Nara Lokesh | TDP

70.8K subscribers

Verified Channel
Nara Lokesh | TDP
June 19, 2025 at 09:59 AM
ఈరోజు న్యూఢిల్లీలో బ్రిటన్ మాజీ ప్రధాని, టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్ తో సమావేశమయ్యాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యావ్యవస్థలో ఎఐ టూల్స్ ను వినియోగించడానికి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్(టిబిఐ) ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ గతంలో అంగీకరించారు. ఆ మేరకు రాష్ట్రంలో అమలుచేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టిబిఐ సాంకేతిక మద్దతుపై చర్చించాను. గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (GiGG) సలహాబోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్ ను ఆహ్వానించాను. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్ కు TBI భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ చెప్పారు. Tony Blair Institute for Global Change
❤️ 👍 🙏 👌 💛 🐖 🫡 44

Comments