⚡SchoolEdu 👈 Join Now
June 15, 2025 at 02:37 AM
*🔊రేపు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు* *🍥హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 29వ తేదీతో ముగిసిన విషయం విదితమే. ఈ పరీక్షలకు ఏకంగా 4.2 లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్ధులు హాజరు కావ డంతో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇంటర్ పరీక్షల్లో తపి ్పన కొందరు విద్యా ర్థులు ఈ పరీక్షలకు హాజరైతే.. మరికొందరేమో మార్కులను పెంచుకునేందు కు ఇంప్రూవ్మెంట్ పరీక్షలు రాశారు. దీంతో ఇంటర్ సప్లిమెంటరీలో విద్యార్థుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే ఈ పరీక్షల మూల్యాంకనం ప్రక్రియ కూడా ముగిసింది. జూన్ 16న ఫలితాలను విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు శని వారం ప్రకటన విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 12:00 గంటలకు ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని కోరారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments