⚡SchoolEdu 👈 Join Now
June 20, 2025 at 01:02 AM
*🔊24 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్*
*🔶ప్రభుత్వ కళాశాలలు రెండు పెరిగాయ్*
*🔷ప్రైవేట్‌లో రెండు తగ్గాయ్*
*🔶మొత్తంగా ఈసారి తగ్గిన సీట్లు 1,836*
*🍥ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఈ నెల 24 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. రెండు విడతల్లో పూర్తికానుంది. పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ప్రవేశాల కన్వీనర్ శ్రీదేవసేన గురువారం విడుదల చేశారు. ఈసారి మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులలో రెండు ప్రభుత్వ కళాశాలలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. దాంతో ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది. అదే సమయంలో రెండు ప్రైవేట్ కళాశాలలు తగ్గిపోవడంతో వాటి సంఖ్య 57 నుంచి 55కు పడిపోయింది. గత విద్యా సంవత్సరం(2024-25) మొత్తం 30,468 సీట్లు ఉండగా...అందులో 20,819(68 శాతం) భర్తీ అయ్యాయి. కొత్తగా వచ్చిన రెండు కళాశాలల్లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 42 సీట్లు కలవనున్నాయి. కొత్త కళాశాలల్లో ఒక్కో దాంట్లో మూడు బ్రాంచీలు...180 సీట్ల చొప్పున అందుబాటులోకి రానున్నాయి. ఈసారి మొత్తం 28,632 సీట్లు ఉంటాయి. గత ఏడాదితో పోలిస్తే 1,836 సీట్లు తగ్గాయి. పాలిటెక్నిక్ కళాశాలల్లో యాజమాన్య కోటా ఉండదు. వంద శాతం కన్వీనర్ కోటా కిందే భర్తీ చేస్తారు. జులై 30 నాటికి స్పాట్ ప్రవేశాలు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది.*
*💥తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్...*
*➡️ఈనెల 24 నుంచి 28 వరకు: ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ల బుకింగ్*
*➡️26-29 వరకు: ధ్రువపత్రాల పరిశీలన*
*➡️26 నుంచి జులై 1 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు*
*➡️జులై 4న: సీట్ల కేటాయింపు*
*➡️4- 6 వరకు: వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి...సెల్ఫ్ రిపోర్టింగ్*
*💥రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్...*
*➡️జులై 9-10 వరకు: ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ల బుకింగ్*
*➡️11వ తేదీ: ధ్రువపత్రాల పరిశీలన*
*➡️11-12 వరకు: వెబ్ ఆప్షన్ల నమోదు*
*➡️15న: సీట్ల కేటాయింపు*
*➡️18న: తరగతులు ప్రారంభం*
*Click here to Join*
https://whatsapp.com/channel/0029Va5HyFoFMqreW1ZoJp3m
🎱
1