All India Ghattamaneni Charitable Trust
All India Ghattamaneni Charitable Trust
May 30, 2025 at 11:51 AM
విజయానికి చిరునామా కృష్ణ సినీ వినీలాకాశంలో ధ్రువతార . ప్రతి అడుగు ఓ సంచలనం .ఆయన ప్రస్థానం అనితర సాధ్యం. పేదల అభ్యున్నతి,సంక్షేమమే పరమావదిగా చిత్రాలు. అభ్యుదయ సినిమాలతో ప్రజల పక్షం. తరతరాలకు తరగని తెలుగు వెలుగు. నటనలో అత్యున్నత శిఖరం. ఒకవైపు యాక్షన్ హీరోగా ఒదిగిపోతూ ,అన్ని రకాల పాత్రల్లో వైవిధ్యం చూపించారు. ఆయన చేయని, మెప్పించి,ఒప్పించని పాత్ర లేదు. ఆయన ఎప్పుడూ ముసదొరణిలో పోలేదు. బహుముఖ ప్రజ్ఞాశాలి. సూపర్ స్టార్ కృష్ణ భారతీయ సినిమాకు సాహసాన్ని తెగువను పరిచయం చేసినవాడు. వెండి తెరకు వెలుగు తెచ్చినవాడు.ఎన్నెన్నో ప్రయోగాలకు వాహిక అయినవాడు.తాను ఎంచుకున్న కథల చేత సినిమాల వేలువరించిన వేగం చేత, ఎందరినో ఆదుకున్న మంచి మనసు చేత ఆయనొక సూపర్ స్టార్.హీరో కృష్ణగా దాదాపు నాలుగు దశాబ్దాలు వెండితెరను ఏలిన నటటచక్రవర్తి.తొలి 70ఎం ఎం చిత్రం సింహాసనం, తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూఢచారి 116 , తొలి కౌబాయ్ మోసగాళ్ళకు మోసగాడు తొలి ఫుల్ స్కోప్ చిత్రం, అల్లూరి సీతారామరాజు, తొలి ఇష్టమాన్ కలర్ చిత్రం, తొలి డిటిస్ సినిమా, ర్ ఓ సాంకేతికత కొల్లేటి కాపురం ఫుజి కలర్ బలే దొంగలు చెప్పుకుంటూపోతే కృష్ణ సినీ ప్రస్థానంలో ఎన్నో ప్రయోగాలు.సాంకేతికతను అంది పుచ్చుకొని నూతన ఒరవడికి బీజం వేయడంలో ఆద్యునిగ ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.ప్రపంచ చలన చిత్ర రంగంలోనే భారతీయ పరిశ్రమకు ఖ్యాతి తెచ్చిన వాడిగా కృష్ణ ఉంటారు.సూపర్ స్టార్ గా అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన ఆయన సినీ ప్రస్థానం సాహసమే ఊపిరిగా ధైర్యమే ఆయుధంగా సాగింది.వెండి తెరపై కృష్ణ సృష్టించిన సంచలనలకు కోదవేలేదు.భారతీయ సినిమాలో మొట్టమొదట కౌబాయగా అలరించిన నటశేఖర కృష్ణ. డేరింగ్, డాషింగ్ డైనమిక్ పదాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన అల్లూరి సీతారామరాజు. పరిశ్రమకు ఎందరో కొత్తవారిని పరిచయం చేసి కష్టనష్టాల్లో తోడుగా, అండగా ఉన్న మంచివాడు కృష్ణ.350 పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ కుటుంబ సభ్యునిగా, రైతుగా,విప్లవకారునిగా కార్మికునిగా ఇంకా అనేక పాత్రల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు.మీనా ,పడిపంటలు, ఇల్లు ఇల్లాలు, పాడి పంటలు బంగారు బావ,శక్తి చిత్రాల్లో రైతుగా నటించి రైతుల సమస్యలను ఆ రోజుల్లోనే ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కారo అయ్యేలా సహాయ పడ్డారు.అల్లూరి సీతారామరాజు, ఈనాడు,కంచు కాగడ,మ మహాసంగ్రామం,ఎన్ కౌంటర్ చిత్రాల్లో ప్రజా సమస్యలపై ఉద్యమించే విప్లవ కారుడుగా అలరించారు.