
Kadapa Heart Beats
June 20, 2025 at 09:34 AM
*30 నుంచి ట్రిపుల్ ఐటీ కౌన్సెలింగ్*
* ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు క్యాంపస్లు ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సుకు ఎంపికైన విద్యా ర్థుల జాబితా 23వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు విడుదల చేస్తున్నట్లు ఆర్జీయూకేటీ ప్రవేశాల కన్వీనర్ ఆచార్య సండ్ర అమ రేంద్ర కుమార్ తెలిపారు.
* నూజివీడు క్యాంపస్ కు ఎంపికైన విద్యార్థులకు జూన్ 30, జులై 1న నూజివీడు క్యాంపస్ లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు. ఆర్కేవ్యాలీకి ఎంపికైన విద్యార్థులకు జూన్ 30, జులై 1న, శ్రీకాకుళం క్యాంపస్ కు ఎంపికైన వారికి జులై 2, 3 తేదీల్లో, ఒంగోలు క్యాంపస్కు జులై 4, 5 తేదీల్లో నూజివీడు క్యాంపస్ లో సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందన్నారు. అడ్మిషన్ పొందిన విద్యార్థులు జులై 14వ తేదీ నాటికి వారికి కేటాయించిన క్యాంపస్ లలో రిపోర్టు చేయాలని ప్రవేశాల కన్వీనర్ తెలిపారు.