆధునిక సౌకర్యాలు, పటిష్ట భద్రత తదితర అంశాలపై జిఎంఆర్ గ్రూప్‌కు చెందిన  రాక్సా సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 
భక్తుల చెకింగ్, లగేజీ స్కానింగ్ కి ప్రస్తుతం తీసుకుంటున్న సమయం, దాని వల్ల వస్తున్న సమస్యలపై అధికారులతో చర్చించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా వేగంగా వాహనాలు, లగేజీ స్కానింగ్ చేసేందుకు చర్యలు చేపట్టాలని జీఎంఆర్ అనుబంధ సంస్థ అయిన రాక్సా సంస్థ ప్రతినిధులకు ఈవో సూచించారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద చెకింగ్ సమయాన్ని తగ్గించేందుకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక పరిష్కార మార్గాలను సూచించాలని కోరారు. టిటిడి విజిలెన్స్ విభాగం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని భక్తుల లగేజీ, వాహనాల స్కానింగ్ లో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఈవో ఆదేశించారు. 
కొన్ని ముఖ్యాంశాలు:
* తనిఖీ సమయంలో క్రాస్ ఓవర్‌లను నివారించేందుకు చర్యలు 
* ఉన్న లగేజ్ స్కానర్‌ల స్థానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్కానర్లు ఏర్పాటు 
* లగేజ్ స్కానింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు లగేజ్ స్కానర్‌లను పెంచాలి...
* లగేజ్ కన్వేయర్ బెల్ట్‌ల ను పెంచి భద్రతా తనిఖీలో ఎక్కువ సమయాన్ని  నివారించే అంశం పరిశీలన
* అలిపిరి టోల్ ప్లాజాలోని చివరి రెండు భద్రతా లేన్‌లలో మరింత మంది భద్రతా సిబ్బంది నియామకం 
రాబోయే రెండు దశాబ్దాల పాటు భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక భద్రతా అంశాల ప్రతిపాదనలు సూచించాలని రాక్సా ప్రతినిధులను ఈవో కోరారు. 
ఈ కార్యక్రమంలో రాక్సా సీఈవో శ్రీ అమిత్ దార్, టిటిడి జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మం, సీవిఎస్వో శ్రీ మురళీ కృష్ణ, సీఈ శ్రీ సత్యనారాయణ, ఈఈ శ్రీ వేణు గోపాల్, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, వీజీవోలు శ్రీమతి సదా లక్ష్మి, శ్రీ రామ్ కుమార్, శ్రీ సురేంద్ర మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
                        
                    
                    
                    
                        
                        
                                    
                                        
                                            🙏
                                        
                                    
                                        
                                            👍
                                        
                                    
                                        
                                            ❤️
                                        
                                    
                                    
                                        21