⚡SchoolEdu 👈 Join Now
June 16, 2025 at 12:36 AM
*🔊ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సిందే!*
*🔶గోల్డ్‌లోన్‌కు బ్యాంకుల కొత్త నిబంధన*
*🔷12 నెలల్లో రుణం కట్టకపోతే డిఫాల్టర్*
*🔶మరో 5 నెలలు దాటితే బంగారం వేలం*
*🔷రిజర్వ్ బ్యాంక్ డ్రాఫ్ట్ మార్గదర్శకాలు*
*🍥హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): ‘మీకు గోల్డ్‌లోన్ కావాలా? కుదువబెట్టిన బంగారం తకువ వడ్డీకి మరో చోట పెట్టాలనుకుంటున్నారా? వంటి ప్రకటనలు చూడటానికి బాగుంటాయి. ప్రజల ఆర్థిక అవసరాల కోసం గోల్డ్‌లోన్లు ఆకర్షణీయ ఎంపికగా కనిపిస్తాయి. అయితే, భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) 2025 డ్రాఫ్ట్ మార్గదర్శకాలు బంగారు రుణాలపై కఠిన నిబంధనలు విధించాయి. ఈ నూతన నిబంధనలు గోల్డ్‌లోన్ తీసుకునేవారికి కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. లోన్ల చెల్లింపు కాలం, వడ్డీ రేట్లు, ఇతర షరతులు ప్రజల పాలిట పిడుగులా మారాయి. వైద్య చికిత్స కోసం, పిల్లల చదువుల కోసం, వ్యాపారం నిమిత్తం, వ్యవసాయ అవసరాల కోసం బ్యాంకుల నుంచి బంగారం కుదువబెట్టి తీసుకొనే రుణగ్రస్తులు ఇకపై జాగ్రతగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గోల్డ్‌లోన్ తీసుకొని ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థిక పరిస్థితులను ముందే అంచనా వేసుకొని గోల్డ్‌లోన్ కోసం ముందుకెళ్లాల్సి ఉంటుంది. గతంలో గోల్డ్‌లోన్ తీసుకుంటే ఏడాదికోసారి వడ్డీ చెల్లించి రెన్యువల్ చేసుకొనే సౌలభ్యం ఉండేది. కానీ, ఇప్పుడు దానిని తొలగించారు. 12 నెలలు గరిష్ఠ పరిమితి విధించారు. 12 నెలలు దాటితే రుణంతోపాటు వడ్డీ మొత్తం చెల్లించాల్సిందే. మళ్లీ రుణం కూడా అదే రోజు ఇవ్వరు. లోను చెల్లించిన తర్వాత మరుసటి రోజు తిరిగి ఆ బంగారం ద్వారా రుణం పొందాలనే నిబంధన పెట్టారు.*
*💥15 నెలలు దాటితే బంగారం వేలం*
*🌀బ్యాంకులో బంగారం కుదువబెట్టి తీసుకున్న లోను మొత్తాన్ని గరిష్ఠంగా 12 నెలల్లోగా అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించాలి. గడువులోగా చెల్లించకుంటే రుణగ్రస్తులను బ్యాంకులు డిఫాల్టర్‌గా ప్రకటిస్తాయి. అదనంగా 3 నెలలు దాటితే.. అంటే రుణం తీసుకొని 15 నెలలు దాటితే రుణగ్రస్తులకు సమాచారం అందించి బంగారం వేలం వేస్తారు. గతంలో ఇలాంటి నిబంధన లేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడాదిలోగా రుణం మొత్తాన్ని వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే.*
*💥రుణ పునరుద్ధరణకు షరతులు*
*💠లోన్-టు-వాల్యూ (ఎల్‌టీవీ) నిష్పత్తి ప్రకా రం బంగారం (22 క్యారెట్లు) విలువలో 75 శా తం వరకు మాత్రమే రుణం ఇస్తారు. రుణ మొత్తా న్ని వడ్డీతోసహా గరిష్ఠంగా 12 నెలల్లోగా చెల్లించాలి. ప్రైవేటు, బిజినెస్ ఈఎంఐ ఆధారిత రుణాలకు 36 నెలలు వరకు గడువు ఉన్నది. రుణం పునరుద్ధరించాలంటే కూడా ఆర్బీఐ కొన్ని షరతులు విధించింది. రుణ ఖాతా యాక్టివ్‌గా ఉండా లి. మొత్తం వడ్డీ చెల్లించి ఉండాలి. బంగారం విలువ నిర్ధారణ, వేలం ప్రక్రియలో పూర్తి పారదర్శకత తప్పనిసరిగా ఉండాలి. రుణం చెల్లింపు కాలం తగ్గడం, కఠిన షరతులు ప్రజలను ఆర్థిక ఒత్తిడికి గురిచేసే ప్రమాదం ఉన్నది.*
