Nara Lokesh | TDP
June 20, 2025 at 04:24 PM
యోగాంధ్రలో భాగంగా విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను. 25 వేల మంది అల్లూరి జిల్లా గిరిజన విద్యార్థులు 108 నిమిషాల్లో 108 సూర్య నమస్కారాలు చేసి గిన్నీస్ రికార్డ్ సృష్టించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాను. ఈ రోజు మనం గర్వపడాల్సిన రోజు. యావత్ దేశంతో పాటు ప్రపంచం మొత్తం వైజాగ్ వైపు చూసింది. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 25వేల మంది విద్యార్థులు ఒకేసారి సూర్యనమస్కారాలు చేసి చరిత్ర సృష్టించారని పేర్కొన్నాను. ప్రధాని గారు, ముఖ్యమంత్రి గారి తరపున విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశాను.
#yogandhra
#apwillcreatehistorytomorrow
❤️
👍
🙏
👌
❤
👏
💛
🫡
👎
69