Nara Lokesh | TDP
June 18, 2025 at 02:56 PM
ఈరోజు న్యూఢిల్లీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ గారితో భేటీ అయ్యాను. రాయలసీమలో హైకోర్టు బెంచి ఏర్పాటు ఆవశ్యకతను ఆయనకు వివరించాను. కర్నూలులో హైకోర్టు బెంచి అన్నది అక్కడి ప్రజల చిరకాల కోరిక, ఇందుకు సహకరించండి. న్యాయపరమైన అవసరాల కోసం రాయలసీమ ప్రజలు ఎపి రాజధానికి రావడానికి 500 కి.మీ.కు పైగా ప్రయాణించాల్సి ఉంటుంది. యువగళం పాదయాత్ర సందర్భంగా సీమ ప్రజలు, న్యాయవాదులు హైకోర్టు బెంచి చేయాలని విన్నవించారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా త్వరితగతిన బెంచి ఏర్పాటుకు సహకరించాలని కోరాను. రాష్ట్రంలోని కోర్టుల్లో జ్యుడిషియరీ ఇన్ ఫ్రాస్ట్చక్చర్ అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశాను. ఈ సందర్భంగా యువగళం పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని కేంద్రమంత్రికి అందజేశాను.
❤️
🙏
👍
❤
✌
✌️
👌
💛
🤓
🥛
83