Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 15, 2025 at 05:21 PM
నేనెవరో నాకు తెలుసు… నా మాట, మాట తీరు నాకు తెలుసు… నా గమ్యం ఏమిటో నాకు తెలుసు… నాతో కలిసి నడుస్తున్న వాళ్లకు కూడా తెలుసు.!! నేను ఎప్పుడూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించను, ఎవరిపైనా విమర్శ చేయను. నిజాయితీగా నమ్మిన సిద్ధాంతాల కోసం, నమ్మిన నాయకుడి కోసం మాట్లాడతాను — ఆ మాటలు ఎప్పుడూ వ్యక్తిగత దాడి కోసం ఉండవు. ఏదైనా తీవ్రంగా మాట్లాడినా, ప్రశించిన, అది అప్పటి పరిస్థితిని బట్టి, సంఘటనని బట్టి ఉంటుంది. భూతు మాటలు ఉండవు, తిట్లు ఉండవు, మహిళలపై లేదా కుటుంబాలపై అసభ్య వ్యాఖ్యలు అస్సలు ఉండవు. నేను వ్యూస్ కోసం, దృష్టిని పబ్లిసిటీ కోసం, నా ‘రిచ్’ పెంచుకోవడం కోసం, నేను ఎప్పుడూ పక్కవాళ్ళను తిట్టను. మీరు ఎంత రెచ్చగొట్టినా నా మాట మారదు… మీరు ఎంత దాడి చేసినా, మీ స్థాయికి దిగజారి మాటలు నేను మాట్లాడను. సిగ్గు లేకుండా, కనీసం బుద్ధి, జ్ఞానం లేకుండా బూతులు మాట్లాడటమే మాకు వస్తుంది అంటే ఇంకా మీ కర్మ.. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నా విన్నపం — మనం YCP స్థాయికి దిగిరావాల్సిన అవసరం లేదు. మన నాయకులు చేసే మంచి పనులను ప్రజలకు తెలియజేద్దాం, YCP అసత్యాలను ప్రజలకు వివరిద్దాం, బహిర్గతం చేద్దాం. మన సిద్ధాంతం వేరు… మన పార్టీ విధానాలు వేరు… అది మనం గుర్తించాలి. ప్రజల కోసం మనం… స్వార్థం కోసం వాళ్లు. చివరికి ప్రజలే నిజమైన తీర్పు చెప్పేవారు - అధికారంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. జై తెలుగుదేశం… జై చంద్రబాబు… జై లోకేశ్! #andhrapradesh #naralokeshforap #visionforvictory
❤️ 1

Comments