
Venugopal Reddy Chenchu (NRITDP)
June 16, 2025 at 05:25 AM
కూటమి ప్రభుత్వం లో మరచిపోలేని వారాల్లో ఇది ఒకటి…ఈ వారం (June 8 - June 15) రిక్యాప్ – కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు 🔥🔥
సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో కూడిన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ప్రజల ఆశీర్వాదంతో ఏర్పాటైన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ వారంతో ఒక ఏడాది పూర్తి చేసుకుంది.✌️✌️
ఈ వారం ప్రధాన విజయాలు ఇవే:
1.సూపర్ సిక్స్ లో కీలక హామీ అమలు – తల్లికి వందనం ద్వారా లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపిన ప్రభుత్వం.
2.రాష్ట్రంలో YCP నాయకులు మహిళలపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలపై సీరియస్ యాక్షన్ తీసుకున్న ప్రభుత్వం.
3.సూపర్ 6 లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే ప్రణాళికను వివరించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు.
4.తల్లికి వందనం పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులకు తల్లుల ఖాతాల్లో రూ. 8745 కోట్లు జమ చేసిన కూటమి ప్రభుత్వం.
5.విద్యా సంవత్సరం ఆరంభంతో విద్యార్థి మిత్ర పథకం ద్వారా విద్యార్థులందరికీ కొత్త యూనిఫాం, పుస్తకాలు, షూ, బెల్ట్, బ్యాగ్ అందించిన కూటమి ప్రభుత్వం.
6.రాష్ట్రంలోని 26 జిల్లాలు, 175 నియోజకవర్గాల్లో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలు ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు (వర్చువల్‌గా).
7.ఉత్తరాంధ్రలో రెండు రోజుల పర్యటన చేసిన నారా లోకేష్ గారు.
8.పదోతరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ – 2025 కార్యక్రమంలో పాల్గొన్న విద్యాశాఖ మంత్రివర్యులు.
9.ఉత్తరాంధ్ర పర్యటనలో విశాఖ పార్టీ కార్యాలయంలో 65వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించిన నారా లోకేష్ గారు.
10.తల్లికి వందనం అమలు తీరుపై ఆర్థికశాఖ మంత్రి మరియు పార్టీ కార్యకర్తలతో ఉండవల్లి నివాసంలో సమీక్ష జరిపిన చంద్రబాబు గారు.
11.ట్విట్టర్ ద్వారా వచ్చిన ప్రజల వినతులపై వెంటనే స్పందించిన లోకేష్ గారు – తక్షణ సహాయం అందించారు.
12.రాష్ట్ర క్రీడాకారులకు ఇచ్చిన మాట ప్రకారం రాజమహేంద్రవరం లో మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన కూటమి ప్రభుత్వం. రూ. 3.60 కోట్లతో ఈ స్టేడియాన్ని సకాలంలో నిర్మించారు.
ఏదేమైనా,
ఈ వారం కూటమి కార్యకర్తలు కాలర్ ఎగరేసుకుని సంబరాలు చేసుకున్నారు…
ఆ ఘనత పూర్తిగా మా పెద్దాయనకి —
లోకేష్ @naralokesh అన్నకి దక్కుతుంది… నిజంగా మీ కమిట్మెంట్ సూపర్ @ncbn సార్!
మీ
వేణుగోపాల్ రెడ్డి చెంచు
#telugudesamparty #chandrababunaidu #idhimanchiprabhutvam #thallikivandanam #happymothersinap #firststeprebuildingap