Minister For PRRD TELANGANA
June 5, 2025 at 01:28 PM
*రెండు రోజులపాటు జరుగుతున్న మేధో మథన సదస్సు ముగింపు సభలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క*
*మంత్రి సీతక్క*
రెండు రోజులపాటు జరిగిన మేదో మదన సదస్సు విజయవంతమైంది
మహిళా శిశు సంక్షేమం కోసం ఎన్నో కొత్త ఆలోచనలకు ఈ సదస్సు ప్రాణం పోసింది
ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తాము
జిల్లాల్లో ఇలాంటి సదస్సులు నిర్వహించడం ద్వారా అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చు
*ఈ సదస్సులో మహిళా శిశు సంక్షేమం పై పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, మేధావులు తమ విలువైన సలహాలు ఇచ్చారు*
*మహిళా శిశు సంక్షేమం కోసం నిపుణులతో ఒక అడ్వైజరీ కమిటీ నియమిస్తాము*
వారి సలహాలు సూచనలతో శాఖ ద్వారా అందుతున్న సేవలను మరింత పటిష్టపరుస్తాము
బాలికల రక్షణ కోసం బాలికలతో స్నేహ కమిటీలను ఏర్పాటు చేస్తాము
స్వీయ రక్షణ టీములుగా స్నేహ కమిటీలు పనిచేస్తాయి
అంగన్వాడి టీచర్ల ద్వారా అమ్మాయిలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవగాహన కల్పిస్తాము
మహిళా బాలికల భద్రత మీద పనిచేసే స్వచ్చంద సంస్థలను గుర్తించి అంగన్వాడీలను వారితో అనుసంధానం చేస్తాము
త్వరలో మహిళల హక్కుల మీద పనిచేసే స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మహిళ భద్రత కోసం ప్రతిష్ట విధానాలను రూపొందిస్తాం
చానా చోట్ల ముళ్ళ పొదల్లో, చెత్తకుప్పల్లో అప్పుడే పుట్టిన బిడ్డలను వదిలేసి వెళుతున్నారు
చీమలు, కుక్కలు, చెత్త, ముండ్ల మధ్య శిశువుల ప్రాణాలు పోతున్నాయి
దీన్ని నివారించేందుకు వీలున్న చోట ఊయలలను ఏర్పాటు చేస్తాం
బిడ్డలను పారేయకుండా.. ఆ ఊయలలో వదిలేస్తే వారి బాధ్యతను మేమే స్వీకరిస్తాము
తెలంగాణ ఏర్పాటయి 10 సంవత్సరాలైనా ఇప్పటికీ బాల్య వివాహ నిరోధక చట్ట రూల్స్ ను అడాప్ట్ చేసుకోకపోవడం బాధాకరం
త్వరలో రూల్స్ ను అడాప్ట్ చేసుకుంటాం
బాల్యవివాహాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలి
గ్రామసభల్లో, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో బాల్య వివాహల వల్ల జరిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
*ఐసిడిఎస్ పథకాలకు తెలంగాణ ప్రాంతంలోనే బీజం పడింది*
1972లో మహబూబ్నగర్లో ఫ్రీడమ్ ఫైటర్ దుర్గాబాయి దేశ్ ముఖ్ గారు ఐసిడిఎస్ ప్రారంభించారు
ఆ అనుభవాల ఆధారంగానే దేశవ్యాప్తంగా ఇందిరా గాంధీ గారు icds స్కీంను విస్తరింపజేశారు
అంగన్వాడి సేవలకు ఆరాధ్యులుగా దుర్గాబాయి దేశ్ ముఖ్, ఇందిరా గాంధీ గారు నిలిచారు
వారి ఆదర్శంగా అంగన్వాడీ సేవలను ప్రతి ఇంటికి చేర్చాలి
ఏడాది వేయి అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించి ఇస్తాము
జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసి స్థలాలను గుర్తించండి
అంగన్వాడి గదుల్లోని దేశ భవిష్యత్తు ఉంది
కాబట్టి దేశ భవిష్యత్తును లిఖించేది అంగన్వాడీ సిబ్బంది
కరీంనగర్లో ప్రతి శుక్రవారం అంగన్వాడి సిబ్బంది గ్రామస్తులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు
అదేవిధంగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలి
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల అడ్మిషన్లను హాజరును పెంచాలి
*ఆకాశాన్ని చీల్చుకొని అమ్మాయిలు అంతరిక్షానికి వెళ్లినా భూమి మీద కొన్నిసార్లు రక్షణ కరువు అవుతుంది*
అందుకే అమ్మాయిల స్వీయ రక్షణ కోసం బాలికా రక్షక టీములను ఏర్పాటు చేస్తాము
*అమ్మాయిలను వేధిస్తే సంఘ బహిష్కరణకు గురవుతారు*
అమ్మాయిలను ముట్టుకుంటే కఠిన శిక్షలు
అమ్మాయిల పట్ల చెడుగా ప్రవర్తిస్తే ఇలాంటి శిక్షలు అనుభవించాల్సి వస్తుందో అబ్బాయిలకు అవగాహన కల్పించాలి
👍
🙏
3