Venugopal Reddy Chenchu (NRITDP)
Venugopal Reddy Chenchu (NRITDP)
June 17, 2025 at 02:48 PM
అరే బాబు… జీవితకాల మెంబర్షిప్ తీసుకున్నప్పుడే నిర్ణయం తీసుకున్నా – రాజకీయాల్లో ఉంటే టీడీపీ, లేకపోతే రిటైర్మెంట్ అనీ! రాజకీయం నా వృత్తి కాదు… ఇది నా ప్యాషన్! నా స్వలాభం కోసం కాదు, డబ్బు కోసమైతే అసలే కాదు. రాజకీయన్నే జీవితం అనుకోని జీవితాలని పణంగా పెట్టి మండల, గ్రామా స్థాయిలో పనిచేస్తున్న సామాన్య కార్యకర్తకోసమే మా నాయకుల్ని ప్రశ్నించా.. నమ్మిన సిద్ధాంతం కోసం పని చేస్తున్నా, ప్రజలకు ఏదైనా మేలు చేయాలి అన్న తపనతో రాజకీయం లోకి వచ్చా. అరే బాబు… ఊర్లో పొలం పని చేసుకుంటూ, ట్రాక్టర్ డ్రైవర్ స్థాయినుండి ఈ స్థాయికి వచ్చా. ప్రతి అడుగులో ఎన్నో ఆటుపోట్లు చూసిన వాడిని, మీరు ఏంది నా గురించి మాట్లాడేదీ? 10 వేల రూపాయలు సంపాదించడం కష్టం అనుకునే స్థాయి నుంచి 10 మందికి సాయం చేసే స్థాయికి వచ్చా.. పదవితో వచ్చే రెండు లక్షలు, మూడు లక్షల కోసమైతే పని చేయను. నా ఉద్యోగం, నా వ్యాపారం నేను చేసుకున్న, నెలకు వాటి కంటే పదింతలు సంపాదించే మార్గం ఆ దేవుడు చూపించాడు. 🙏 ఐనా… మా పార్టీలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది. మా నాయకులు ఏ చిన్న పొరపాటు చేసినా అడిగే హక్కు ఉంది. అడుగుతాం, కొట్లాడతాం, సాధించుకుంటాం. నిజాయితీగా పని చేసే కార్యకర్తలం.. పదవి ఉన్నా లేకున్నా… పార్టీ కోసం పని చేస్తాం. మా DNA – టీడీపీ! ప్రజలకు మంచి జరిగితే చాలు అనేది మా సిద్ధాంతం. నేను బాగుండాలి అనుకునే వాడు స్వార్థపరుడు. మనతో పాటు, మన చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బాగుండాలి అనుకునే వాడు నాయకుడు! ఈ రోజు మా పార్టీనడిపే నాయకుల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు చూపే శునకానందం మాటలు కొంచెం ఆపండి బాబూ… మా పార్టీ విషయాల్లో మీకెందుకు? @naralokesh అన్నా, @ncbn సార్, దయచేసి ఇలాంటిపొరపాట్లు జరగకుండా చూడండి, కార్యకర్తలకు న్యాయం చేయండి. జై టీడీపీ.. జై చంద్రబాబు.. జై లోకేశ్.. ✌️✌️ #westandwithtdpkarayakarta #telugudesamparty #andhrapradesh #naralokesh
Image from Venugopal Reddy Chenchu (NRITDP): అరే బాబు… జీవితకాల మెంబర్షిప్ తీసుకున్నప్పుడే నిర్ణయం తీసుకున్నా – రాజ...
❤️ 👍 3

Comments