Minister For PRRD TELANGANA
Minister For PRRD TELANGANA
June 4, 2025 at 10:48 AM
రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేదో మదన సదస్సు 2025 కు చేరుకున్న *మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క* అంగన్వాడి కేంద్రాల్లో ఏడాది 25% అడ్మిషన్లు పెరిగేలా సిబ్బంది మొత్తం చిత్తశుద్ధితో పని చేయాలి బడి గంట తరహాలో అంగన్వాడి కేంద్రాల్లోనూ బెల్సును తీసుకురావాలి అంగన్వాడి కేంద్రాల్లో ఉదయం గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం క్రమశిక్షణ పెరుగుతాయి, అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు సకాలంలో వచ్చేందుకు ఉపయోగపడుతోంది మన పని తీరును మెరుగుపరిచేందుకు, మన బెస్ట్ ప్రాక్టీస్ ను విస్తరింప చేసేందుకు ఈ మేదో మదన సదస్సు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ అనుభవాలు, ఆలోచనలు, ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను తెలుసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నాము అంగన్వాడి కేంద్రాల్లో అందిస్తున్న విద్యను, ఆరోగ్య భద్రతను మెరుగుపరుచుకునే లక్ష్యంతో మనమంతా పనిచేయాలి ఏదో మదన సదస్సులో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలను క్రోడీకరించి, నిపుణులు మేధావులతో చర్చించి అంగన్వాడీ ల సేవలను మరింత మెరుగుపరుస్తాం అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు దశాబ్ద కాలంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు మేము అధికారంలోకి వచ్చాక ఆ సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తున్నాము మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చాము రిటైర్మెంట్ బెనిఫిట్స్ ను రెట్టింపు చేశాము పంచాయతీరాజ్ శాఖలో 93 వేల మంది చిరు గ్రామీణ ఉద్యోగులకు గ్రీన్ ఛానల్ లో జీతాలు ఇస్తున్నాము అదే ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల జీతాలను గ్రీన్ ఛానల్ లో ప్రతినెలా అందించేందుకు కృషి చేస్తాను అంగన్వాడి టీచర్లు హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14 వేల ఖాళీలను భర్తీ చేస్తాము ఎస్సీ వర్గీకరణ మూలంగా కాస్త ఆలస్యమైంది.. త్వరలో ఆ పోస్టులను భర్తీ చేస్తాము అధికారులు, ప్రభుత్వ సిబ్బంది సంతోషంగా ఉంటేనే సంక్షేమ పథకాలు 100% ప్రజలకు చేరుతాయి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో వినూత్న కార్యక్రమాలను చేపట్టాము అంగన్వాడి కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, ఆరోగ్యానికి, ఆటవిడుపుకు, మీతో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నాము ప్లే స్కూల్ లకు దీటుగా అంగన్వాడీలను సిద్ధం చేసి తల్లిదండ్రుల ఆర్థిక భారాన్ని తగ్గిస్తున్నాము చిన్నారుల చదువు, సౌకర్యం, ఆటవిడుపు కోసం 57 రకాల వస్తువులను అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నాం అంగన్వాడీలకు నమ్మకం కలిగించేలా అంగన్వాడి సిబ్బంది పని చేయాలి అంగన్వాడీలు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలిసేలా ప్రచార కార్యక్రమాలు చేపట్టాలి సెల్ఫీ విత్ అంగన్వాడి నీ విజయవంతం చేయాలి అంగన్వాడి కేంద్రాలకు నాసిరకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ ను బ్లాక్ లిస్టులో పెడుతున్నాము అంగన్వాడి లబ్ధిదారులకు అందిస్తున్న కోడిగుడ్ల విషయంలో జాగ్రత్తలు పాటించండి కోడి గుడ్డును ఉడకబెట్టి అలాగే ఇవ్వకుండా.. రెండు ముక్కలు చేసి ఇస్తే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మనిషి పుట్టుక నుంచి గిట్టు క వరకు అన్ని