⚡SchoolEdu 👈 Join Now
June 19, 2025 at 12:51 AM
*🔊FASTag annual pass: రూ.3 వేలకు వార్షిక టోల్‌పాస్‌* *🔶వాణిజ్యేతర వాహనదారులకు కేంద్రం శుభవార్త* *🔷హైవేలపై 200 ట్రిప్పులు తిరగొచ్చు* *🔶ఒక్కో టోల్‌గేట్‌ ఒక్కో ట్రిప్పు* *🔷ఆగస్టు 15 నుంచి అమల్లోకి..* *🍥ఈనాడు, దిల్లీ: జాతీయ రహదారులు(ఎన్‌హెచ్‌), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వే(ఎన్‌ఈ)లపై ప్రయాణించే వాణిజ్యేతర ప్రైవేటు వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. వీరి కోసం ఆగస్టు 15 నుంచి రూ.3వేల వార్షిక ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ విధానాన్ని ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రూ.3వేలతో ఫాస్టాగ్‌ టోల్‌పాస్‌ తీసుకునే కార్లు, జీపులు, వ్యాన్ల యజమానులు ఏడాదిపాటుగానీ, 200 ట్రిప్పుల వరకుగానీ జాతీయ రహదారులపై ప్రయాణించవచ్చు. కొత్త విధానం వ్యక్తిగత కార్లు, జీపులు, వ్యాన్లకు మాత్రమే వర్తిస్తుంది. వాణిజ్య వాహనాలకు చెల్లుబాటు కాదు. 200 ట్రిప్పులు పూర్తయ్యాక మళ్లీ రూ.3వేలతో యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఏడాదిలో ఎన్ని సార్లైనా చేసుకోవచ్చు. ఇప్పటికే ఫాస్టాగ్‌ ఉన్నవారు మళ్లీ కొత్త ఫాస్టాగ్‌ను కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. పాత ఫాస్టాగ్‌లోనే టోల్‌పాస్‌ను యాక్టివేట్‌ చేసుకోవచ్చు.* *➡️ఒక్కో టోల్‌గేట్‌ను ఒక్కో ట్రిప్పుగా లెక్కిస్తారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లేవారు 4 టోల్‌గేట్లను దాటాల్సి ఉంటుంది. అంటే వారు నాలుగు ట్రిప్పులను పూర్తి చేసినట్లుగా లెక్కిస్తారు. తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులుగా లెక్కిస్తారు. అంటే హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లి రావడానికి 8 ట్రిప్పులు అవుతాయి.* *➡️ఈ పాస్‌లను ఛాసిస్‌ నంబరు ఆధారంగా కాకుండా.. వాహన రిజిస్ట్రేషన్‌ నంబరు ద్వారానే జారీ చేస్తారు.* *➡️వార్షిక పాస్‌ తీసుకోవడం తప్పనిసరేమీ కాదు. తక్కువ ట్రిప్పులు తిరిగేవారు, ఒకేసారి రూ.3వేలు చెల్లించడానికి ఇష్టపడనివారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్టాగ్‌ విధానాన్ని కొనసాగిస్తూ టోల్‌గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.* *➡️దేశవ్యాప్తంగా 1,063 టోల్‌ప్లాజాలున్నాయి. వాటి సంఖ్య ఏపీలో 72గా, తెలంగాణలో 36గా ఉంది. 2024 డిసెంబరు 1 నాటికి దేశంలో 10.1 కోట్ల ఫాస్టాగ్‌లను వాహనదారులు తీసుకున్నారు.* *➡️ఫాస్టాగ్‌ల ద్వారా జాతీయ రహదారులపై రోజుకు సగటున రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. టోల్‌ప్లాజాల ద్వారా వెళ్లే వాహనాల్లో 53శాతం కార్లు, జీపులు, వ్యాన్లు ఉంటున్నాయి.* *💥సగటున రూ.7 వేల లాభం* *🎙️గడ్కరీ* *💫దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై తక్కువ ఖర్చుతో రాకపోకలు సాగించడానికి వార్షిక టోల్‌పాస్‌ ఉపయోగపడుతుందని రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. కొత్త పాస్‌ల యాక్టివేషన్, రెన్యువల్‌ కోసం రాజ్‌మార్గ్‌యాత్ర యాప్, ఎన్‌హెచ్‌ఏఐ, ఎంవోఆర్‌టీహెచ్‌ వెబ్‌సైట్లలో ప్రత్యేక లింక్‌లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన వెల్లడించారు. ‘‘60 కిలోమీటర్లలోపే రెండు టోల్‌ప్లాజాలు ఉన్నచోట్ల చాలాకాలంగా ఎదురవుతున్న సమస్యలను కొత్త పాస్‌ విధానం పరిష్కరిస్తుంది. వార్షిక టోల్‌పాస్‌లతో వాహనదారులకు సగటున రూ.7వేల ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం ఒక్కో టోల్‌గేట్‌వద్ద రూ.50 నుంచి రూ.100కుపైగా టోల్‌ ఫీజు వసూలు చేస్తున్నారు. వార్షిక పాస్‌తో ఒక్కో టోల్‌గేట్‌ దాటడానికి సగటున రూ.15 ఖర్చవుతుంది. ఇప్పుడున్న విధానం ప్రకారం... ఒక్కో గేట్‌వద్ద సగటున కనీసం రూ.50 చెల్లిస్తారనుకుంటే.. 200 గేట్లు దాటడానికి రూ.10వేలు చెల్లించాల్సి ఉంటుంది. వార్షిక పాస్‌తో ఇది రూ.3వేలకు తగ్గుతుంది. దీనివల్ల వాహనదారులకు ఏటా సగటున రూ.7వేల ప్రయోజనం చేకూరుతుంది. రాష్ట్ర రహదారులకు ఇది వర్తించదు. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల పరిధిలోకి వచ్చే ఎక్స్‌ప్రెస్‌వేలు, స్టేట్‌ హైవేల్లో ఈ వార్షిక ఫాస్టాగ్‌ సాధారణ ఫాస్టాగ్‌లా పని చేస్తుంది. ఆ ప్లాజాలో వసూలుచేసే సాధారణ మొత్తాన్ని అక్కడ చెల్లించాల్సి ఉంటుంది’’ అని వివరించారు.* *Click here to Join* https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m

Comments