Nara Lokesh | TDP
June 18, 2025 at 02:56 PM
ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను న్యూడిల్లీలో కలిశాను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపడుతున్న సంస్కరణలను వివరించాను. ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేశాం. విద్యారంగ అభివృద్ధికి సలహాల కోసం ప్రతివారం టీచర్స్ యూనియన్లు, ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమవుతున్నామని చెప్పాను. జూలై 5 న జరిగే మెగా పిటిఏం కార్యక్రమానికి హాజరుకావాలని ధర్మేంద్ర ప్రధాన్ గారిని ఆహ్వానించాను. ఆగస్టులో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరగా, అందుకు అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలపై అభినందనలు తెలిపిన ధర్మేంద్ర ప్రధాన్... వాటిని అధ్యయనం చేయాల్సిందిగా కేంద్ర విద్యా శాఖ అధికారులకు సూచించారు.
👍
❤️
🙏
💛
✌
❤
👌
👏
🥛
🫡
46