దశల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర ఎంతో కీలకం మనిషి జీవితాంతం వారికి సేవ చేసే భాగ్యం తగ్గడం నిజంగా నా అదృష్టం నాలాగే జీవితాంతం సేవ చేసే భాగ్యం మీకు దక్కడం మీ అదృష్టం నేటి చిన్నారులే రేపటి పౌరులు నేటి చిన్నారుల మీది రేపటి దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంది అందుకే అంగన్వాడీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందించడం ద్వారా మీరు దేశ సేవ చేస్తున్నారు దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని గ్రహించి పనిచేయండి కల్మషం, కల్లాకపటం లేని చిన్నారులు దేవుళ్ళతో సమానం మాధవసేవే మానవసేవ అనే నానుడిని పాటించి అంగన్వాడి కేంద్రాల్లో సేవలందించండి అంగన్వాడీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అమ్మమాట అంగన్వాడి బాట కార్యక్రమాన్ని చేపట్టండి అంగన్వాడి చిన్నారులకు మంచి నడవడిక నేర్పి, వారిలో క్రమశిక్షణ పెంపొందించే బాధ్యత అంగన్వాడీ టీచర్లు హెల్పర్లదే చిన్నారుల్లో పోషకాహార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోండి అంగన్వాడికి వచ్చే గర్భిణీలు బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారు వారి ఇబ్బందులను తొలగించేందుకు అంగన్వాడి కేంద్రాలకు బెంచీలను సరఫరా చేస్తాం అంగన్వాడి టీచర్లు వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో, అధునాతన మొబైల్స్ ను త్వరలో అందజేస్తాం అంగన్వాడీలో చిన్నారులకు అందిస్తున్న ఆహారము భోజనం nu మరింత రుచికరంగా మారుస్తాం వారంలో ఒకటి రెండు సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మారుస్తాము మనకున్న బడ్జెట్ లో అంగన్వాడి కేంద్రాలకు చిన్నారులను ఆకర్షించేందుకు వినూత్న ఆలోచనలతో ఆట వస్తువులు, అభ్యాసన మెటీరియల్ ను రూపొందించాలి మహిళా శిశు సంక్షేమ శాఖ తరపున వయోవృద్ధులకు, ట్రాన్స్ జెండర్ ల ఆత్మగౌరవాన్నీ పెంపొందించే చర్యలు చేపట్టాము ట్రాన్స్ జెండర్ ల పై ఉన్న చులకన భావాన్ని పోగొట్టి.. వారిని ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించాము అనాధ పిల్లలకు ప్రభుత్వమే తల్లిదండ్రులుగా ఉండి ఆధార్ కార్డులు ఇప్పిస్తున్నాము గతంలో ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల ఉపకరణాల కోసం ప్రతి ఏడాది 50 కోట్లు ఖర్చు చేస్తున్నాము ఇందిరమ్మ అమృతం ద్వారా కౌమార బాలికలకు పోషకాలతో కూడిన చిక్కిలను పంపిణీ చేస్తున్నాం బాల్య వివాహాలను పూర్తిస్థాయిలో అరికట్టేలా మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది పని చేయాలి సమాజం ఇంత అభివృద్ధి చెందిన ఇంకా బాల్యవివాహాలు జరగడం బాధాకరం మీ పరిధిలో ఒక్క బాల్య వివాహం జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అంగన్వాడి సిబ్బందిదే కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలను ఒకే మోడల్ లో నిర్మించాలి ఒకప్పుడు అంగన్వాడి కేంద్రాలు సమస్యలకు నిలయాలుగా ఉండేది ఐసిడిఎస్ కీమును రూపొందించిన కెఆర్ వేణుగోపాల్ వంటి ఏ అధికారులు ఉడకని మెతుకు వంటి పుస్తకాలను రాసి అంగన్వాడీ లోపాలను తెలియచెప్పారు కానీ మా హయాంలో అంగన్వాడి కేంద్రాలను సకల సదుపాయాలతో ఆహ్లాదకర కేంద్రాలుగా మార్చుతున్నాం మన అంగన్వాడి కేంద్రాలు, సేవలు దేశానికి ఆదర్శంగా నిలవాలి మంచి హృదయంతో, మానవతా దృక్పథంతో పనిచేసి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా కృషి చేయండి
Image from Minister For PRRD TELANGANA: రాజేంద్రనగర్ లోని తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థలో మహిళా శిశు సంక్షేమ...
🙏 1

Comments