మరెన్నో సినిమాల్లో తనదైన శైలిలో నటించి జాతీయంగా,అంతర్జాతీయంగా ప్రపంచ ప్రఖ్యాత నటుడుగా పేరుపొందారు.అన్ని కోణాలు ప్రదర్శించే సామర్థ్యం ఉన్న నటుడుగా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. 1943మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండల బుర్రిపాలెంలో ఘట్టమనేని వీర రాఘవయ్య,నాగరత్నమ్మ దంపతులకు కృష్ణ జన్మించారు. ఆయన పూర్తిపేరు శివరామకృష్ణ మూర్తి.చిన్నప్పటి నుండి ఆయనకు సినిమాలపై ఆసక్తి ఉండేది. తొలి నాళ్లలో ప్రజా నాట్యమండలి తరపున గరికిపాటి రాజారావు ఆధ్వర్యంలో నాటకాలు వేశారు. అడపదడప నాటకాలు వేస్తూ నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన మద్రాసుకు మకాం మార్చారు.1965లో విడుదలైన తేనెమనసులు చిత్రంతో సినీ పరిశ్రమలో తొలి చిత్రం తోనే మంచి పేరు తెచ్చుకున్నారు. మూడవ సినిమా గూఢచారి 116 తో టాప్ హీరోగా స్థిరపడ్డాడు.100 సినిమాగా వచ్చిన అల్లూరి సీతారామరాజు ఓ ప్రభంజనం.సంభాషణలు పలికే తీరు, హావభావాలు ప్రదర్శించే విధానం, ఆహార్యం వంటి విషయాల్లో ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ అశేష అభిమానులకు దగ్గర చేసింది. దేశ చలన చిత్ర రంగంలో అప్పటివరకు కౌబాయ్ చిత్రాలు రానేలేదు.మోసగాళ్ళకు మోసగాడుతో ఆ లోటును తీర్చేశారుకృష్ణ.అప్పట్లోనే పాన్ ఇండియా చిత్రంగా పలుబాషల్లో విడుదలై గణవిజయం సాధించింది . మోసగాళ్ళకు మోసగాడు ద ట్రేజరర్ హంట్ పేరుతో దాదాపుగా 156 దేశాల్లో ప్రదర్శించబడిన మొట్టమొదటి పాన్ వరల్డ్ చిత్రం.ఆ విధంగా మోసగాళ్ళకు మోసగాడు చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా గొప్పదనాన్ని నిరూపించారు. క్రైమ్ ఆండ్ ధ్రిల్లర్ సినిమాలకు అడ్రస్ గా కృష్ణ సినిమాలు ఉండేవి. ఒరవడిని అధిగమించి వైవిధ్యం చూపించేందుకు ఎంతటి సాహసమైన కృష్ణ చేసేవారు .మల్టీస్టారర్ సినిమా అంటే ఇలా ఉండాలి అన్న మార్కును ఆయన సృష్టించారు. ఒప్పుకున్న పాత్ర కోసం ఎంత రిస్క్ ఐన తీసుకునేవారు. వరదలు,తుఫానులు వచ్చి నపుడు బారి ఎత్తున ప్రజలకు సాయం చేసేవారు. ఆర్ధికంగా చితికిపోయిన తన తోటి నటి నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులకు, సినిమా విలేకరులకు సహాయం చేసేవారు. కృష్ణ భారతీయ సినీ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నారు. ఆయన స్ధానం ఎప్పటికి చెరిగి పోనిది . ఎన్నటికీ మాసి పొనిది . సాధారణ పేద రైతు కుటుంబంలో జన్మించి స్వయంకృషితో తన కంటూ చరిత్రలో ఒక ఒక చరిత్రను సృష్టించుకున్న ఆయన అమరజీవి . ఆయన చరిత్ర అందరికి స్పూర్తి దాయకం. చాలా తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ సినిమాల్లో చేయడం కృష్ణ ప్రత్యేకత.

Comments