Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
June 18, 2025 at 02:55 PM
ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి Chirag Paswan గారిని కలిశాను. పండ్లతోటల అభివృద్ధికి అన్నివిధాల అనుకూలమైన వాతావరణం కలిగిన రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సహకారం అందించాలని కోరాను. పంట చేతికొచ్చే సమయంలో గిట్టుబాటు ధర లభించక రాయలసీమ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను యువగళం పాదయాత్ర సందర్భంగా ప్రత్యక్షంగా చూశాను. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా అక్కడి రైతులకు మెరుగైన రేట్లు లభించి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు సహకరించాలని విజ్ఞప్తి చేశాను. అన్నదాతలకు మేలు చేసేందుకు మోడీజీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని, నూరుశాతం సహకారాన్ని అందిస్తానని పాశ్వాన్ జీ చెప్పారు. యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన యువగళం పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందించాను.
❤️ 👍 🙏 💛 👌 🥛 🫡 34

Comments