*💥వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు పోల్చి చూడాలి*
*🥏బంగారు రుణం తీసుకునే ముందు రుణగ్రహీతలు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను పోల్చి చూడాలి. ఏది మనకు అనుకూలంగా ఉంటుందో అంచనా వేసుకొని ఆ బ్యాంకులోనే రుణం తీసుకోవాలి. రుణం చెల్లించే సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. లేదంటే బంగారం వేలం వేసే ప్రమాదం ఉంటుంది. తీసుకున్న రుణం ఎం త? వడ్డీ ఎంత? ఈఎంఐ ఎంత? మొత్తం పరిగణనలోకి తీసుకోవాలి. ఆర్బీఐ నూతన నిబంధనలు గోల్డ్‌లోన్లను మరింత క్రమబద్ధీకరించినప్పటికీ, రుణగ్రహీతలు తమ ఆర్థిక స్థితిని జాగ్రత్తగా విశ్లేషించి నిర్ణయం తీసుకోవాలి. లేదంటే, బంగారం కోల్పోవడంతోపాటు ఆర్థిక కష్టాలు కొని తెచ్చుకోవాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.*
*💥ఒకో బ్యాంకు ఒకో వడ్డీ*
*🛟గోల్డ్ లోన్ల వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు కూడా వివిధ బ్యాంకులను బట్టి మారుతూ ఉన్నాయి. కొన్ని బ్యాంకులు 8 శాతం వడ్డీ వేస్తే, మరికొన్ని బ్యాంకులు కొంత ఎకువగా, ఇంకొన్ని తకువ వడ్డీలు విధిస్తున్నాయి. ప్రాసెసింగ్ ఫీజు విషయంలో కూడా వివిధ టారిఫ్‌లను అమలు చేస్తున్నాయి. కొన్ని బ్యాంకులు 3 లక్షల వరకు ప్రాసెసింగ్ ఫీజు విధించకపోగా, మరికొన్ని బ్యాంకులు విధిస్తున్నాయి.*
*💥బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ)*
*➡️వడ్డీ రేటు: 8.85%-9.6%(వ్యవసాయ రుణాలకు 8.85% నుంచి)*
*➡️చెల్లింపు కాలం: మొత్తం చెల్లింపు గరిష్ఠంగా 12 నెలలు, ఈఎంఐ కోసం 36 నెలలు*
*➡️ప్రాసెసింగ్ ఫీజు: రూ. 3 లక్షల వరకు రుణాలకు ఫీజు లేదు. ఆపై 0.50%*
*➡️ప్రత్యేకత: తకువ ప్రాసెసింగ్ ఫీజు, వ్యవసాయ రుణాలకు అనుకూల వడ్డీ రేట్లు*
*💥భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్బీఐ)*
*➡️వడ్డీ రేటు: 8.75%-9.45%*
*➡️చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 36 నెలలు (ఈఎంఐ)*
*➡️ప్రాసెసింగ్ ఫీజు: 3 లక్షల వరకు రుణాలకు ఫీజు లేదు. ఆపై 0.50% + జీఎఎస్టీ*
*➡️ప్రత్యేకత: వేగవంతమైన ప్రాసెసింగ్, తకువ డాక్యుమెంటేషన్*
*💥హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు*
*➡️వడ్డీ రేటు: 8.50%-9.90%*
*➡️చెల్లింపు కాలం: 12 నెలలు, 24-36 నెలలు (ఈఎంఐ)*
*➡️ప్రాసెసింగ్ ఫీజు: 0.50%-1% + జీఎస్టీ*
*➡️ప్రత్యేకత: డిజిటల్ గోల్డ్‌లోన్ సౌకర్యం*
*💥ఐసీఐసీఐ బ్యాంక్*
*➡️వడ్డీ రేటు: 8.75%-9.50%*
*➡️చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 36 నెలలు (ఈఎంఐ)*
*➡️ప్రాసెసింగ్ ఫీజు: 0.50%-1% + జీఎస్టీ*
*➡️ప్రత్యేకత: వ్యక్తిగత అవసరాల కోసం ఫ్లెక్సిబుల్ రుణాలు*
*💥కెనరా బ్యాంక్*
*➡️వడ్డీ రేటు: 8.85%-9.25%*
*చెల్లింపు కాలం: 12 నెలలు (బుల్లెట్), 36 నెలలు (ఈఎంఐ)*
*➡️ప్రాసెసింగ్ ఫీజు: 0.50% + జీఎస్టీ.*
*➡️ప్రత్యేకత: వ్యవసాయ, వ్యక్తిగత రుణాలకు అనుకూలం*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m